Banks Holiday: బ్యాంకింగ్ కస్టమర్లకు అలర్ట్.. వచ్చే వారంలో బ్యాంక్ సెలవులు ఇవే..
బ్యాంకులతో ప్రతీఒక్కరికీ అవసరం ఉంటుంది. దీంతో సెలవుల గురించి తెలుసుకుంటూ ఉండాలి. బ్యాంక్ బ్రాంచులతో పని ఉన్నవారు తప్పనిసరిగా సెలవుల గురించి తెలుసుకోవాలి. వచ్చే వారంలో బ్యాంకులు రెండు రోజుల పాటు మూతపడి ఉంటాయి. దీంతో బ్యాంకులతో పని ఉన్నవారు వెంటనే పూర్తి చేసుకోవాలి.

బ్యాంకులతో ప్రతీఒక్కరికీ అవసరం ఉంటుంది. దీంతో బ్యాంకులు మూతపడితే అనేక సేవలు నిలిచిపోతాయి. ఈ కారణంతో కస్టమర్లు ఇబ్బంది పడాల్సి రావొచ్చు. బ్యాంకులు మూతపడితే చెక్కుల క్లియెరెన్స్, రుణ పత్రాల ధృవీకరణ వంటి సేవలు కస్టమర్లు పొందలేరు. ఈ క్రమంలో బ్యాంకు సెలవుల నుంచి కస్టమర్లు ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండాలి. మీరు బ్యాంకులకు వెళ్లాలని అనుకుంటే ఒకసారి బ్యాంకు సెలవుల గురించి తెలుసుకుని వెళ్లడం ఉత్తమం. ఆర్బీఐ సెలవుల క్యాలెండర్ ప్రకారం బ్యాంక్ సెలవులు ఉంటాయి. పబ్లిక్ హాలీడేస్, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించే అధికారిక సెలవులు, స్థానిక పండుగల ఆధారంగా హాలీడే లిస్ట్‌ను ఆర్బీఐ ప్రకటిస్తుంది. అందులో భాగంగా జూన్ రెండో వారంలో బ్యాంక్ సెలవుల గురించి ఒకసారి తెలుసుకుందాం.
వచ్చే వారంలో బ్యాంక్ సెలవులు ఇవే..
జూన్ 8 నుంచి 14వ తేదీ వరకు బ్యాంక్ సెలవుల విషయానికొస్తే.. పెద్దగా సెలవులు ఏం లేవు. దీంతో బ్యాంక్ కస్టమర్లకు ఇది పెద్ద ఊరటగా చెప్పవచ్చు. వచ్చే వారంలో బ్యాంకులు యధావిధిగా తెరిచి ఉండనున్నాయి. అందువల్ల బ్యాంకింగ్ కస్టమర్లు పెద్దగా సమస్యలను ఎదుర్కొనే అవకాశం లేదు. జూన్ 8 నుంచి 12వ తేదీ వరకు బ్యాంకులు ఉండనున్నాయి. బ్రాంచుల ద్వారా చేసే నగదు డిపాజిట్లు, విత్ డ్రాలు, చెక్కుల క్లియరెన్స్, డ్రాఫ్ట్స్, ఇతర బ్యాంకింగ్ సేవలన్నీ అందుబాటులో ఉంటాయి. కేవలం జూన్ 13వ తేదీన రెండో శనివారం, జూన్ 14వ తేదీన ఆదివారం కారణంగా బ్యాంకులు క్లోజ్ కానున్నాయి.
శుక్రవారంలోపే పూర్తి చేస్కోండి
బ్యాంక్ బ్రాంచులతో పని ఉంటే శుక్రవారంలోపు పూర్తి చేసుకోండి. ఎందుకంటే ఆ తర్వాత రెండ్రోజుల పాటు బ్యాంకులు ఉండవ్. అందుకే ఆలోపే పని పూర్తి చేసుకోవడం మంచిది. కాగా ప్రతీ నెలా రెండు, నాలుగో శనివారం, ఆదివారాల్లో బ్యాంకులు పనిచేయవు. ఇక పబ్లిక్ హాలీడేస్, రాష్ట్రాల పండుగల సమయాల్లో బ్యాంకులు ఉండవు.
ఈ నెలలో సెలవులు
జూన్ 15న రాజా సంక్రాంతి, జూన్ 25న ముహర్రం, జూన్ 29వ తేదీన సంత్ గురు కబీర్ జన్మదినం, జూన్ 30న రెమ్మాని సందర్భంగా పలు రాష్ట్రాల్లో బ్యాంకులు మూతపడనున్నాయి. ప్రాంతీయ సెలవులు అన్ని రాష్ట్రాలకు ఒకేలా ఉండవు. ఆయా రాష్ట్రాలు, ప్రాంతాల్లోని బ్యాంక్ శాఖలకు మాత్రమే వర్తిస్తాయి. సెలవు రోజుల్లో కేవలం చెక్ డిపాజిట్ ప్రాసెసింగ్, బ్రాంచ్ నుంచి చేసే ఆర్టీజీఎస్ అభ్యర్థనలు, ఇతర ఆఫ్‌లైన్ సేవలు మాత్రమే ఆగిపోతాయి. మిగతా సేవలు డిజిటల్ ఫ్లాట్‌ఫామ్స్ ద్వారా యథావిధిగా చేసుకోవచ్చు.
