Business Ideas: ఒక చేత్తో సంపాదన సరిపోవడం లేదా.? తక్కువ పెట్టుబడితో సైడ్ ఇన్‌కమ్.
రోజురోజుకీ పెరుగుతోన్న ఖర్చులు, ధరల కారణంగా రెండు చేతులా సంపాదిస్తే కానీ కుటుంబం నడిచే పరిస్థితి ఉండడం లేదు. దీంతో చాలా మంది సైడ్ ఇన్‌కమ్ కోసం మార్గాలు వెతుక్కుంటున్నారు. ఒక పని లేదా వ్యాపారం చేస్తూనే సంపాదన కోసం మరో మార్గాన్ని ఎంచుకుంటున్నారు. ఇలా తక్కువ పెట్టుబడితో లాభాలు ఆర్జించే కొన్ని మార్గాలపై ఓ లుక్కేయండి..

ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఎంత సంపాదించినా తక్కువే అనే భావన వచ్చేసింది. రోజురోజుకీ పెరుగుతోన్న ఖర్చులు, ధరల కారణంగా రెండు చేతులా సంపాదిస్తే కానీ కుటుంబం నడిచే పరిస్థితి ఉండడం లేదు. దీంతో చాలా మంది సైడ్ ఇన్‌కమ్ కోసం మార్గాలు వెతుక్కుంటున్నారు. ఒక పని లేదా వ్యాపారం చేస్తూనే సంపాదన కోసం మరో మార్గాన్ని ఎంచుకుంటున్నారు. ఇలా తక్కువ పెట్టుబడితో లాభాలు ఆర్జించే కొన్ని మార్గాలపై ఓ లుక్కేయండి..
* ప్రస్తుతం ఆన్‌లైన్ మార్కెట్ ఓ రేంజ్‌లో దూసుకుపోతోంది. ఎవరైనా వస్తువులను ఆన్‌లైన్‌లో అమ్ముకుని డబ్బులు సంపాదించే అవకాశం లభిస్తోంది. ఈబే, ఈస్టీ వంటి ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్‌లు తక్కువ పెట్టుబడితో ప్రొడక్ట్స్‌ను ఆన్‌లైన్‌లో విక్రయించుకునే అవకాశం కల్పిస్తున్నాయి. హాల్‌సేల్‌లో ఏవైనా ప్రొడక్ట్స్‌ను కొనుగోలు చేసి ఆన్‌లైన్‌లో అమ్ముతూ డబ్బులు ఆర్జించవచ్చు. దీనిని మంచి సైడ్ ఇన్‌కమ్‌గా మార్చుకోవచ్చు.
* మార్కెట్లో ఫ్రీలాన్సర్‌లకు డిమాండ్ భారీగా పెరుగుతోంది. కంటెంట్ రైటింగ్ మొదలు కోడింగ్ వంటి స్కిల్స్ ఉన్న వారికి ఆన్‌లైన్‌లో ఎన్నో అవకాశాలు ఉన్నాయి. ఇందుకోసం ఎలాంటి పెట్టుబడి అవసరం లేదు. మీ పని చేసుకుంటూనే మీకున్న నైపుణ్యం ఆధారంగా ఫ్రీలాన్సర్‌గా పనిచేసుకోవచ్చు. లింక్డిన్‌తో పాటు మరెన్నో జాబ్ పోర్టల్స్‌లో ఇలాంటి ఫ్రీలాన్సర్‌లకు సంబంధించిన జాబ్స్ ఉంటాయి. మీ స్కిల్స్ ఆధారంగా వాటిని ఎంచుకోవచ్చు.
* క్యాటరింగ్ సేవలకు కూడా ఇటీవల డిమాండ్ పెరుగుతోంది. మరీ ముఖ్యంగా ఇంట్లో చేసే వంటకాలకు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. ఇంట్లో జరిగే చిన్న చిన్న ఫంక్షన్లకు అవసరమయ్యే ఫుడ్ ఐటమ్స్‌ను తయారు చేసి అమ్మడం వల్ల మంచి ఆదాయాన్ని పొందొచ్చు. తక్కువ పెట్టుబడితోనే ఈ వ్యాపారాన్ని ప్రారంభింవచ్చు.
* పెంపుడు జంతువుల సంరక్షణ కూడా ఇటీవల వ్యాపారంగా మారింది. పని ఒత్తిడి కారణంగా చాలా మంది తమ పెంపుడు జంతువుల సంరక్షణను చూసుకోవడానికి సమయం ఉండడం లేదు. ఇలాంటి వారి కోసమే ఈ సేవలు అందుబాటులోకి వస్తున్నాయి. తక్కువ పెట్టుబడితో ఈ సేవలను ప్రారంభించవచ్చు. అపార్ట్‌మెంట్స్ కమ్యూనిటీల్లో ఇలాంటి సేవలను ప్రారంభించడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.
* ఎలాంటి పెట్టుబడి లేకుండా డబ్బులు సంపాదించుకోవడానికి ప్రస్తుతం అందుబాటులో ఉన్న బెస్ట్ ఆప్షన్ యూట్యూబ్. వీడియోలు చేస్తూ లక్షల్లో ఆర్జిస్తున్న వారు చాలా మంది ఉన్నారు. ముఖ్యంగా ఆన్‌లైన్ ట్యూటరింగ్ ద్వారా డబ్బులు సంపాదించుకోవచ్చు. కేవలం యూట్యూబ్‌లో వీడియోలు అప్‌లోడ్ చేయడం ద్వారా మాత్రమే కాకుండా. కొన్ని రకాల వెబ్‌సైట్స్ ఆన్‌లైన్ ట్యూటరింగ్ సేవలు అందిస్తున్నాయి. ఇలాంటి వాటిలో రిజిస్టర్ అవ్వడం వల్ల మీ నైపుణ్యాన్ని ఇతరులతో పంచుకుంటూ డబ్బులు సంపాదించొచ్చు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..