Success Story: షుగర్ లేని స్వీట్లు.. ఈ ఐడియా వారి జీవితాన్నే మార్చేసింది.. ఏకంగా రూ. కోట్లు సంపాదించి పెడుతోంది..

ప్రపంచవ్యాప్తంగా మధుమేహం ఒక ప్రధాన ఆరోగ్య సమస్యగా మారింది. మన దేశంలో చాలా వేగంగా విస్తరిస్తోంది. సహజంగా మన దేశంలో ప్రజలకు స్వీట్లంటే మమకారం ఎక్కువ. పండగలు, శుభకార్యాలు తదితర ఏ సందర్భమైనా స్వీట్ లేనిదే పని జరగదు. కానీ షుగర్ లేదా డయాబెటిక్ వస్తే ముందు స్వీట్లకు దూరమవుతారు. ఈ విషయం మనసికంగా ఇబ్బందిని కలిగిస్తుంది. ఈ సమస్యకు చక్కెర రహిత స్వీట్లు పరిష్కారం చూపాయి.

Success Story: షుగర్ లేని స్వీట్లు.. ఈ ఐడియా వారి జీవితాన్నే మార్చేసింది.. ఏకంగా రూ. కోట్లు సంపాదించి పెడుతోంది..
Artinci Sugar Free Sweets
Follow us

|

Updated on: Apr 30, 2024 | 3:27 PM

షుగర్ ఫ్రీ స్వీట్లు తయారు చేస్తూ ఆ దంపతులు రూ.కోట్లు సంపాదిస్తున్నారు. ఉన్నత ఉద్యోగాలను వదిలేసి వ్యాపారంలో రాణిస్తున్నారు. ఆర్టిన్సీ బ్రాండ్ తో వీరు తయారు చేస్తున్న స్వీట్లకు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. రూ.25 లక్షలతో ప్రారంభమైన వ్యాపారం రూ.4.4 కోట్లకు చేరింది.

మధుమేహం ప్రధాన సమస్య..

ప్రపంచవ్యాప్తంగా మధుమేహం ఒక ప్రధాన ఆరోగ్య సమస్యగా మారింది. మన దేశంలో చాలా వేగంగా విస్తరిస్తోంది. సహజంగా మన దేశంలో ప్రజలకు స్వీట్లంటే మమకారం ఎక్కువ. పండగలు, శుభకార్యాలు తదితర ఏ సందర్భమైనా స్వీట్ లేనిదే పని జరగదు. కానీ షుగర్ లేదా డయాబెటిక్ వస్తే ముందు స్వీట్లకు దూరమవుతారు. ఈ విషయం మనసికంగా ఇబ్బందిని కలిగిస్తుంది. ఈ సమస్యకు చక్కెర రహిత స్వీట్లు పరిష్కారం చూపాయి. షుగర్ బాధితులతో పాటు మామూలు వారు సైతం వీటిపై ఆసక్తి చూపుతున్నారు.

షుగర్ ఫ్రీ స్వీట్లు..

బెంగళూరుకు చెందిన ఆర్తి లక్ష్మణ్, సుమిత్ రస్తోగి దంపతులు ఈ చక్కెర రహిత ఐస్ క్రీం, స్వీట్స్ బ్రాండ్ ను ఏర్పాటు చేశారు. ఆర్టిన్సి(Artinci) జీరో షుగర్‌ పేరుతో రుచికరమైన డెజర్ట్‌లను తయారు చేస్తున్నారు. వీటిని ల్యాబ్ లో పరిక్షించి, పూర్తి షుగర్ రహితమైనవని నిర్థారించారు. తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ స్వీటెనర్‌తో అదనపు సహజ స్టెవియా మిశ్రమంతో వీటిని తయారు చేస్తున్నారు. షుగర్ ఫ్రీ స్వీట్ల వ్యాపారం కోసం ఆర్తి, సుమిత్ దంపతులు తమ అధిక జీతం వచ్చే ఉద్యోగాలను వదిలేశారు. షార్క్ ట్యాంక్ సీజన్ 3లో వారి ఉత్పత్తిని పిచ్ చేసిన వీరు బాగా పాపులర్ అయ్యారు.

తీపిపై మమకారం..

ఆర్తి లక్ష్మణ్, సుమిత్ రస్తోగి కుటుంబాలలో మూడు తరాలుగా మధుమేహం ఉంది. వీరిద్దరూ 2012లో ప్రీ డయాబెటిక్‌గా నిర్ధారణ అయ్యారు. కానీ స్వీట్లు అంటే వారికి చాలా ఇష్టం. మధుమేహం కారణంగా వాటికి దూరం కావాల్సి వచ్చింది. దీంతో చక్కెర రహిత స్వీట్ల కోసం వెతకడం ప్రారంభించారు. మార్కెట్లో అవి పరిమితంగా ఉండడంతో నిరాశ చెందారు. అనేక ప్రయత్నాలు చేసి ఆర్టిన్సి బ్రాండ్ తో డయాబెటిక్ ఫ్రెండ్లీ స్వీట్‌లను తయారు చేస్తున్నారు.

అనేక ప్రయత్నాలు..

