Home Loan: హోమ్ లోన్ ఇన్సూరెన్స్‌తో మీ పెట్టుబడికి శ్రీరామ రక్ష.. ఆ టెన్షన్ మీకు ఉండదు

Home Loan: మీరు హోమ్ లోన్ తీసుకుంటే.. హోమ్ లోన్ ఇన్సూరెన్స్ ద్వారా రెట్టింపు ప్రయోజనం పొందుతారు, గృహ రుణం విషయంలో జరగరానిది జరిగితే కుటుంబ ఎలా చెల్లిస్తుందన్న టెన్షన్ మీకు ఉండదు. హోమ్ లోన్ ఇన్సూరెన్స్‌తో మీరు మీ మొత్తం కుటుంబానికి భద్రత కల్పించవచ్చు. దురదృష్టవశాత్తు మీకు ఏమైనా జరిగినా..

Home Loan: హోమ్ లోన్ ఇన్సూరెన్స్‌తో మీ పెట్టుబడికి శ్రీరామ రక్ష.. ఆ టెన్షన్ మీకు ఉండదు
home loan insurance
Follow us

|

Updated on: Oct 24, 2023 | 1:34 PM

మెట్రో నగరాలు, చిన్న పట్టణాల్లో కూడా సొంత ఇల్లు కొనడం చాలా కష్టంగా మారింది. అయితే ప్రతి ఒక్కరికీ తనకు సొంత ఇల్లు ఉండాలని కోరుకుంటారు. ఈ కలను సాకారం చేసుకోవడంలో హోమ్ లోన్ చాలా సహాయపడుతుంది. ఇంటిని కొనేందుకు అవసరమైన డబ్బు చేతిలో లేకపోతే.. హోమ్ లోన్ ద్వారా మీ సొంత ఇంటి కలను సాకారం చేసుకోవచ్చు. అదే సమయంలో హోమ్ లోన్ ఇన్సూరెన్స్‌తో మీ లోన్‌ను రెట్టింపు సురక్షితం చేస్తుంది.

మీరు హోమ్ లోన్ తీసుకుంటే.. హోమ్ లోన్ ఇన్సూరెన్స్ ద్వారా రెట్టింపు ప్రయోజనం పొందుతారు, గృహ రుణం విషయంలో జరగరానిది జరిగితే కుటుంబ ఎలా చెల్లిస్తుందన్న టెన్షన్ మీకు ఉండదు. హోమ్ లోన్ ఇన్సూరెన్స్‌తో మీరు మీ మొత్తం కుటుంబానికి భద్రత కల్పించవచ్చు. దురదృష్టవశాత్తు మీకు ఏమైనా జరిగినా.. ఇన్సూరెన్స్ ద్వారా గృహ రుణం సకాలంలో మీరు లోన్ తీసుకున్న బ్యాంకుకు తిరిగి చెల్లించేందుకు సాధ్యమవుతుంది. మరి గృహ రుణ బీమా గురించి వివరంగా తెలుసుకుందాం..

ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరూ ముందే చెప్పలేరు. అందుకే మీరు గృహ రుణం తీసుకుంటే, దానితో పాటు మీరు గృహ రుణ బీమా కూడా తీసుకోవాలి. గృహ రుణ బీమా, ఆరోగ్య బీమా, కుటుంబ బీమా కంటే భిన్నంగా ఉంటుంది. హోమ్ లోన్ రుణగ్రహీత మరణించిన తర్వాత కూడా సకాలంలో ఆ రుణం తిరిగి చెల్లించబడుతుంది.

దేశంలో చాలా మందికి గృహ రుణ బీమా గురించి తెలియదు. మీరు గృహ రుణ బీమా ఎందుకు తీసుకోవాలి, దాని ప్రయోజనాలు ఏమిటి? వివరాలు తెలుసుకోండి.

గృహ రుణ బీమా తీసుకోవడం తప్పనిసరి కాదా?

దేశంలో గృహ రుణ బీమా ఇంకా తప్పనిసరి చేయలేదు. అదంతా ఐచ్ఛికంగా మాత్రమే ఉంది. చాలా బ్యాంకులు, ఫైనాన్స్ కంపెనీలు గృహ రుణంతో పాటు గృహ రుణ బీమా ప్రయోజనాన్ని కస్టమర్‌కు అందిస్తాయి. చాలా మంది రుణగ్రహీతలు హోమ్ లోన్‌తో పాటు రుణ బీమాను కూడా విడిగా తీసుకుంటారు. హోమ్ లోన్ ఇన్సూరెన్స్‌తో హోమ్ లోన్ రీపేమెంట్ సమస్య చాలా వరకు తీరిపోతుంది. ఇంటి పోషణ పూర్తిగా తన ఆదాయంపై ఆధారపడి ఉన్న రుణగ్రహీత ఏదైనా కారణం చేత మరణించినా, హోమ్ లోన్ బీమా ద్వారా సదరు రుణాన్ని బ్యాంకుకు సకాలంలో చెల్లించడం కొనసాగుతుంది.

మీరు గృహ రుణ బీమా తీసుకుంటారా లేదా అనేది పూర్తిగా మీ నిర్ణయంపైనే ఆధారపడి ఉంటుంది. మీరు గృహ రుణ బీమా తీసుకుంటే, మీరు వివిధ కంపెనీల పాలసీలను సరిపోల్చుకుని, అందులో ఉత్తమమైనదాన్ని ఎంచుకోవాలి.

గృహ రుణ బీమా ఎందుకు తీసుకోవాలి?

  • ఇది మీ పెట్టుబడి మొత్తాన్ని రక్షిస్తుంది. ఉదాహరణకు, ఏదైనా ప్రమాదం లేదా మరణం సంభవించినప్పటికీ, మీరు తీసుకున్న గృహ రుణం సకాలంలో తిరిగి చెల్లించబడుతుంది.
  • ఇందులో ఒక్కసారి మాత్రమే ప్రీమియం చెల్లించాలి. వినియోగదారుడు ప్రీమియం ఎక్కువగా ఉన్నట్లయితే, అతను EMI ద్వారా కూడా ప్రీమియం చెల్లించవచ్చు.
  • ఇది ఆదాయపు పన్ను చట్టం 1961లోని సెక్షన్ 80C కింద పన్ను ప్రయోజనాలను కూడా అందిస్తుంది. మీరు EMI ద్వారా ప్రీమియం చెల్లిస్తే, మీకు ఎలాంటి పన్ను ప్రయోజనం ఉండదు. అంటే మీరు పన్ను ప్రయోజనాలను పొందాలనుకుంటే, మీరు ఒకేసారి ప్రీమియం చెల్లించాలి.
  • మీరు మీ మొత్తం గృహ రుణంపై హోమ్ లోన్ ఇన్సూరెన్స్ ద్వారా ప్రయోజనం పొందుతారు.
  • దీని ద్వారా మీరు యాడ్-ఆన్ సౌకర్యం పొందుతారు. ఈ సదుపాయాన్ని పొందడం ద్వారా మీ బీమాను మరింత బలోపేతం చేసుకోవచ్చు. ఏదైనా తీవ్రమైన అనారోగ్యం లేదా మరేదైనా పరిస్థితి విషయంలో కూడా ఈ బీమా వర్తిస్తుంది.
  • హోమ్ లోన్ ఇన్సూరెన్స్ రుణగ్రహీతతో పాటు అతని కుటుంబాన్ని రక్షించడంలో సహాయపడుతుంది. హోమ్ లోన్ ఇన్సూరెన్స్ చేయిస్తే లోన్ చెల్లింపు విషయంలో ఎలాంటి టెన్షన్ ఉండదు.