Business Idea: రూ. 2 లక్షల మిషన్‌తో చేతి నిండా సంపాదన.. అదిరిపోయే బిజినెస్ ఐడియా..
రకరకాల ఇన్నోవేటివ్ ఆలోచనలతో ముందుకు వస్తూ వ్యాపారంలో సత్తా చాటుతున్నారు. ఇక ఉద్యోగం చేయకుండా తమే స్వయం ఉపాధి పొందడంతో పాటు ఇతరులకు కూడా ఉపాధి కల్పించే దిశంగా అడుగులు వేస్తున్నారు. మీరు కూడా ఇలాగే వ్యాపారంలోకి అడుగు పెట్టాలనుకుంటున్నారా.? మీలాంటి వారి కోసమే ఓ మంచి బిజినెస్ ఐడియా అందుబాటులో ఉంది. సాధారణంగా టీ స్టాల్స్‌లో ప్లాస్టిక్ లేదా పేపర్‌తో తయారు చేస్తారు...
యువత ఆలోచనల్లో మార్పు వస్తోంది. ఒకప్పుడు కేవలం ఉద్యోగం వస్తే చాలు అనే ఆలోచనలో ఉండేవారు. అయితే ఇప్పుడు ఉద్యోగం అంతిమ లక్ష్యం కాదనే భావకు వస్తున్నారు. ఓవైపు ఉద్యోగం చేస్తూనే మరోవైపు వ్యాపారంలోకి కూడా అడుగుపెడుతున్నారు. స్టార్టప్‌ల కల్చర్ రావడంతో ఈ ట్రెండ్ మరింత పెరుగుతోంది.
రకరకాల ఇన్నోవేటివ్ ఆలోచనలతో ముందుకు వస్తూ వ్యాపారంలో సత్తా చాటుతున్నారు. ఇక ఉద్యోగం చేయకుండా తమే స్వయం ఉపాధి పొందడంతో పాటు ఇతరులకు కూడా ఉపాధి కల్పించే దిశంగా అడుగులు వేస్తున్నారు. మీరు కూడా ఇలాగే వ్యాపారంలోకి అడుగు పెట్టాలనుకుంటున్నారా.? మీలాంటి వారి కోసమే ఓ మంచి బిజినెస్ ఐడియా అందుబాటులో ఉంది. సాధారణంగా టీ స్టాల్స్‌లో ప్లాస్టిక్ లేదా పేపర్‌తో తయారు చేస్తారు. టీ తాగిన తర్వాత ఆ కప్పును పడేస్తారు. అలా కాకుండా తాగిన తర్వాత కప్పును తినేస్తే ఎలా ఉంటుంది.? అవును ఇప్పుడు చెప్పబోయే బిజినెస్ ఐడియా అదే..
పైన కనిపిస్తున్న ఫొటోలో ఉన్న మిషన్‌తో బిస్కట్ కప్పులను తయారు చేయవచ్చు. ఈ బిస్కట్ కప్పుల్లో టీ తాగిన తర్వాత తినేయొచ్చు. ఇక ఈ మిషన్ విషయానికొస్తే దీని ధర రూ. 2 నుంచి రూ. 3 లక్షల వరకు ఉంటుంది. ఆన్‌లైన్‌లో పలు సంస్థలు ఈ మిషన్స్‌ను సొంతం చేసుకోవచ్చు. ఇక మిషన్‌తోపాటు కప్స్ తయారీకి అవసరమయ్యే ముడి సరుకు కూడా అవసరం ఉంటుంది. ఒక కప్పుపై కనీసం 50 పైసలు లాభం పొందొచ్చు. రోజుకు ఒక వెయ్యి కప్స్ అమ్మితే సులభంగా రూ. 5000 సంపాదించొచ్చు. అంటే ఈ లెక్కన సింపుల్‌గా నెలకు రూ. 1.5 లక్షలు సంపాదించుకోవచ్చు.
ఇక ఈ వ్యాపారాన్ని మొదలు పెట్టడానికి పెద్దగా స్థలం కూడా అవసరం లేదు. ఒక చిన్న గదిలో మిషన్‌ను ఏర్పాటు చేసుకోవచ్చు. ఇక ఈ బిస్కట్ కప్ తయారీలో మైదా, రాగి, మొక్కజొన్న పిండితో పాటు చక్కెర, తేనెను ఉపయోగిస్తారు. వీటన్నింటిని కలిపి మిషన్‌లో ఉంచితే టీ కప్పు తయారవుతుంది. టీ కప్పులను తయారు చేసిన తర్వాత టీ షాప్స్, కిరాణ దుకాణాల్లో మార్కెటింగ్ చేసుకోవచ్చు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..