Recharge For Data: ఇంటర్నెట్ డేటా కోసం రీఛార్జ్ చేస్తున్నారా.? అయితే ఓసారి ఈ ఆఫర్లను చూడండి..
Best Recharge Offers For Data: కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో మళ్లీ చాలా కంపెనీలు వర్క్ ఫ్రమ్ హోమ్ విధానాన్ని అవలంభిస్తున్నాయి. అంతేకాకుండా కర్ఫ్యూ, కరోనా కేసులు పెరుగుతోన్న....
Best Recharge Offers For Data: కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో మళ్లీ చాలా కంపెనీలు వర్క్ ఫ్రమ్ హోమ్ విధానాన్ని అవలంభిస్తున్నాయి. అంతేకాకుండా కర్ఫ్యూ, కరోనా కేసులు పెరుగుతోన్న నేపథ్యంలో ప్రజలు ఇళ్లకే పరిమితమవుతున్నారు. దీంతో సహజంగానే ఇంటర్నెట్ వినియోగం పెరుగుతుంది. ఈ నేపథ్యంలో రూ. 300 లోపు మంచి డేటాను అందిస్తోన్న కొన్ని ఆకర్షణీయమైన ఆఫర్లపై ఓ లుక్కేయండి..
ఎయిర్‌టెల్ ఆఫర్లు..
ప్రత్యర్థి కంపెనీల నుంచి పోటీ తట్టుకునే క్రమంలో ఎయిర్‌టెల్ ఇంటర్నెట్ వినియోగదారులను లక్ష్యంగా చేసుకొని కొన్ని ఆకర్షణీయమైన ఆఫర్లను తీసుకొచ్చింది. ముఖ్యంగా రూ. 249, రూ. 279, రూ. 289, రూ. 299లతో రీఛార్జ్ చేస్తే రోజుకు 1.5 జీబీతో పాటు పలు రకాల ఆఫర్లు అందిస్తోంది. డేటాతో పాటు అన్‌లిమిటెడ్ కాల్స్, రోజుకు 100 ఎస్ఎమ్ఎస్‌లతో పాటు అమేజాన్ ప్రైమ్ వీడియో మొబైల్ ఎడిషన్‌ను ఉచితంగా అందిస్తోంది. ఇక రూ. 289 రీఛార్జ్‌తో నెల రోజుల పాటు జీ5 ప్రీమియం అందిస్తోంది. ఇక పైన తెలిపిన అన్ని రీఛార్జ్ ప్లాన్స్‌తో ఎయిర్ టెల్ ఎక్స్‌ట్రీమ్, హల్లో ట్యూన్స్, వింక్ మ్యూజిక్ వంటి వాటిని ఉచితంగా అందిస్తున్నారు.
జియో రూ. 199 ఆఫర్..
జియో అందిస్తోన్న ఈ ఆఫర్ ద్వారా రోజుకు 1.5 జీబీ డేటాను 28 రోజుల వ్యాలిడిటీతో అందిస్తోంది. ఈ లెక్కన నెలకు మొత్తం 42 జీబీ డేటా లభిస్తుందన్నమాట. వీటితో పాటు అన్‌లిమిటెడ్ కాల్స్ కూడా మీ సొంతం .
వీఐ రూ. 249 ఆఫర్..
వీఐ అందిస్తోన్న ఈ రీఛార్జ్ ఆఫర్‌తో 28 రోజుల పాటు రోజుకు 1.5 జీబీతో పాటు 100 ఎస్ఎమ్ఎస్‌లు పొందవచ్చు. అంతేకాకుండా వీఐ మూవీస్, టీవీలను కూడా ఉచితంగా చూడొచ్చు. వీటితో పాటు తాజాగా వూట్ సేవలను కూడా అందించింది. ఇక ఈ ఆఫర్‌ను యూజర్ ఒకవేళ యాప్ నుంచి చేసుకుంటే.. వారాంతాల్లో అదనంగా 5 జీబీ పొందొచ్చు.
రూ. 300 లోపు రీఛార్జ్‌తో రోజుకు 2 జీబీ ఆఫర్లు..
ఎయిర్‌టెల్ రూ. 298..
ఈ ఆఫర్ ద్వారా రోజుకు 2 జీబీ డేటాతో పాటు 100 ఉచిత ఎస్ఎమ్ఎస్‌లు, అపరిమిత వాయిస్ కాల్స్‌ను 28 రోజుల వ్యాలిడిటీతో పొందొచ్చు. వీటితో పాటు ఎయిర్‌టెల్ ఎక్స్‌ట్రీమ్, వింక్ మ్యూజిక్, ఉచితంగా ఆన్‌లైన్ కోర్సులు, అంతేకాకుండా ఫాస్ట్‌ట్యాగ్‌పైన రూ. 150 క్యాష్ బ్యాక్ అందిస్తోంది. అంతేకాకుండా భారతీ ఆక్సా లైఫ్ ఇన్సూరెన్స్ కూడా అందిస్తుంది. ఇక ఎయిర్‌టెల్ థ్యాంక్స్ యాప్ ద్వారా ఈ రీఛార్జ్ చేసుకుంటే.. రూ. 50 క్యాష్‌బ్యాక్‌తో పాటు అదనంగా 2 జీబీ డేటా అందించనున్నారు.
జియో రూ. 249 ప్లాన్..
ఈ ఆఫర్‌తో 28 రోజుల పాటు రోజుకు 2 జీబీ డేటా, అపరిమిత వాయిస్ కాల్స్‌తో పాటు రోజుకు 100 ఎస్ఎమ్ఎస్‌లు పొందొచ్చు. అంతేకాకుండా జియో యాప్స్‌ను ఉచితంగా పొందొచ్చు.
వీఐ రూ. 299 ఆఫర్..
ఈ ఆఫర్ ద్వారా రోజుకు 4 జీబీ డేటాను పొందొచ్చు. 28 రోజుల పాటు కాలపరిమితి ఉండే ఈ ఆఫర్‌తో పాటు అన్‌లిమిటెడ్ ఉచిత కాల్స్ కూడా అందించనున్నారు. అంతేకాకుండా యూజర్లు ఈ రీఛార్జ్ ద్వారా ఎమ్‌పీఎల్ యాప్‌లో గేమ్స్ ఆడడానికి రూ. 125 క్యాష్ బోనస్ రూపంలో లభిస్తుంది. జోమోటాతో పాటు వీఐ మూవీస్‌పై డిస్కౌంట్ కూడా లభిస్తుంది.
Also Read: Hanuman Birth Place: అంజనాద్రే హనుమంతుడి జన్మస్థలం.. స్పష్టంచేసిన టీటీడీ.. ఇంకా ఏం చెప్పిందంటే..?
E-Waste Threat: ప్రపంచం ముందుకు మరో పెను ముప్పు.. హెచ్చరించిన ఐక్యరాజ్యసమితి.. కరో సంభవ్!