Business Idea: సింపుల్ బిజినెస్.. వేలల్లో ఆదాయం. ఇల్లు కదలకుండానే డబ్బులు..
ఈరోజు మనం చెప్పుకునే వ్యాపారం వైపర్ మేకింగ్. ప్రస్తుతం వైపర్‌ల వినియోగం అనివార్యంగా మారింది. ఒకప్పుడు కేవలం పట్టణాల్లో మాత్రమే మార్బుల్స్, టైల్స్ ఉపయోగించే వారు కాబట్టి అక్కడే ఉపయోగం ఉండేది. కానీ ప్రస్తుతం గ్రామీణ ప్రాంతాల్లోనూ ఇళ్లలో టైల్స్ వేసుకుంటున్నారు. దీంతో ఇంటిని కడిగే సమయంలో వైపర్స్‌ను ఉపయోగించాల్సిన పరిస్థితి నెలకొంది...
స్వయం ఉపాధి కోసం వెతుకుతోన్న వారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. ఏదైనా కొత్తగా వ్యాపారం ప్రారంభించాలని ఆశపడుతుంటారు. అయితే పెట్టుబడి, లాభాలు వస్తాయో లేదో అన్న భయంతో ఆ ఆలోచనను విమరించుకుంటారు. అయితే ఇంట్లో ఉంటూనే తక్కువ పెట్టుబడితో మంచి లాభాలు ఆర్జించే ఎన్నో వ్యాపారాలు ఉన్నాయి. అలాంటి ఓ మంచి వ్యాపారం గురించి ఈరోజు తెలుసుకుందాం.
ఈరోజు మనం చెప్పుకునే వ్యాపారం వైపర్ మేకింగ్. ప్రస్తుతం వైపర్‌ల వినియోగం అనివార్యంగా మారింది. ఒకప్పుడు కేవలం పట్టణాల్లో మాత్రమే మార్బుల్స్, టైల్స్ ఉపయోగించే వారు కాబట్టి అక్కడే ఉపయోగం ఉండేది. కానీ ప్రస్తుతం గ్రామీణ ప్రాంతాల్లోనూ ఇళ్లలో టైల్స్ వేసుకుంటున్నారు. దీంతో ఇంటిని కడిగే సమయంలో వైపర్స్‌ను ఉపయోగించాల్సిన పరిస్థితి నెలకొంది.
దీంతో ఈ వైపర్‌ల తయారీనే మన వ్యాపారం అస్త్రంగా మార్చుకుంటే భారీగా లాభాలు ఆర్జించవచ్చు. ఇంతకీ ఈ వైపర్ తయారీని వ్యాపారాన్ని ఎలా ప్రారంభించాలి.? లాభాలు ఎలా ఉంటాయి.? లాంటి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. వైపర్ తయారీ కోసం ముఖ్యంగా రెండు రకాల మిషన్స్ అవసరపడతాయి. వీటిలో ఒకటి కటింగ్ మిషన్ కాగా, మరొకటి బటన్ ప్రెస్సింగ్ మిషన్. ఈ రెండు మిషన్స్‌ను కొనుగోలు చేస్తే సరిపోతుంది. ఇక వైపర్ తయారీకి సంబంధించి ముడి సరుకులు మార్కెట్‌లో అందుబాటులో ఉంటాయి.
వైపర్ తయారీకి షీట్స్ అవసరం ఉంటాయి. మార్కెట్లో షీట్స్ రూ. 200 నుంచి ప్రారంభంలో ఉన్నాయి. ఒక్క షీట్‌లో సుమారు 10 వరకు వైపర్‌లను తయారు చేయొచ్చు. దీంతో పాటు షీట్స్‌ను హోల్డ్ చేసే క్యాప్, బటన్స్ అవసరపడతాయి. అలాగే వైపర్‌కు ఉపయోగించే స్టిక్స్, ప్యాకింగ్ కవర్స్ అవసరపడతాయి. వైపర్ తయారు చేయడానికి ముందుగా షీట్స్‌ను తీసుకొని కటింగ్ మిషన్ ద్వారా కట్ చేయాలి. అనంతరం వాటిని షీట్స్‌ను హోల్డ్ చేసే క్యాప్‌లో ఇన్‌సెర్ట్ చేయాలి. ఆ తర్వాత ఫీట్ క్యాప్‌లో ఆగడానికి బటన్స్ ప్రెస్సింగ్ మిషన్స్ ద్వారా ఇన్‌సెర్ట్ చేయాలి. చివరికి క్యాప్‌కు కర్రను సెట్ చేస్తే సరిపోతుంది. వైపర్ తయారైనట్లే. కేవలం రూ. 10 నుంచి రూ. 15 వేలలో ఈ బిజినెస్‌ను ప్రారంభించవచ్చు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..