AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

EV Scooters: అమ్మకాల్లో మూడో స్థానానికి పడిపోయిన ఓలా.. దూసుకుపోతున్న టీవీఎస్

భారతదేశంలో ఇటీవల కాలంలో ఈవీ స్కూటర్ల అమ్మకాలు రికార్డులను స‌ృష్టిస్తున్నాయి. ముఖ్యంగా దేశంలోని మధ్య తరగతి ప్రజలు పెరుగుతున్న పెట్రోల్ ధరల నేపథ్యంలో ఈవీ స్కూటర్లను ఆశ్రయించడంతో అమ్మకాలు భారీగా పెరిగాయి. అయితే దేశంలో ఎన్ని ఈవీ స్కూటర్లు అందుబాటులో ఉన్నా కొన్ని కంపెనీల స్కూటర్ల అమ్మకాలు ఎక్కువగా ఉన్నాయి. ఇటీవల విడుదలైన డేటా ప్రకారం ఈవీ స్కూటర్ల అమ్మకాల గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం.

EV Scooters: అమ్మకాల్లో మూడో స్థానానికి పడిపోయిన ఓలా.. దూసుకుపోతున్న టీవీఎస్
tvs i qube
Nikhil
|

Updated on: Jun 05, 2025 | 7:00 PM

Share

దేశంలో ఈవీ స్కూటర్ల అమ్మకాల్లో టీవీఎస్ కొత్త రికార్డులను సృష్టించింది. ఈ కంపెనీ వరుసగా రెండోసారి ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాల్లో అగ్రస్థానంలో నిలిచింది. టీవీఎస్‌కు చెందిన ఐక్యూబ్‌కు మార్కెట్లో బలమైన డిమాండ్ ఉంది. ఈ స్కూటర్ హోసూర్‌కు చెందిన ఓలా వంటి ఇతర బ్రాండ్లను కంటే అమ్మకాల్లో అగ్రస్థానంలో ఉంది. మే 2025లో దేశంలో ఈవీ స్కూటర్ల అమ్మకాలను పరిశీలిస్తే అత్యధికంగా అమ్ముడైన ఎలక్ట్రిక్ స్కూటర్లలో టీవీఎస్ తన స్థానాన్ని నిలుపుకుందని నిపుణులు చెబుతన్నారు. టీవీఎస్ మే 2025లో 24,560 యూనిట్లను అమ్మింది. టీవీఎస్ దాని ఈవీ  పోర్ట్‌ఫోలియోలో రెండు ఎలక్ట్రిక్ స్కూటర్‌లను ఐక్యూబ్, ఐక్యూబ్ ఎక్స్ అందుబాటులో ఉంచింది. టీవీఎస్ కొన్ని రోజుల క్రితం అమ్మకాలను పెంచుకునేందుకు ప్రత్యేక ఆఫర్లను కూడా ప్రకటించింది. 

ఈవీ స్కూటర్ల అమ్మకాల్లో రెండవ స్థానంలో బజాజ్ చేతక్ ఉంది. మే 2025లో బజాజ్ చేతక్ యొక్క 21,770 యూనిట్లను విక్రయించింది, ఓలా ఎలక్ట్రిక్‌ను అధిగమించింది. ఓలా మే 2025లో మూడో స్థానానికి పడిపోయింది. ఓలా 18,499 యూనిట్లను విక్రయించింది. ఓలా ఎస్1 శ్రేణి తిరిగి పుంజుకున్నా, ధర తక్కువగా ఉన్నా అమ్మకాల్లో మాత్రం మూడో స్థానానికి చేరింది. 

మే 2025లో 12,840 యూనిట్ల అమ్మకాలతో ఏథర్ ఎనర్జీ నాల్గవ స్థానంలో నిలిచింది. గత ఏడాది ఏప్రిల్‌లో ప్రారంభించిన రిజ్టా అమ్మకాల సంఖ్య 1 లక్షను అధిగమించింది. మే 2025కి 7,164 యూనిట్లను విక్రయించి హీరో టాప్ ఐదు ఎలక్ట్రిక్ స్కూటర్ అమ్మకాల్లో తన చోటును పదిలం చేసుకుంది. హీరో విడా కూడా ఇటీవలే రిఫ్రెష్ అయ్యింది. అలాగే మే 2025 అమ్మకాలతో విడా బ్రాండ్ వాహన్ మార్కెట్ వాటా 7.2% కలిగి ఉంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
నాకు వీడు వద్దు.. తెగేసి చెప్పిన ప్రేమ.. ధీరజ్ మనసును ముక్కలు..
నాకు వీడు వద్దు.. తెగేసి చెప్పిన ప్రేమ.. ధీరజ్ మనసును ముక్కలు..
గాడ నిధ్రలో ఉండగా ఊహించని ప్రమాదం.. ఇద్దరు మృతి
గాడ నిధ్రలో ఉండగా ఊహించని ప్రమాదం.. ఇద్దరు మృతి
ఇంటికి ఏ తలుపులు మంచివి? చెక్క, WPC, PVC డోర్లలో ఏది బెస్ట్?
ఇంటికి ఏ తలుపులు మంచివి? చెక్క, WPC, PVC డోర్లలో ఏది బెస్ట్?
యూపీఐ ద్వారా పీఎఫ్ విత్ డ్రా.. అప్పటినుంచే అందుబాటులోకి..
యూపీఐ ద్వారా పీఎఫ్ విత్ డ్రా.. అప్పటినుంచే అందుబాటులోకి..
మజిలీ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా.. ? ఇప్పుడు చూస్తే ..
మజిలీ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా.. ? ఇప్పుడు చూస్తే ..
పడవతో రోడ్డుపైకి జనాలు.. కంపెనీకి రూ.50వేల జరిమానా?
పడవతో రోడ్డుపైకి జనాలు.. కంపెనీకి రూ.50వేల జరిమానా?
ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్‌లో ఉరేసుకొని కానిస్టేబుల్ ఆత్మహత్య!
ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్‌లో ఉరేసుకొని కానిస్టేబుల్ ఆత్మహత్య!
మనం కట్టిన ప్రీమియం డబ్బులతో ఎల్‌ఐసీ ఏం చేస్తుందో తెలుసా..?
మనం కట్టిన ప్రీమియం డబ్బులతో ఎల్‌ఐసీ ఏం చేస్తుందో తెలుసా..?
డీమార్ట్‌లో కొనడం కాదు.. మీ వస్తువులను అమ్మడం ఎలాగో తెలుసా..?
డీమార్ట్‌లో కొనడం కాదు.. మీ వస్తువులను అమ్మడం ఎలాగో తెలుసా..?
హైదరాబాద్‌లో ట్రంప్ టవర్స్.. ఎన్ని వేల కోట్లతో నిర్మిస్తున్నారంటే
హైదరాబాద్‌లో ట్రంప్ టవర్స్.. ఎన్ని వేల కోట్లతో నిర్మిస్తున్నారంటే