Bajaj Chetak EV: అమ్మకాల్లో చేతక్ ఈవీ నయా రికార్డులు.. ఒక్క నెలలో వృద్ధి ఎంతంటే?
భారతదేశంలో ఇటీవల కాలంలో ఎలక్ట్రిక్ వాహనాల అమ్మలు బాగా పెరిగాయి. ముఖ్యంగా మధ్యతరగతి ప్రజలు ఈవీ స్కూటర్ల కొనుగోలుకు ఆసక్తి చూపడంతో ఆయా స్కూటర్ల అమ్మకాలు నయా రికార్డులను సృష్టిస్తున్నాయి. అయితే అమ్మకాల్లో ఓలా కంపెనీ అగ్రగామిగా ఉన్నా కొన్ని కంపెనీలు ఇటీవల తమ మార్క్‌ను చూపిస్తున్నాయి. ముఖ్యంగా బజాజ్ చేతక్ ఈవీ స్కూటర్లు అమ్మకాల్లో మార్చిలో సరికొత్త రికార్డులను చేరుకుంది.

బజాజ్ ఆటో కంపెనీ సంబంధించిన చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ భారతదేశంలో అత్యధికంగా అమ్ముడైన ఈ-స్కూటర్‌గా నిలిచింది. మార్చి 2025లో అమ్మకాలు 34,863 యూనిట్లకు చేరుకున్నాయి. ఈ విజయం స్థిరమైన మొబిలిటీ సొల్యూషన్స్ వైపు స్పష్టమైన వినియోగదారుల ధోరణిని తెలియజేస్తుందని నిపుణులు చెబుతున్నారు. భారతీయ ఎలక్ట్రిక్ వెహికల్ మార్కెట్‌లో బజాజ్ ఆటో వ్యూహాత్మక విధానాన్ని అవలంభిస్తుందని నిపుణులు చెబుతున్నారు. దీంతో మార్చి 2025లో బజాజ్ ఆటో చేతక్ కోసం ఇప్పటివరకు అత్యధిక నెలవారీ అమ్మకాలను నమోదు చేసింది. ఈ ఒక్క నెలలోనే 34,863 యూనిట్లను పంపిణీ చేసింది
సగటున రోజుకు 1,124 బజాజ్ చేతక్ స్కూటర్లు దేశంలో అమ్ముడయ్యాయి. ఈ అత్యుత్తమ పనితీరు ఆర్థిక సంవత్సరంలో రికార్డు స్థాయిలో వార్షిక అమ్మకాలకు దోహదపడింది. ఇప్పటిదాకా బజాజ్ చేతక్ ఈవీ మొత్తం అమ్మకాలు 230,761 యూనిట్లను అధిగమించాయి. ఇది గత సంవత్సరం 1,06,624 యూనిట్ల అమ్మకాలతో పోలిస్తే 116 శాతం గణనీయమైన వృద్ధిని సూచిస్తుంది. బజాజ్ ఆటో కంపెనీ 2025 ఆర్థిక సంవత్సరంలో 20 శాతం మార్కెట్ వాటాను నివేదించింది. ఇది గత సంవత్సరంతో పోలిస్తే 11 శాతం నుంచి దాదాపు రెట్టింపు అయ్యింది. ఈ పెరుగుదలకు ఈ సంవత్సరం తీసుకున్న అనేక చురుకైన చర్యలు కారణమని చెప్పవచ్చు. ముఖ్యంగా డిసెంబర్ 2024లో కొత్త 35 సిరీస్‌ను ప్రవేశపెట్టడం వల్ల వినియోగదారుల నుంచి మంచి ఆదరణ లభించింది.
టీవీఎస్
టీవీఎస్ రెండవ అతిపెద్ద ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన తయారీదారుగా ఉంది. టీవీఎస్ ఐక్యూబ్ అమ్మకాలు 30,453 యూనిట్లకు చేరుకున్నాయి. అంటే దాదాపు 23 శాతం మార్కెట్ వాటాను సొంతం చేసుకుంది. 2025 ఆర్థిక సంవత్సరంలో టీవీఎస్ 2,37,551 యూనిట్లను విక్రయించింది. ఇది 2024 ఆర్థిక సంవత్సరంలో 1,83,189 యూనిట్లతో పోలిస్తే 30 శాతం పెరిగి 21 శాతం మార్కెట్ వాటాను సాధించింది.
ఓలా ఎలక్ట్రిక్
ఓలా ఎలక్ట్రిక్ మూడు సంవత్సరాలుగా ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన మార్కెట్‌లో అగ్రగామిగా ఉంది. మార్చి 2025లో ఇది 23,430 యూనిట్లను విక్రయించింది. అంటే మార్కెట్‌లో 18 శాతం వాటాను కైవసం చేసుకుంది. ఫిబ్రవరిలో నాలుగో స్థానానికి పడిపోయిన తర్వాత తిరిగి మూడో స్థానాన్ని పొందింది.
ఏథర్ ఎనర్జీ
మార్చి 2025లో ఏథర్ ఎనర్జీ 15,446 ఈ-స్కూటర్లను విక్రయించి 12 శాతం మార్కెట్ వాటాతో 4వ స్థానంలో నిలిచింది. ఈ కంపెనీ మొత్తం 1,30,913 యూనిట్ల అమ్మకాలను నమోదు చేసింది. ఇది గత సంవత్సరంతో పోలిస్తే 20 శాతం పెరుగుదల, 11.40 శాతం మార్కెట్ వాటాను సాధించింది. 2024 ఆర్థిక సంవత్సరంలో 11.50 శాతం నుంచి కొద్దిగా తగ్గింది.
హీరో మోటోకార్ప్
హీరో మోటోకార్ప్ 2025 ఆర్థిక సంవత్సరంలో 7,977 యూనిట్ల రికార్డు నెలవారీ రిటైల్ పనితీరును సాధించింది. అక్టోబర్ (7,350 యూనిట్లు), నవంబర్ 2024 (7,344 యూనిట్లు)లను అధిగమించింది. దీనితో మొత్తం 48,668 యూనిట్లకు చేరుకుంది, ఇది గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 175 శాతం గణనీయమైన వృద్ధిని నమోదు చేసింది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




