Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Best Car Loans: ఈ బ్యాంకుల్లో కారు లోన్ అతి తక్కువ వడ్డీకే లభిస్తుంది.. రూ. 5 లక్షల రుణంపై ఇఎంఐ ఎంతంటే..

ప్రస్తుత కాలంలో భారీగా పెరుగుతున్న బైక్ ధరలను దృష్టిలో ఉంచుకుని.. అదే ధరకు అందుబాటులో ఉన్న కార్లను కొనేందుకు ఇంట్రస్ట్ చూపుతున్నారు జనాలు. మరికొందరు ఖరీదైన, విలాసవంతమైన కార్లను కొనడానికి ఇష్టపడుతున్నారు. తద్వారా వారు తమ కుటుంబంతో లాంగ్ డ్రైవ్‌లకు వెళ్లవచ్చని, తమ అవసరానికి ఉపయోగించొచ్చని భావిస్తారు. అయితే, మీ కోరిక నెరవేరాలంటే.. మీ ఖాతాల్లో డబ్బులు కూడా ఉండాలి. లగ్జరీ కార్లు కార్లు కొనాలంటే..

Best Car Loans: ఈ బ్యాంకుల్లో కారు లోన్ అతి తక్కువ వడ్డీకే లభిస్తుంది.. రూ. 5 లక్షల రుణంపై ఇఎంఐ ఎంతంటే..
Car Loan
Follow us
Shiva Prajapati

|

Updated on: Sep 10, 2023 | 10:00 AM

ప్రస్తుత కాలంలో భారీగా పెరుగుతున్న బైక్ ధరలను దృష్టిలో ఉంచుకుని.. అదే ధరకు అందుబాటులో ఉన్న కార్లను కొనేందుకు ఇంట్రస్ట్ చూపుతున్నారు జనాలు. మరికొందరు ఖరీదైన, విలాసవంతమైన కార్లను కొనడానికి ఇష్టపడుతున్నారు. తద్వారా వారు తమ కుటుంబంతో లాంగ్ డ్రైవ్‌లకు వెళ్లవచ్చని, తమ అవసరానికి ఉపయోగించొచ్చని భావిస్తారు. అయితే, మీ కోరిక నెరవేరాలంటే.. మీ ఖాతాల్లో డబ్బులు కూడా ఉండాలి. లగ్జరీ కార్లు కొనాలంటే.. మినిమం రూ. 40 నుంచి రూ. 50 లక్షలు పెట్టాల్సిందే. ఒక ఫ్యామిలీకి సరిపోయే కారు కావాలంటే.. అద్భుతమైన ఫీచర్స్‌తోనే రూ. 7 నుంచి 8 లక్షల మధ్యలో కార్లు బోలెడు ఉన్నాయి మార్కెట్‌లో. ప్రస్తుత కాలంలో చాలా మంది ఈ కార్లవైపే దృష్టి పెడుతున్నారు. అయితే, కార్లను కొనుగోలు చేసేందుకు చాలా మంది బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుంటున్నారు. మీరు కూడా కారు కొనుగోలు చేయాలని భావిస్తున్నారా? అయితే, మీకోసమే ఈ వార్త. ప్రస్తుతం చాలా బ్యాంకులు కార్ల కొనుగోలుపై రుణాలు అందిస్తున్నాయి. అతి తక్కువ వడ్డీ రేట్లకు రుణాలను మంజూరు చేస్తున్నాయి.

చాలామంది కారును కొనుగోలు చేయడానికి రూ. 5 లక్షల వరకు రుణాలు తీసుకుంటారు. మిగిలిన డౌన్‌పేమెంట్‌ను వారి స్వంత డబ్బును పే చేస్తారు. కార్లను కొనుగోలు చేయడానికి తక్కవ వడ్డీ రేట్లకే రుణాలు మంజూరు చేస్తున్న 5 ప్రభుత్వ రంగ బ్యాంకుల గురించి ఇవాళ మనం తెలుసుకుందాం..

కెనరా బ్యాంక్..

మీరు కారు కొనాలని ఆలోచిస్తున్నట్లయితే, కెనరా బ్యాంక్ నుండి రుణం తీసుకోవచ్చు. కెనరా బ్యాంక్ ప్రస్తుతం 8.80 నుండి 11.95 శాతం వడ్డీకి కార్ లోన్‌లను అందిస్తోంది. విశేషమేమిటంటే, ఎక్కువ EMI చెల్లించాల్సిన అవసరం ఉండదు. దీని కారణంగా మీ బడ్జెట్ పెద్దగా ప్రభావితం కాదు. కారు కొనడానికి కెనరా బ్యాంక్ నుండి రూ. 5 లక్షల వరకు రుణం తీసుకుంటే, మీ నెలవారీ EMI రూ. 10,331 నుండి రూ. 11,110 మధ్య ఉండవచ్చు. అలాగే, కెనరా బ్యాంక్ మీకు రూ. 1,000 నుండి రూ. 5,000 వరకు ప్రాసెసింగ్ ఫీజును వసూలు చేస్తుంది.

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా..

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 8.65 నుండి 9.70 శాతం వడ్డీతో రూ. 5 లక్షల వరకు కార్ లోన్ ఇస్తోంది. ఈ లోన్‌పై నెలవారీ EMI రూ. 10,294 నుండి రూ. 10,550 మధ్య ఉంటుంది. అయితే, రుణ మొత్తంలో 0.25 శాతం ప్రాసెసింగ్ ఫీజు కూడా చెల్లించాల్సి ఉంటుంది.

పంజాబ్ నేషనల్ బ్యాంక్..

మీరు పంజాబ్ నేషనల్ బ్యాంక్ నుండి కారు రుణం తీసుకుంటే, 8.75 నుండి 9.60 శాతం వరకు వడ్డీతో రుణం లభిస్తుంది. మీరు EMIగా ప్రతి నెలా రూ. 10,319 నుండి రూ. 10,525 వరకు చెల్లించాలి. PNB బ్యాంక్ ప్రాసెసింగ్ ఫీజు 0.25 శాతం, ఇది రూ. 1,000 నుండి 1,500 వరకు ఉంటుంది.

యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా..

యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రస్తుతం కార్ లోన్‌పై 8.75 నుండి 10.50 శాతం వరకు వడ్డీని వసూలు చేస్తోంది. మీ నెలవారీ EMI రూ. 10,319 నుండి రూ. 10,747 మధ్య ఉంటుంది. ఇది కాకుండా, బ్యాంక్ మీకు రూ. 1,000 వరకు ప్రాసెసింగ్ ఛార్జీని వసూలు చేయవచ్చు.

బ్యాంక్ ఆఫ్ బరోడా..

బ్యాంక్ ఆఫ్ బరోడా 8.70 నుండి 12.20 శాతం వడ్డీ చొప్పున లోన్ ఇస్తోంది. కార్ లోన్‌పై మీరు చొప్పున వడ్డీ చెల్లించాలి. అయితే, మీ నెలకు EMI రూ. 10,307 నుండి రూ. 11,173 మధ్య ఉండవచ్చు. ఇది కాకుండా, బ్యాంక్ మీకు ప్రాసెసింగ్ ఫీజుగా రూ. 1,500 నుండి 2,000 వరకు వసూలు చేయవచ్చు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..