Bank of Baroda: పండుగ వేళ ఖాతాదారులకు గుడ్ న్యూస్ చెప్పిన బ్యాంక్ ఆఫ్ బరోడా.. హోమ్, కారు లోన్స్‌పై..
Bank of Baroda Home And Car Loan: ప్రముఖ బ్యాంకింగ్ దిగ్గజం బ్యాంక్ ఆఫ్ బరోడా తమ ఖాతాదారులకు గుడ్ న్యూస్ చెప్పింది. వచ్చే నెలలో రానున్న పండుగల నేపథ్యంలో ప్రత్యేక ఆఫర్లను ప్రకటించింది...
Bank of Baroda Home And Car Loan: ప్రముఖ బ్యాంకింగ్ దిగ్గజం బ్యాంక్ ఆఫ్ బరోడా తమ ఖాతాదారులకు గుడ్ న్యూస్ చెప్పింది. వచ్చే నెలలో రానున్న పండుగల నేపథ్యంలో ప్రత్యేక ఆఫర్లను ప్రకటించింది. ముఖ్యంగా కొత్తగా కారు కొనుగోలు చేయాలనుకునే వారికి, హోమ్ లోన్ తీసుకోవాలనుకుంటున్న వారికి ఈ ఆఫర్లను ప్రకటించింది. ప్రస్తుతం ఉన్న వడ్డీ రేట్లను తగ్గిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం హోమ్‌లోన్స్, కార్‌లోన్స్‌పై ఉన్న వడ్డీరేట్లపై సుమారు 0.25 శాతం మాఫీని అందిస్తున్నట్లు బ్యాంక్ ప్రకటన జారీ చేసింది. వీటితో పాటు హోమ్‌లోన్స్‌పై ప్రాసెసింగ్ ఫీజును కూడా మినహాయింపు ఇస్తున్నట్లు బ్యాంక్ తెలిపింది. కొత్తగా తీసుకునే గృహ రుణాలు 6.75 శాతం నుంచి , కారు రుణాలు 7.00శాతం నుంచి వడ్డీరేట్లు ప్రారంభమవుతాయని తెలిపారు.
ఈ సందర్భంగా బ్యాంక్ ఆఫ్ బరోడా జీఎమ్ హెచ్.టీ సోలంకీ మాట్లాడుతూ.. ‘రానున్న పండుగ సీజన్‌లో రిటైల్ లోన్‌లపై ఆఫర్లను అందించడం ద్వారా ఖాతాదారులకు తమ బ్యాంకు తరఫు నుంచి పండుగ ఉత్సాహాన్ని అందిచాలని భావిస్తున్నాం. కొత్త రుణాలు అందించడం కోసం కారు, గృహ రుణాలకు ఆకర్షణీయమైన ఆఫర్లు అందిస్తున్నాం. బ్యాంకు అందిస్తున్న ఈ ఆఫర్ల ద్వారా తక్కువ వడ్డీకే రుణాలు పొందొచ్చు. ఇక లోన్‌లకు ప్రాసెసింగ్ ఫీజు నుంచి కూడా మినహాయింపు ఉంటుంది’ అని చెప్పుకొచ్చారు. ఇక ఖాతాదారులు బాబ్ వరల్డ్ మొబైల్ యాప్స్ ద్వారా కూడా సులభంగా లోన్ల కోసం దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు.
Also Read: Health Tips: షుగర్ పేషెంట్స్ పెరుగు తింటున్నారా ? అయితే ఈ విషయాలను కచ్చితంగా తెలుసుకోవాల్సిందే..