ఆర్తి ఒక ప్రముఖ కంపెనీలో హెచ్‌ఆర్‌గా పనిచేసేవారు. ఆమె ప్రీ డయాబెటిక్ గా నిర్ధారణ అయిన తర్వాత చక్కెర లేని డెజర్ట్‌లతో ప్రయోగాలు చేయడం, వివిధ రకాల చక్కెర రహిత ఉత్పత్తులను తయారు చేయడం ప్రారంభించారు. ఆమె వినికిడి లోపంతో కూడా బాధపడేవారు. 2012లో కౌంటర్‌టాప్ ఐస్ క్రీం మెషీన్‌ను కొనుగోలు చేశారు. ఆన్‌లైన్‌లో లభించే వంటకంతో స్వీట్లను తయారు చేయడం మొదలుపెట్టారు. అలా ప్రయత్నించి 2015 నాటికి చక్కెరను ఉపయోగించకుండా ఒక వంటకాన్ని అభివృద్ధి చేశారు. దానితో కేక్‌లు, కుకీలు తయారు చేశారు. షుగర్ ఫ్రీ స్వీట్లకు మార్కెట్ లో ఉన్న అవకాశాన్ని గుర్తించారు.

రూ.25 లక్షల పెట్టుబడి..

వ్యాపారాన్ని విస్తరించాలనే ఉద్దేశంతో ఈ దంపతులు తమ ఉద్యోగాలను వదిలివేయాలని నిర్ణయించుకున్నారు. అదే తమ ఆదాయ వనరుగా మార్చుకున్నారు. సుమిత్, ఆర్తి ఇద్దరికీ పెద్ద బహుళజాతి కంపెనీలలో పనిచేసిన అనుభవం ఉంది. అది కూడా వీరికి అనుకూలంగా మారింది. ఈ జంట 2020 జనవరిలో రూ. 25 లక్షల పెట్టుబడితో ఆర్టిన్సిని ప్రారంభించారు.

జాతీయ స్థాయిలో గుర్తింపు..

సుమిత్, ఆర్తి కూడా తమ వ్యాపార ఆలోచనతో షార్క్ ట్యాంక్ వద్దకు వచ్చారు. దీంతో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు. షుగర్ కాస్మెటిక్స్ వ్యవస్థాపకురాలు వినీతా సింగ్ నుంచి 5 శాతం ఈక్విటీతో పాటు 1 శాతం రాయల్టీకి రూ. 50 లక్షల ఆఫర్‌ను అంగీకరించారు.

పెరిగిన ఆర్డర్లు..

షార్క్ ట్యాంక్‌లో కనిపించిన తర్వాత, కేవలం 24 గంటల్లోనే 700 శాతం ఆర్డర్‌లు భారీగా పెరిగాయని సమాచారం. బ్రిటన్, ఆస్ట్రేలియాతో సహా అనేక దేశాల నుంచి ఆర్డర్ల కోసం ప్రజలు ఆరా తీయడం ప్రారంభించారు. రూ.25 లక్షల పొదుపుతో ప్రారంభమైన ఆర్టిన్సి 2022-23 ఆర్థిక సంవత్సరంలో రూ.4.4 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది.

షార్క్ ట్యాంక్ అంటే..

షార్క్ ట్యాంక్ అనేది అత్యంత ప్రజాదరణ పొందిన రియాలిటీ షో. వ్యవస్థాపకులు తమ వ్యాపారంలో పెట్టుబడుల కోసం షోలో ప్యానెల్ కు తమ ఆలోచనలు తెలుపుతారు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Latest Articles
పిల్లలకు గోధుమపిండి అంటే అలెర్జీనా.. బీ అలర్ట్..
పిల్లలకు గోధుమపిండి అంటే అలెర్జీనా.. బీ అలర్ట్..
ఆహాలో సుహాస్ లేటెస్ట్ హిట్ 'ప్రసన్న వదనం.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
ఆహాలో సుహాస్ లేటెస్ట్ హిట్ 'ప్రసన్న వదనం.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
స్నానం చేసే బకెట్‌లో వీటిని కలపండి.. ఆ ప్రాబ్లమ్స్‌ అన్నీ మాయం!
స్నానం చేసే బకెట్‌లో వీటిని కలపండి.. ఆ ప్రాబ్లమ్స్‌ అన్నీ మాయం!
మీన రాశిలో కుజుడు..ఆ రాశుల వారికి రాజ యోగాలు.. దోషాలు కూడా!
మీన రాశిలో కుజుడు..ఆ రాశుల వారికి రాజ యోగాలు.. దోషాలు కూడా!
లక్నోతో మ్యాచ్.. టాస్ గెలిచిన ముంబై.. సచిన్ కుమారుడు వచ్చేశాడు
లక్నోతో మ్యాచ్.. టాస్ గెలిచిన ముంబై.. సచిన్ కుమారుడు వచ్చేశాడు
రోజుని మష్రూమ్ కాఫీతో ప్రారంభించండి.. ఆరోగ్య ప్రయోజనాలు ఎన్నో..
రోజుని మష్రూమ్ కాఫీతో ప్రారంభించండి.. ఆరోగ్య ప్రయోజనాలు ఎన్నో..
దోసకాయ తొక్క.. పనికిరాదని పారేయకండి.. లాభాలు తెలిస్తే అవాక్కే!
దోసకాయ తొక్క.. పనికిరాదని పారేయకండి.. లాభాలు తెలిస్తే అవాక్కే!
ఉత్తరాదిని ఉక్కిరిబిక్కిరి చేస్తున్న వింత వాతావరణం..!
ఉత్తరాదిని ఉక్కిరిబిక్కిరి చేస్తున్న వింత వాతావరణం..!
మేష రాశిలో బుధుడు..ఆ రాశుల వారికి పలు సమస్యల నుంచి విముక్తి
మేష రాశిలో బుధుడు..ఆ రాశుల వారికి పలు సమస్యల నుంచి విముక్తి
వ్యాక్సిన్లపై సంచలనం రేపుతున్న పరిశోధనలు!
వ్యాక్సిన్లపై సంచలనం రేపుతున్న పరిశోధనలు!