Google Pay: చిరు వ్యాపారులకు గూగుల్ గుడ్‌ న్యూస్‌.. సింపుల్‌గా రుణం పొందే అవకాశం

ప్రత్యేకంగా చిరు వ్యాపారుల కోసం గూగుల్‌ ఈ రుణ సదుపాయాన్ని తీసుకొచ్చింది. చిన్న వ్యాపారులు గూగుల్‌ పే యాప్‌ ద్వారా సులభంగా లోన్‌ పొందే అవకాశాన్ని కల్పించింది. గూగుల్‌ పే యాప్‌లో సులభమైన పద్ధతిలో రుణాన్ని పొందే అవకాశాన్ని కల్పించారు. ఈ విధానంలో యూజర్లు రూ. 10 వేల నుంచి లోన్స్ పొందొచ్చు. అంతేకాకుండా తీసుకున్న రుణాన్ని సులభంగా, నచ్చిన నెలవారీ మొత్తంలో చెల్లించుకునే అవకాశాన్ని కల్పించనున్నారు...

Google Pay: చిరు వ్యాపారులకు గూగుల్ గుడ్‌ న్యూస్‌.. సింపుల్‌గా రుణం పొందే అవకాశం
Google Pay
Follow us
Narender Vaitla

|

Updated on: Oct 24, 2023 | 7:28 AM

యూపీఐ పేమెంట్స్‌ యాప్స్‌ రుణాలు అందిస్తున్న విషయం తెలిసిందే. పలు రకాల ఆర్థిక సంస్థల భాగస్వామ్యంతో యాప్స్‌ అప్పులు ఇస్తూ యూజర్లను అట్రాక్ట్ చేస్తున్నాయి. ఇప్పటికే వాట్సాప్‌ ఈ సేవలను అందిస్తున్నాయి. ఇదిలా ఉంటే తాజాగా ఈ జాబితాలోకి గూగుల్‌ పే కూడా వచ్చి చేరింది గూగుల్ మేడ్‌ ఫర్‌ ఇండియా తొమ్మిదో ఎడిషన్‌లో ఈ విషయాన్ని ప్రకటించింది.

ప్రత్యేకంగా చిరు వ్యాపారుల కోసం గూగుల్‌ ఈ రుణ సదుపాయాన్ని తీసుకొచ్చింది. చిన్న వ్యాపారులు గూగుల్‌ పే యాప్‌ ద్వారా సులభంగా లోన్‌ పొందే అవకాశాన్ని కల్పించింది. గూగుల్‌ పే యాప్‌లో సులభమైన పద్ధతిలో రుణాన్ని పొందే అవకాశాన్ని కల్పించారు. ఈ విధానంలో యూజర్లు రూ. 10 వేల నుంచి లోన్స్ పొందొచ్చు. అంతేకాకుండా తీసుకున్న రుణాన్ని సులభంగా, నచ్చిన నెలవారీ మొత్తంలో చెల్లించుకునే అవకాశాన్ని కల్పించనున్నారు. త్వరలోనే ఈ సేవలను అందుబాటులోకి తీసుకురానున్నారు. ఇందుకోసం గూగుల్‌ పే డీఎమ్‌ఐ ఫైనాన్స్‌తో కలిసి సాచెట్ లోన్‌ పేరుతో రుణాలు అందిస్తోంది.

తక్కువ కాల వ్యవధి, తక్కవ మొత్తం అందించే ఈ రుణాలను ప్రీ అప్రూవ్డ్‌ లోన్‌గా అందించనున్నారు. ఇందులో భాగంగా రూ. 10,000 నుంచి రూ. 1 లక్షల వరకు రణం పొందొచ్చు. ఇక తీసుకున్న రుణాన్ని తిరిగి చెల్లించేందుకు ఏడు రోజుల నుంచి 12 నెలల వరకు వాయిదాల్లో చెల్లించవచ్చు. గూగుల్‌ పే యాప్‌ లేదా వెబ్‌సైట్‌ ద్వారా సింపుల్‌ స్టెప్స్‌తో ఈ రుణాన్ని పొందొచ్చు. ఇక తక్కు మొత్తంలో ఈఎమ్‌ఐని కూడా వినియోగదారులు తమకు నచ్చిన ఆప్షన్‌ ఎంచుకునే వెసులుబాటు కల్పించనున్నారు.

ముఖ్యంగా చిన్న వ్యాపారులు రోజువారీ అవసరాలకు అనుగుణంగా రుణాలు పొందడానికి ఇది మంచి అవకాశంగా చెబుతున్నారు. వడ్డీ రేట్లు కూడా తక్కువ ఉండడం. సులభమైన విధానాల్లో చెల్లించే అవకాశం ఉండడం చిరు వ్యాపారులకు కలిసొచ్చే అంశంగా గూగుల్‌ చెబుతోంది. ప్రస్తుతం టైర్‌ 2 సిటీల్లో గూగుల్ ఈ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది. నెలవారీ ఆదాయం రూ. 30,000 ఉన్న వారికి ఈ సాచెట్ లోన్‌ను తీసుకునే అవకాశం కల్పిస్తోంది. రానున్న రోజుల్లో గ్రామాల్లోనూ ఈ సేవలను అందుబాటులోకి తీసుకురానున్నారు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..