Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bank Holiday in August 2023: బ్యాంకు పనులు ఉంటే వెంటనే పూర్తి చేయండి.. ఆ14 రోజులు బ్యాంకులు క్లోజ్..

RBI Calender: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా క్యాలెండర్ ప్రకారం, బ్యాంకులకు వారంలో 14 రోజులు సెలవులు ఉండబోతున్నాయి. ఇందులో శని, ఆదివారాల్లో 6 సెలవులు ఉండబోతున్నాయి. బ్యాంకుల పనిదినాలను వారానికి ఐదు రోజులు మాత్రమే ఉంచాలని యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ (యుఎఫ్‌బియు) డిమాండ్ చేసింది. దీనితో పాటు, ఉద్యోగులకు వారానికి 2 రోజులు సెలవులు లభిస్తాయి. ప్రస్తుతం బ్యాంకు ఉద్యోగులకు ఆదివారాలు, రెండో, నాలుగో శనివారాల్లో సెలవులు లభిస్తున్నాయి. బ్యాంకు పనులు ఉంటే ముందే ప్లాన్ చేసుకోండి..

Bank Holiday in August 2023: బ్యాంకు పనులు ఉంటే వెంటనే పూర్తి చేయండి.. ఆ14 రోజులు బ్యాంకులు క్లోజ్..
Bank Holiday
Follow us
Sanjay Kasula

|

Updated on: Aug 01, 2023 | 7:20 AM

అగస్టు నెల మొదలైంది. ఆర్ధిక ప్లాన్ చేసుకోవాలి.. బ్యాంకు లావాదేవీలు చాలా ముఖ్యం. కొన్ని సార్లు మనకు తెలియకుండా బ్యాంకు పనులను వాయిదా వేసుకుంటాం. మనం వెళ్లిన రోజు బ్యాంకు క్లోజ్ ఉంటుంది. సరిగ్గా రోజు బ్యాంకుకు సెలవు. అంతే షాక్.. మనం ముందుగా తెలిస్తే బ్యాంకు పని నిన్ననే పూర్తి చేసుకునేవారిమని పశ్చాత్తాప పడుతాం. ఎందుకంటే చాలా మంది పరీక్షల ఫీజులు, కానీ కంపెనీలకు చెల్లించాల్సిన డీడీల విషయంలో రేపు కట్టొచ్చులే అని పక్కన పెడుతాం. అప్పుడే ఇలాంటి ఘటనలు జరుుతుంటాయి. ముందే బ్యాంకు సెలవుల వివరాలు తెలుసుకుని ఉంటే ఆ సమస్య అస్సలు రాదు.

ప్రతి నెలలాగే, ఈ నెల కూడా సెలవుల జాబితాను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విడుదల చేసింది. కొత్త క్యాలెండర్ ప్రకారం, ఆగస్టు నెలలో బ్యాంకులకు 14 రోజులు సెలవులు ఉండబోతున్నాయి. ఈ అన్ని ఆదివారాలు అలాగే రెండవ, నాల్గవ శనివారాలు బ్యాంకులు క్లోజ్ ఉంటుంది. భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) ఈ సెలవులను మూడు కేటగిరీలుగా ఉంచింది. వివిధ రాష్ట్రాల్లో వేర్వేరు రోజుల్లో ఈ సెలవులు రానున్నాయి.

ఆదివారం, శనివారం మినహా సెలవులు

శని, ఆదివారాలు కాకుండా, ఆగస్టు నెలలో కొన్ని ఎనిమిది బ్యాంకులకు సెలవులు ఉండబోతున్నాయి. వీటిలో టెండాంగ్ లో రమ్ ఫాట్, స్వాతంత్ర్య దినోత్సవం, పార్సీ నూతన సంవత్సరం (షహన్‌షాహి), శ్రీమంత శంకరదేవ తేదీ, మొదటి ఓనం, తిరువోణం, రక్షా బంధన్, రక్షా బంధన్/శ్రీ నారాయణ గురు జయంతి/పాంగ్-లాబ్సోల్ ఉన్నాయి. ఆయా రాష్ట్రాలకు అనుకూలంగా ఈ సెలవులు ఉంటాయి.

ఆగస్టు 2023లో ఎప్పుడు సెలవు అంటే..

  • (టెండాంగ్ లో రమ్ ఫాట్) కారణంగా సిక్కింలో ఆగస్టు 8న బ్యాంకులకు సెలవు.
  • ఆగస్టు 15న (స్వాతంత్ర్య దినోత్సవం) భారతదేశం అంతటా బ్యాంకులకు సెలవు
  • ఆగస్ట్ 16 (పార్సీ నూతన సంవత్సరం – షహన్‌షాహి) కారణంగా బేలాపూర్, ముంబై, నాగ్‌పూర్‌లలో బ్యాంకులకు సెలవు.
  • శ్రీమంత్ శంకర్‌దేవ్ తిథి కారణంగా ఆగస్టు 18న గౌహతిలో బ్యాంకులకు సెలవు
  • ఆగస్టు 28, మొదటి ఓనం రోజున కొచ్చి, తిరువనంతపురంలో బ్యాంకులకు సెలవు
  • ఆగస్టు 29న తిరువోణం సందర్భంగా కొచ్చి, తిరువనంతపురంలో బ్యాంకులకు సెలవు
  • రక్షాబంధన్ సందర్భంగా ఆగస్టు 30న జైపూర్, సిమ్లాలో బ్యాంకులకు సెలవు
  • రక్షా బంధన్ కారణంగా ఆగస్టు 31న డెహ్రాడూన్, గ్యాంగ్‌టక్, కాన్పూర్, కొచ్చి, లక్నో, తిరువనంతపురంలో బ్యాంకులకు సెలవు
  • ఎన్ని శనివారాలు, ఆదివారాలు సెలవు
  • ఆగస్ట్ నెలలో, శని, ఆదివారాలతో సహా మొత్తం 6 రోజుల పాటు బ్యాంకులు మూసివేయబడతాయి.
  • ఆగస్టు 6న ఆదివారం, ఆగస్టు 12న రెండో శనివారం, ఆగస్టు 13న ఆదివారం, ఆగస్టు 20న ఆదివారం, ఆగస్టు 26న నాలుగో శనివారం, ఆగస్టు 27న ఆదివారం సెలవులు ఉంటాయి.

వారానికి 5 రోజులు మాత్రమే పని చేయాలని డిమాండ్..

బ్యాంకుల పనిదినాలను వారానికి ఐదు రోజులు మాత్రమే ఉంచాలని యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ (యుఎఫ్‌బియు) డిమాండ్ చేసింది. దీనితో పాటు, ఉద్యోగులకు వారానికి 2 రోజులు సెలవులు లభిస్తాయి. ప్రస్తుతం బ్యాంకు ఉద్యోగులకు ఆదివారాలు, రెండో, నాలుగో శనివారాల్లో సెలవులు లభిస్తున్నాయి.

మరిన్ని బిజినెస్ న్యూస్ కోసం