Holi 2022 bank holiday: ఈ వారంలో బ్యాంక్‌కు వెళ్లే పని ఉందా? బ్యాంకు ద్వారా లావాదేవీలు జరిపే పనులు ఏమైనా ఉంటే.. మీకోసమే ఈ అలర్ట్. మీరు బ్యాంకు ద్వారా చేయాల్సిన పనులు ఏమైనా ఉంటే ఇప్పుడే పూర్తి చేసుకోండి. లేదంటే నాలుగు రోజుల పాటు మీ పనులు పెండింగ్ పడే అవకాశం ఉంది. అవును.. దేశంలోని కొన్ని ప్రాంతాల్లో ఈ వారం 4 రోజుల వరకు బ్యాంకులు బంద్ ఉంటాయి. హోలికా దహనం(మన తెలుగు రాష్ట్రాల్లో కామును దహనం) సందర్భంగా కొన్ని రాష్ట్రాల్లో మార్చి 17న బ్యాంకులు మూసివేయడం జరుగుతుంది.
17వ తేదీన ఏ రాష్ట్రాల్లో..
ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, జార్ఖండ్‌లలో బ్యాంకులకు సెలవు ఉంటంది.
18వ తేదీన..
గుజరాత్, మిజోరం, మధ్యప్రదేశ్, చండీగఢ్, ఉత్తరాఖండ్, సిక్కిం, అస్సాం, రాజస్థాన్, జమ్ము కశ్మీర్, ఉత్తరప్రదేశ్, బెంగాల్, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, న్యూఢిల్లీ, గోవా, బీహార్, ఛత్తీస్‌గఢ్, మేఘాలయ, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కశ్మీర్‌లో హోలీ కారణంగా బ్యాంకులు క్లోజ్ ఉంటాయి.
19వ తేదీన..
హోలీ/యోసాంగ్ రెండవ రోజున అంటే మార్చి 19వ తేదీన ఒరిస్సా, మణిపూర్, బీహార్‌లలో బ్యాంకులు మూతబడతాయి. ప్రతి నెల రెండవ, నాల్గవ శనివారాలు బ్యాంకులు క్లోజ్ ఉంటాయని తెలిసిందే. 19వ తేదీన రెండవ శనివారం కావడంతో యధావిధిగా దేశ వ్యాప్తంగా బ్యాంకులు మూసివేస్తారు.
ఇక ఆదివారం(మార్చి 20) ఎలాగూ సెలవు దినమే కావడంతో ఆ రోజున కూడా బ్యాంకులు క్లోజ్ ఉంటాయి. మొత్తానికి ఈ వారంలో నాలుగు రోజుల పాటు బ్యాంకులకు సెలవులు ఉన్నాయి. వీటిని దృష్టిలో పెట్టుకుని బ్యాంక్ కస్టమర్లు.. తమ తమ పనులను ముందే పూర్తి చేసుకోవడం మంచిది.
Also read:
Pregnancy Diet: గర్భిణీ స్త్రీ ఈ పండ్లు తింటున్నారా? అయితే, ఈ వివరాలు తెలుసుకోవాల్సిందే..