AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Cars Offers: పండక్కి కార్ల కంపెనీలు బంపరాఫర్‌.. రూ. 2 లక్షల వరకు డిస్కౌంట్స్‌..

అయితే దీనికి అనుగుణంగానే ఆటోమొబైల్ కంపెనీలు సైతం పండగ సీజన్‌లో కొత్త మోడల్స్‌ను లాంచ్‌ చేయడంతోపాటు, డిస్కౌంట్స్‌ను అందిస్తున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా పలు ఆటో మొబైల్‌ సంస్థలు భారీ ఎత్తున డిస్కౌంట్స్‌ను అందిస్తున్నాయి. కార్ల కంపెనీలను బట్టి రూ. 10 వేల నుంచి రూ. 2 లక్షల వరకు డిస్కౌంట్స్‌ అందిస్తున్నాయి. వీటితో పాటు డీలర్లు సైతం కార్ల యాక్ససరీలపై అదనంగా డిస్కౌంట్స్‌ను...

Cars Offers: పండక్కి కార్ల కంపెనీలు బంపరాఫర్‌.. రూ. 2 లక్షల వరకు డిస్కౌంట్స్‌..
Discount On Cars
Narender Vaitla
|

Updated on: Oct 16, 2023 | 8:42 PM

Share

దసరా, దీపావళి పండగులను క్యాష్ చేసుకునే క్రమంలో ఈ కామర్స్‌ సైట్స్‌ బంపరాఫర్‌ ప్రకటించాయి. అమెజాన్‌తో పాటు, ఫ్లిప్‌కార్ట్‌ సైతం సేల్స్‌ పేరుతో భారీ డిస్కౌంట్స్‌ అందిస్తున్నాయి. ఇక పండగలకు కార్లను కొనుగోలు చేయడం భారతీయులకు ఒక సెంటిమెంట్‌గా వస్తోంది.

అయితే దీనికి అనుగుణంగానే ఆటోమొబైల్ కంపెనీలు సైతం పండగ సీజన్‌లో కొత్త మోడల్స్‌ను లాంచ్‌ చేయడంతోపాటు, డిస్కౌంట్స్‌ను అందిస్తున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా పలు ఆటో మొబైల్‌ సంస్థలు భారీ ఎత్తున డిస్కౌంట్స్‌ను అందిస్తున్నాయి. కార్ల కంపెనీలను బట్టి రూ. 10 వేల నుంచి రూ. 2 లక్షల వరకు డిస్కౌంట్స్‌ అందిస్తున్నాయి. వీటితో పాటు డీలర్లు సైతం కార్ల యాక్ససరీలపై అదనంగా డిస్కౌంట్స్‌ను అందిస్తున్నారు. అక్టోబర్‌ 31వ వరకు ఈ ఆఫర్లు అందించనున్నారు.

* భారత్‌లో కార్లకు పెట్టింది పేరైన మారుతీ సుజుకీ తమ బ్రాండ్‌కు చెందిన పలు కార్లపై భారీగా డిస్కౌంట్ అందిస్తోంది. ఆల్టో, వేగనార్‌, సెలెరియో, ఎస్‌ ప్రెసో కార్లపై ఏకంగా రూ. 61 వేల వరకు డిస్కౌంట్ అందిస్తున్నారు. అలాగే స్విఫ్ట్‌పై రూ. 54 వేల ఆఫర్‌ అందిస్తున్నారు.

* ఇక మరో ప్రముఖ కార్ల తయారీ సంస్థ హ్యుందాయ్‌ కూడా భారీగా డిస్కౌంట్స్‌ అందిస్తోంది. హ్యూందయ్‌కి చెందిన ఎక్స్‌టర్‌, వెన్యూ, క్రెటా మినహా మిగిలిన అన్ని మోడళ్లపై ఆఫర్లను అందిస్తోంది. మోడల్‌ బట్టి.. రూ.10 వేల నుంచి రూ.రెండు లక్షల వరకు డిస్కౌంట్స్ ఇస్తున్నారు. గ్రాండ్‌ ఐ10 నియోస్‌పై రూ.43 వేలు, ఆరాపై రూ.33 వేల వరకు డిస్కౌంట్స్‌ అందిస్తున్నారు.

* ఇక మహీంద్రా కంపెనీ కూడా ఏకంగా రూ. 90 వేల వరకు డిస్కౌంట్స్‌ ఇవ్వనున్నారు. ఎక్స్‌యూవీ300పై రూ.90 వేలు, విద్యుత్‌ ఎక్స్‌యూవీ400పై రూ.1.25 లక్షలు డిస్కౌంట్స్‌ ