AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral News: వార్నీ ఇదెక్కడి యవ్వారం మావా.. ముగ్గురు అక్కాచెల్లెళ్లను పెళ్లాడిన యువకుడు..

ఒక వ్యక్తి ఒకటి లేదా అంతకంటే ఎక్కవ వివాహాలు చేసుకోవడం మనం చాలానే చూసుంటాం. ఒకే సారి ఇద్దరిని పెళ్లి చేసుకోవడం కూడా చూశాం. కానీ ఒకే ఫ్యామిలీకి చెందినా.. అది కూడా ముగ్గురు అక్కా చెల్లెల్లను ఒకే వ్యక్తి వివాహం చేసుకున్న సంఘటన మీరెక్కడైన చూశారా? కానీ ఇక్కడో వ్యక్తి అదే పనిచేశాడు. ఈ వివాహం స్థానికంగా తీవ్ర చర్చకు దారి తీసింది.

Viral News: వార్నీ ఇదెక్కడి యవ్వారం మావా.. ముగ్గురు అక్కాచెల్లెళ్లను పెళ్లాడిన యువకుడు..
Amroha 3 Sisters Married 1 Groom
Anand T
|

Updated on: Jul 23, 2026 | 1:48 PM

Share

ఒక వ్యక్తి ఓకే ఫ్యామిలీకి చెందిన ముగ్గురు అక్కా చెల్లెల్లను వివాహం చేసుకున్న సంఘటనకు ఉత్తరప్రదేశ్‌లోని అమ్రోహా జిల్లాలో వెలుగు చూసింది. ఈ పెళ్లి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఈ వివాహం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. వివరాల్లోకి వెళ్తే… హసన్‌పూర్ పరిధిలోని దౌరియా గ్రామానికి చెందిన సరోజ్ (20), సావిత్రి (19), సంతోషి (18) అనే ముగ్గురు అక్కాచెల్లెళ్లు సోషల్ మీడియాలో రీల్స్ చేస్తూ మంచి ఫాలోయింగ్‌ను తెచ్చుకున్నారు. అయితే వీళ్లు రీల్స్ చేయడంలో శ్యాంపురి గ్రామానికి చెందిన వికాస్ అనే వ్యక్తి సహాయం చేసేవాడు. వాళ్ల రీల్స్ సంబంధించిన వీడియోలు తీయడం, వాటిని ఎడిల్ చేయడం చేసేవాడు. దీంతో అతనితో వీళ్లకు పరిచయం ఏర్పడింది.

అయితే వికాస్ కొన్ని సార్లు వీళ్లతో కలిసి రీల్స్ కూడా చేసేవాడు. ఆ రీల్స్‌లో వికాస్ చాలా సార్లు అక్కా చెల్లెళ్లకు భర్త క్యారెక్టర్ కూడా చేశాడు. అయితే ఇటీవల పేరెంట్స్ ఈ ముగ్గురు అమ్మాయిలకు పెళ్లి చేయాలని నిర్ణయించారు. దీంతో వేర్వేరు ప్రదేశాల్లో వాళ్లకు పెళ్లి సంబంధాలు చూడటం స్టార్ట్ చేశారు. అయితే, ఒకరినొకరు విడిపోవడం ఇష్టం లేని ఈ ముగ్గురు అక్కా చెల్లెళ్లు కీలక నిర్ణయం తీసుకున్నారు. ముగ్గూరు కలిసి తమకు పరిచయస్తుడైన వికాస్‌ను పెళ్లి చేసుకోవాలని నిర్ణయించారు. ఈ విషయాన్ని వికాస్‌కు చెప్పడంతో అతను కూడా ఓకే చెప్పాడు.

దీంతో జూలై 17న స్థానికంగా ఉన్నా చాముండా మాత ఆలయంలో ముగ్గురు అక్కా చెల్లెళ్లు వికాస్‌ను వివాహం చేసుకున్నారు.వికాస్ కూడా వరుసగా ముగ్గురి నుదుటన సిందూరం దిద్ది పెళ్లి చేసుకున్నాడు. అయితే వీళ్ల పెళ్లికి ఇరువైపులా కుటుంబ సభ్యులు ఎవరూ హాజరుకాలేదు. తర్వాత ఈ పెళ్లికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో కుటుంబ సభ్యుతలో పాటు హిందూ సంఘాల నేతల పెళ్లిపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.

దీంతో ఆ ముగ్గురు అక్కా చెల్లెళ్లు తమ పెళ్లిక సంబంధించి ఓ వీడియోను సోషల్‌ మీడియాలో పోస్ట్ చేస్తూ.. తమ నిర్ణయాన్ని సమర్థించుకున్నారు. మేం అంతా చిన్నప్పటి నుంచి కలిసే పెరిగామని.. ఒకరినొదిలి మరొకరం ఉండలేం. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాం అని తెలిపారు. అయినా మన పూర్వకాలంలో దశరథ మహారాజు సైతం ముగ్గురిని పెళ్లాడారు కదా?.. మేం చేసుకుంటే తప్పేంది.. మేము మేజర్లం..మా ఇష్టపూర్వకంగానే పెళ్లి చేసుకున్నాం.. దీనిలో వేరే వాళ్లకు ఎందుకు అభ్యతరం అని ప్రశ్నించారు. ఇక మేం మేజర్లం.. ఈ పెళ్లి మాష్టం అని చెప్పడంతో పోలీసులు కూడా పెద్దగా జోక్యం చేసుకోలేదు.. ఈ పెళ్లి గురించి పూర్తి వివరాలు సేకరిస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us