AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bengaluru-Mysuru Expressway: సర్వీస్‌ రోడ్డు గందరగోళంపై క్లారిటీ ఇచ్చిన కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ

బెంగళూరు-మైసూరు ఎక్స్‌ప్రెస్‌వే ఒక్కో వివాదానికి దారి తీస్తోంది. సర్వీస్ రోడ్డు లేకుండా టోల్ వసూలు చేయాలనే ఆలోచనపై సర్వత్రా వ్యతిరేకత వ్యక్తమైంది. ఈ నేపథ్యంలో..

Bengaluru-Mysuru Expressway: సర్వీస్‌ రోడ్డు గందరగోళంపై క్లారిటీ ఇచ్చిన కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ
Bengaluru Mysuru Expressway
Subhash Goud
|

Updated on: Mar 08, 2023 | 1:54 PM

Share

బెంగళూరు-మైసూరు ఎక్స్‌ప్రెస్‌వే ఒక్కో వివాదానికి దారి తీస్తోంది. సర్వీస్ రోడ్డు లేకుండా టోల్ వసూలు చేయాలనే ఆలోచనపై సర్వత్రా వ్యతిరేకత వ్యక్తమైంది. ఈ నేపథ్యంలో టోల్ వసూలు ప్రక్రియ తాత్కాలికంగా వాయిదా పడింది. ఇప్పుడు ఇదే సర్వీస్ రోడ్డుపై కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ స్పష్టత ఇచ్చారు. కొత్తగా నిర్మించిన బెంగుళూరు-మైసూర్ ఎక్స్‌ప్రెస్‌వేలో 6 ప్రధాన లేన్‌లు, రెండు సర్వీస్ రోడ్లు ఉన్నాయని, భారత్‌మాల ప్రాజెక్టు కింద రూ.8,478 కోట్లతో అభివృద్ధి చేసినట్లు తెలిపారు.

కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఈ విషయాన్ని ట్వీట్ చేస్తూ ఎక్స్‌ప్రెస్‌వే ఫోటోలను షేర్ చేశారు.118 కి.మీ పొడవున్న బెంగళూరు-మైసూర్ ఎక్స్‌ప్రెస్‌వేలో 6 ప్రధాన క్యారేజ్‌వే లేన్‌లు, రెండు వైపులా 2 సర్వీస్ రోడ్ లేన్‌లు ఉన్నాయి. భారతమాల ప్రాజెక్టు కింద రూ.8,478 కోట్లతో దీన్ని అభివృద్ధి చేశామని చెప్పారు.

ఇవి కూడా చదవండి

బెంగుళూరు-మైసూర్ ఎక్స్‌ప్రెస్ వే 10 లేన్ల ప్రాజెక్ట్ రెండు విభాగాలుగా విభజించినట్లు చెప్పారు. బెంగుళూరు నుంచి నిడగట్ట, నిడగట్ట నుంచి మైసూర్ వరకు ఒకటి. మొదటి దశలో ఐదు బైపాస్‌లను కలుపుతూ 52 కిలోమీటర్ల మేర గ్రీన్‌ఫీల్డ్‌ ఉంది. ఈ బైపాస్ బెంగళూరులో ట్రాఫిక్ సమస్యను తగ్గిస్తుంది. ఇది ప్రయాణికులందరికీ ఇబ్బంది లేని ప్రయాణాన్ని కూడా అందిస్తుంది.

మైసూరు-బెంగళూరు డ్యాష్‌పథ్‌ రోడ్డు సర్వీస్‌ రోడ్డు అయ్యేంత వరకు టోల్‌ వసూలు చేయొద్దని కేపీసీసీ అధ్యక్షుడు డి.కె. శివకుమార్ డిమాండ్ చేశారు. తొందరపడి టోల్ వసూలు ప్రారంభిస్తే కాంగ్రెస్ పెద్ద ఎత్తున పోరాటం చేస్తుందని హెచ్చరించారు. ఇప్పుడు సర్వీస్ రోడ్డు విషయంలో నెలకొన్న గందరగోళాన్ని కేంద్ర మంత్రి క్లారిటీ ఇచ్చారు.

టోల్ ఎంత?

118 కిమీ ఎక్స్‌ప్రెస్‌వేలో రెండు టోల్-కలెక్షన్ పాయింట్‌లు ఉన్నాయి. ఇది ఆరు కేటగిరీల వాహనాలపై టోల్ వసూలు చేస్తుంది. మే నుంచి టోల్ వసూలు ప్రారంభమవుతుంది. నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) ప్రకారం.. 24 గంటల్లోపు తిరుగు ప్రయాణాలకు కారుకు రూ.205 టోల్ ఛార్జీ విధించబడుతుంది. మినీ బస్సులకు వన్‌వే ఛార్జీ రూ.220 కాగా, బస్సులకు రూ.460 విధిస్తారు.

భారతమాల ప్రాజెక్టు కింద రూ.8,478 కోట్ల వ్యయంతో నిర్మించనున్న ఎక్స్‌ప్రెస్‌వేను మార్చి 12న ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు, ఇందుకోసం అన్ని ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

విష్ణు విగ్రహ కూల్చివేతతో ఉద్రిక్తత.. థాయిలాండ్–కంబోడియా యుద్ధం
విష్ణు విగ్రహ కూల్చివేతతో ఉద్రిక్తత.. థాయిలాండ్–కంబోడియా యుద్ధం
తిరుపతి నుంచి వస్తుండగా ప్రమాదం..నలుగురు హైదరాబాదీలు మృతి
తిరుపతి నుంచి వస్తుండగా ప్రమాదం..నలుగురు హైదరాబాదీలు మృతి
2025లో తెలంగాణలో పెరిగిన అవినీతి.. ఏ శాఖలో ఎక్కువ జరిగిందంటే..
2025లో తెలంగాణలో పెరిగిన అవినీతి.. ఏ శాఖలో ఎక్కువ జరిగిందంటే..
నెలకు రూ.60 వేల ఆదాయం.. తక్కువ పెట్టుబడి!
నెలకు రూ.60 వేల ఆదాయం.. తక్కువ పెట్టుబడి!
గతంలో ఎన్నో తప్పులు చేశాను.. ఇప్పుడు అలాంటి పాత్రలే చేయాలనుంది..
గతంలో ఎన్నో తప్పులు చేశాను.. ఇప్పుడు అలాంటి పాత్రలే చేయాలనుంది..
రైల్వే ప్రయాణీకులకు అటెన్షన్.! భారీగా పెరిగిన ఛార్జీలు అమలులోకి..
రైల్వే ప్రయాణీకులకు అటెన్షన్.! భారీగా పెరిగిన ఛార్జీలు అమలులోకి..
36 బంతుల్లో సెంచరీ..వైభవ్ సూర్యవంశీ ఊచకోతకు ప్రధాని మోదీ ఫిదా!
36 బంతుల్లో సెంచరీ..వైభవ్ సూర్యవంశీ ఊచకోతకు ప్రధాని మోదీ ఫిదా!
ఏపీకి కేంద్రం శుభవార్త.. కూటమి ప్రభుత్వానికి పండగే
ఏపీకి కేంద్రం శుభవార్త.. కూటమి ప్రభుత్వానికి పండగే
అద్దె భవనాల ఖాళీపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు!
అద్దె భవనాల ఖాళీపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు!
చేదు కాకరకాయలో చెప్పలేనన్నీ పోషకాలు,ఇలా వాడితే ఆ రోగాలన్నీ పరార్!
చేదు కాకరకాయలో చెప్పలేనన్నీ పోషకాలు,ఇలా వాడితే ఆ రోగాలన్నీ పరార్!