- Telugu News Photo Gallery Business photos The EV companies that caught the pulse of the middle class people, These are the best EV scooters in Dussehra
EV Scooters: మధ్యతరగతి ప్రజల పల్స్ పట్టేసిన ఈవీ కంపెనీలు.. దసరాలో దుమ్ము రేపుతున్న ఈవీ స్కూటర్లు ఇవే
ప్రస్తుత రోజుల్లో ద్విచక్ర వాహనం అనేది నిత్యావసర వస్తువులా మారింది. పెరిగిన సౌకర్యాల నేపథ్యంలో బైక్ లేదా స్కూటర్ వాడకం తప్పనిసరైంది. అయితే పెరుగుతున్న పెట్రోల్ ధరల నుంచి రక్షణకు మధ్యతరగతి ప్రజలు ఈవీ వాహనాలు ఆశ్రయిస్తున్నారు. కానీ వీటి ధరలు అధికంగా ఉండడంతో మిన్నకుండిపోతున్నారు. దీంతో ఈవీ కంపెనీలు మధ్యతరగతి వారికి అందుబాటు ధరల్లో ఈవీ స్కూటర్లను లాంచ్ చేసి సేల్స్ పరంగా దూసుకుపోతున్నాయి. ప్రస్తుతం దసరా సందర్భంగా ఈవీ స్కూటర్ కొనుగోలు చేసే వారికి రూ.లక్ష లోపు అందుబాటులో ఉన్న స్కూటర్లు, వాటి ఫీచర్లపై ఓ లుక్కేద్దాం.
Srinu | Edited By: Shaik Madar Saheb
Updated on: Oct 22, 2023 | 8:59 PM

బెంగుళూరు చెందిన ప్రముఖ ఈవీ కంపెనీ మధ్యతరగతి వాళ్లే అసలు టార్గెట్ ఓలా ఎస్ 1 ఎక్స్ పేరుతో ఈవీ స్కూటర్ అందుబాటులో ఉంచింది. ఈ స్కూటర్ ధర రూ.90,000 (ఎక్స్-షోరూమ్). ఈ స్కూటర్ 2 కేడబ్ల్యూహెచ్, 3 కేడబ్ల్యూహెచ్ అనే రెండు బ్యాటరీల ఎంపికతో వస్తుంది. ఈ స్కూటర్ గంటకు 90 కిలో మీటర్ల వేగంతో దూసుకుపోతుంది. అలాగే ఓ సారి చార్జ్ చేస్తే 91 కిలోమీటర్ల మైలేజ్‌ను ఇస్తుంది. 3.5 అంగుళాల సెగ్మెంటెడ్ డిస్‌ప్లేతో వచ్చే ఈ స్కూటర్ అందరినీ ఆకట్టుకుంటుంది.

ఈవీ స్టార్టప్ కంపెనీ బౌన్స్ రిమూవబుల్ బ్యాటరీ సౌలభ్యంతో ఇన్‌ఫినిటీ స్కూటర్‌ను అందుబాటులో ఉంచింది. ఈ స్కూటర్ ధర రూ.83,886 (ఎక్స్-షోరూమ్). ఈ స్కూటర్ రెండు కిలో వాట్ల లిథియం అయాన్ బ్యాటరీ నుంచి శక్తిని పొందుతుంది. ఈ స్కూటర్ గరిష్టంగా గంటలకు 65 కిలోమీటర్ల వేగంతో దూసుకుపోతుంది. అలాగే ఓ సారి చార్జ్ చేస్తే 85 కిలోమీటర్ల పరిధిని అందిస్తుంది. ముఖ్యంగా ఈ స్కూటర్‌లో వచ్చే డ్రాగ్ మోడ్ ఆప్షన్ అనుకోని పరిస్థితుల్లో స్కూటర్ పంక్చర్ అయితే చాలా బాగా ఉపయోగపడుతుంది.

ఒకినోవా ఆటోటెక్ కంపెనీలకు చెందిన ఒకినోవా ప్రైజ్ ప్రో ఈవీ స్కూటర్ ధర రూ.99,645(ఎక్స్-షోరూమ్). ఈ స్కూటర్ మూడు సంవత్సరాల వారెంటీతో అందుబాటులో ఉంటుంది. ఈ స్కూటర్ గరిష్టంగా గంటకు 56 కిలో మీటర్ల వేగంతో దూసుకుపోతుంది. అలాగే ఈ స్కూటర్ ఓ సారి చార్జ్ చేస్తే 81 కిలో మీటర్ల మైలేజ్‌ను అందిస్తుంది. ఎనిమిది రంగుల్లో అందుబాటులో ఉండే ఈ స్కూటర్ ఈవీ స్కూటర్ ప్రియులను అమితంగా ఆకర్షిస్తుంది.

రూ.90,000 (ఎక్స్-షోరూమ్)కు అందుబాటులో ఉండే అంపీయర్ జీల్ ఈఎక్స్ 60 వాట్స్, 2.3కేడబ్ల్యూహెచ్ అధునాతన లిథియం అయాన్ బ్యాటరీతో వస్తుంది. ఈ స్కూటర్ గంటకు 55 కిలోమీటర్ల వేగంతో దూసుకుపోతుంది. అలాగే ఓ సారి చార్జ్ చేస్తే 100 కిలో మీటర్ల మైలేజ్‌ను ఇస్తుంది.

లెక్ట్రిక్స్ ఎల్‌ఎక్స్‌ఎస్ 2.0, 3.0 ఈవీ స్కూటర్లు కూడా రూ.లక్ష లోపు వినియోగదారులకు అందుబాటులో ఉంటాయి. ఫీచర్లే ఈ స్కూటర్ల బలమని కంపెనీ చెబుతుంది. 36 సెఫ్టీ ఫీచర్లు, 24 స్మార్ట్ ఫీచర్లు, 14 కంఫర్ట్ ఫీచర్లతో ఈ స్కూటర్ ఆకర్షణీయంగా ఉంటుంది. 2.3 కేడబ్ల్యూహెచ్, 3 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ఎంపికలతో వచ్చే ఈ స్కూటర్లు గంటకు 100 కిలో మీటర్ల వేగంతో దూసుకుపోతాయి.





























