AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Youngest Cricketers: సచిన్ టూ వైభవ్.. అతి చిన్న వయస్సులో టీమిండియాలోకి ఎంట్రీ ఇచ్చిన క్రికెటర్స్ వీరే

15 ఏళ్లు.. తోటి పిల్లలతో పాటు గల్లీలో ఆటలాడుకునే వయస్సు అది.. కానీ అదే వయస్సులో బ్యాట్‌ పట్టుకొని గ్రౌండ్‌లోకి అడుగుపెట్టాడు ఒకడు.. క్రికెట్‌ చరిత్రలో ఉన్న ఒక్క ఒక్క రికార్డును బద్దల కొడుతూ.. ఏకంగా గాడ్‌ ఆఫ్ క్రికెట్‌గా పేరున్న సచిన్ రికార్డుకే చెక్‌ పెట్టాడు. అవును ఐపీఎల్‌లో తన ఆటతీరుతో యావత్ ప్రపంచాన్ని ఆకట్టుకున్న వైభవ్ సూర్యవంశీ.. జస్ట్ 15 ఏళ్లకే ఇండియన్ క్రికెట్‌ టీమ్‌కు ఎన్నికై సచిన్ పేరున ఉన్న 37 ఏళ్ల రికార్డును బద్దలకొట్టాడు.

Youngest Cricketers: సచిన్ టూ వైభవ్.. అతి చిన్న వయస్సులో టీమిండియాలోకి ఎంట్రీ ఇచ్చిన క్రికెటర్స్ వీరే
Youngest Cricketer To Play For India
Anand T
|

Updated on: Jun 06, 2026 | 6:51 PM

Share

తాజాగా బీసీసీఐ చేసిన ఒక్క ప్రకటనతో భారత క్రికెట్ చరిత్రలో సరికొత్త అధ్యాయం లిఖించబడింది. కేవలం 15 ఏళ్ల 71 రోజుల వయస్సులోనే బీహార్‌కు చెందిన వైభవ్ సూర్యవంశీ సీనియర్ భారత పురుషుల జట్టులో స్థానం సంపాధించి సంచలనం సృష్టించాడు. రాబోయే ఐర్లాండ్, ఇంగ్లాండ్ టీ20 సిరీస్‌లతో పాటు 2026 ఏషియన్ గేమ్స్ కోసం సెలెక్టర్లు అతడిని ఎంపిక చేయంతో 36 ఏళ్లుగా గాడ్ ఆఫ్ క్రికెట్ సచిన్ టెండూల్కర్ పేరిట ఉన్న రికార్డు ఇప్పుడు వైబర్ పేరుమీదకు మారింది.

ఇండియన్ టీమ్‌లోకి సంచిన్ ఎంట్రీ..

గాడ్‌ ఆఫ్ క్రికెట్‌గా పేరొందిన సచిన్ టెండూల్కర్.. 16 ఏళ్ల 205 రోజుల వయసున్నప్పుడు అంటే 1989లో ఇండియన్ టీమ్‌కు సెలెక్ట్ అయి అప్పుడు చరిత్ర సృష్టించాడు. ఇది జరిగిన దాదాపు 36 ఏళ్ల తర్వాత 2026లో 15 ఏళ్ల 71 రోజుల వయస్సున్న బీహార్‌కు చెందిన సూర్యవంశీ అతి చిన్న వయస్సులో సీనియర్ల భారత జట్టుకు ఎంపికై ఈ రికార్డును బ్రేక్ చేశాడు.

అతి చిన్న వయస్సులో టీమిండియాలోకి ఎంట్రీ ఇచ్చిన క్రికెటర్లు

ప్రస్తుతం సూర్య వంశీతో పాటు ఇప్పటి వరకు భారతదేశం తరపున అతి పిన్న వయస్కులైన పురుషుల అంతర్జాతీయ క్రికెట్‌కు సెలెక్ట్ అయిన జాబితాను చూసుకుంటే.. తొలి స్థానంలో వైభర్ సూర్యవంశీ 15 ఏళ్ల 71 రోజుల్లో ఎంట్రీ ఇవ్వగా .. 16 సంవత్సరాల 205 రోజుల వయస్సులో అరంగేట్రం చేసిన సచిన్ టెండూల్కర్ రెండోస్థానంలో ఉన్నారు. అతని తర్వాత పీయూష్ చావ్లా 17 సంవత్సరాల, 75 రోజులు, లక్ష్మణ్ శివరామకృష్ణన్ 17 సంవత్సరాల, 118 రోజులు, పార్థివ్ పటేల్ 17 సంవత్సరాల, 152 రోజులు, మనింధర్ సింగ్ 17 సంవత్సరాల 222 రోజులకే అంతర్జాతీయ క్రికెట్‌కు ఎన్నికై రికార్డు సృష్టించారు.

ఐపీఎల్‌లో సూర్యవంశీ సంచలనం

ఇక అతి చిన్న వయస్సులోనే ఐపీఎల్‌లోకి కూడా ఎంట్ర ఇచ్చిన సూర్యవంశీ.. అందులోనూ సీనియర్ అటగాళ్ల రికార్డులను బద్దల కొట్టి సంచలనం సృష్టించారు. రాజస్థాన్ రాయల్స్ తరఫున రంగంలోకి దిగిన వైభవ్ ఊహించని విధ్వంసం సృష్టించాడు. సీనియర్ ఆటగాళ్లకు సైతం సాధ్యం కానీ రీతిలో 237.30 స్ట్రైక్ రేట్‌తో ఏకంగా 776 పరుగులు సాధించి ఆరెంజ్ క్యాప్‌ను సొంతం చేసుకున్నాడు. ఇక ఐపీఎల్‌లో అతని ఆట తీరుకు సెలెక్టర్లు సైతం ముద్గులయ్యారు. దీంతో వైభవ్‌ను ఇండియన్ టీమ్‌లోకి తీసుకోవాలని ఫిక్స్ అయ్యారు. తాజాగా ఐర్లాండ్‌తో జరుగబోయే టీ20 సిరీస్ జట్టులో చోటు కల్పించారు.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us