Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

BIS App: మీరు కొన్న గోల్డ్‌ స్వచ్ఛమైందేనా.? మొబైల్ యాప్‌తో తెలుసుకోవచ్చు..

పండక్కి బంగారం కొనుగోలు చేయడం చాలా మందికి అలవాటు. బంగారం ధరలు భారీగా పెరిగిన నేపథ్యంలో అసలు మనం కొనుగోలు చేస్తున్న బంగారం నిజంగా స్వచ్ఛమైందేనా అనే సందేహం వస్తుంది. అయితే కేంద్ర ప్రభుత్వం హాల్‌ మార్క్‌ను తప్పనిసరి చేసిన తర్వాత బంగారం నాణ్యతపై కొనుగోలు దారులకు అవగాహన పెరుగుతోంది. ఈ నేపథ్యంలోనే బ్యూరో ఆఫ్‌ ఇండియన్‌ స్టాండర్డ్స్‌ (BIS) బంగారం నాణ్యతను...

BIS App: మీరు కొన్న గోల్డ్‌ స్వచ్ఛమైందేనా.? మొబైల్ యాప్‌తో తెలుసుకోవచ్చు..
Gold Purity
Follow us
Narender Vaitla

|

Updated on: Oct 24, 2023 | 11:05 AM

దసరా, దీపావళికి కొత్త వస్తువులు కొనే సెంటిమెంట్ చాలా మందికి ఉంటుంది. పండగ సీజన్ క్యాష్‌ చేసుకునే క్రమంలో ఇప్పటికే ఈ కామర్స్‌ సైట్స్‌ ఆఫర్లను ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే కేవలం ఎలక్ట్రానిక్‌ గ్యాడ్జెట్స్‌, గృహోపకరణాలు మాత్రమే కాకుండా బంగారం కొనుగోలు చేయడం అనవాయితీగా వస్తుంది.

పండక్కి బంగారం కొనుగోలు చేయడం చాలా మందికి అలవాటు. బంగారం ధరలు భారీగా పెరిగిన నేపథ్యంలో అసలు మనం కొనుగోలు చేస్తున్న బంగారం నిజంగా స్వచ్ఛమైందేనా అనే సందేహం వస్తుంది. అయితే కేంద్ర ప్రభుత్వం హాల్‌ మార్క్‌ను తప్పనిసరి చేసిన తర్వాత బంగారం నాణ్యతపై కొనుగోలు దారులకు అవగాహన పెరుగుతోంది. ఈ నేపథ్యంలోనే బ్యూరో ఆఫ్‌ ఇండియన్‌ స్టాండర్డ్స్‌ (BIS) బంగారం నాణ్యతను తెలుసుకోవడానికి మొబైల్ యాప్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ‘బీఐఎస్ కేర్‌’ పేరుతో తీసుకొచ్చిన ఈ యాప్‌ ద్వారా బంగారం క్వాలిటీని తెలుసుకోవచ్చు..

ఇటీవల బంగారు ఆభరణాలపై ఆరు అంకెల ఆల్ఫాన్యూమరిక్ హెచ్‌యూఐడీ కోడ్‌ను కేంద్ర ప్రభుత్వం తప్పసరి చేస్తూ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ప్రతీ ఒక్క ఆభరణానికి ప్రత్యేక హెచ్‌యూఐడీ నెంబర్‌ కేటాయిస్తారు. ఈ కోడ్‌ ఆధారంగానే బంగారం స్వచ్ఛమైందా.? కాదా తెలుసుకోవచ్చు. అందుకే మీరు కొనుగోలు చేసిన ఆభరణాలపై హెచ్‌యూఐడీ ఉందన్న విషయాన్ని నిర్ధారించుకోవాలి. ఈ కోడ్‌ ఆధారంగానే గోల్డ్‌ క్వాలిటీని తెలుసుకోవచ్చు.

ఇక గోల్డ్‌ స్వచ్ఛతను తెలుసుకోవడానికి ముందుగా మీ మొబైల్ ఫోన్‌లో ‘బీఐఎస్‌ కేర్‌’ అనే యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవాలి. అనంతరం మీ పేరు, ఫోన్‌ నంబర్‌, మెయిల్‌ ఐడీ, ఓటీపీతో ముందు యాప్‌లోకి లాగిన్‌ అవ్వాలి. అనంతరం యాప్‌ ఓపెన్ కాగానే ‘వెరిఫై హెచ్‌యూఐడీ’ అనే ఆప్షన్‌పై క్లిక్‌ చేయాలి. ఆ తర్వాత మీరు కొనుగోలు చేసే ఆభరణంపై ఉన్న హెచ్‌యూఐడీ నంబర్‌ను ఎంటర్‌ చేసి సబ్‌మిట్‌పై నొక్కాలి. వెంటనే మీ ఆభరణానికి సంబంధించిన హాల్‌మార్క్‌ చేయించిన షాప్‌, హాల్‌ మార్క్‌ వేసిన కేంద్రం, బంగారం స్వచ్ఛత వంటి వివరాలు డిస్‌ప్లే అవుతాయి.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..