September Bank Holidays 2022: బ్యాంకు కస్టమర్లకు అలర్ట్‌.. సెప్టెంబర్‌లో బ్యాంకులకు సెలవులు.. ఏయే రోజు అంటే..

Bank Holidays September 2022: ప్రతి రోజు బ్యాంకులకు సంబంధించిన పనులు చేసుకునేవారుంటారు. అయితే ప్రతి నెల రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా బ్యాంకులకు సెలవులను విడుదల చేస్తుంటుంది..

September Bank Holidays 2022: బ్యాంకు కస్టమర్లకు అలర్ట్‌.. సెప్టెంబర్‌లో బ్యాంకులకు సెలవులు.. ఏయే రోజు అంటే..
Bank Holidays
Follow us
Subhash Goud

| Edited By: Ravi Kiran

Updated on: Aug 31, 2022 | 6:15 PM

Bank Holidays September 2022: ప్రతి రోజు బ్యాంకులకు సంబంధించిన పనులు చేసుకునేవారుంటారు. అయితే ప్రతి నెల రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా బ్యాంకులకు సెలవులను విడుదల చేస్తుంటుంది. ఏయే రోజుల్లో సెలవులు ఉంటాయో జాబితాను విడుదల చేస్తుంటుంది. అయితే ప్రతి నెలలో బ్యాంకులకు ఉండే సెలవులను గమనించడం తప్పనిసరి. బ్యాంకు పనులున్నవారు ప్రతి నెల ఏయే రోజుల్లో సెలవులు ఉంటాయో ముందస్తుగా తెలుసుకోవడం మంచిది. సెలవుల గురించి తెలుసుకుంటే ముందస్తుగా ప్లాన్‌ చేసుకునేందుకు వీలుంటుంది. లేకపోతే ఇబ్బందులు పడాల్సి ఉంటుంది. ఇక ఆగస్టు ఈ రోజుతో ముగియబోతోంది. వచ్చే సెప్టెంబర్‌ నెలలో మొత్తం బ్యాంకులు 14 రోజులు ఉండనున్నాయి. మరి ఏయే రోజుల్లో సెలవులు ఉన్నాయో తెలుసుకుందాం

ఆర్బీఐ క్యాలెండర్‌ ప్రకారం.. సెప్టెంబర్‌ నెలలో మొత్తం 8 రోజులు సెలవులు ఉన్నాయి. ఇవి కాకుండా శని, ఆదివారాలు కలిపి 6 రోజులున్నాయి. అంతే మొత్తం 14 రోజులు బ్యాంకులు మూతపడనున్నాయి. అయితే ఈ సెలవులు కూడా వివిధ రాష్ట్రాలలో వేర్వేరుగా ఉంటాయి. రాష్ట్రాలను బట్టి ఉంటాయి. అయితే వివిధ రాష్ట్రాల్లో ఈ సెలవులు వేర్వేరుగా ఉంటాయి.

సెప్టెంబర్‌ 1వ తేదీన గోవాలో వినాయక చవితి, సెప్టెంబర్‌ 6న జార్ఖండ్‌లో కర్మపూజ పేరుతో బ్యాంకులకు సెలవులు, సెప్టెంబర్‌ 7,8 తేదీల్లో కేరళలో ఓనం పండగ, 9వ తేదీ సిక్కిం, గ్యాంగ్‌టక్‌లో ఇంద్రజాత సెలవుంది.10వ తేదీన శ్రీ నరవణ గురు జయంతి సందర్బంగా కేరళలో బ్యాంకులకు సెలవు. సెప్టెంబర్‌ 21న కేరళలో శ్రీనారాయణ గురు సమాధి దినం, సెప్టెంబర్‌ 26న నవరాత్రి స్థాపన కారణంగా మణిపాల్‌, రాజస్థాన్‌లో బ్యాంకులకు సెలవు. సెప్టెంబర్‌ 24వ తేదీన నాలుగో శనివారం. ఇలా వివిధ రాష్ట్రాల్లో సెప్టెంబర్‌లో సెలవులు ఉండనున్నాయి. ముఖ్య విషయం ఏంటంటే ఈ సెలవులు అన్ని రాష్ట్రాల్లో ఉండవు. రాష్ట్రాలను బట్టి బ్యాంకులు మూసి ఉంటాయని వినియోగదారులు గమనించాలి.

ఇవి కూడా చదవండి

సెప్టెంబర్ నెలలో సెలవుల జాబితా

సెప్టెంబర్ 1- వినాయక చవితి రెండవ రోజు సెప్టెంబర్ 4 – ఆదివారం సెప్టెంబర్ 6 – కర్మపూజ సెప్టెంబర్ 7, 8 – ఓనం సెప్టెంబర్ – ఇంద్రజాత సెప్టెంబర్ 10 -శ్రీ నరవణ గురు జయంతి, రెండవ శనివారం సెప్టెంబర్ 11 – ఆదివారం సెప్టెంబర్ 18 – ఆదివారం సెప్టెంబర్ 21- శ్రీ నారాయణ గురు సమాధి సెప్టెంబర్ 24 – నాలుగవ శనివారం సెప్టెంబర్ 25 – ఆదివారం సెప్టెంబర్ 26 – ఆదివారం

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..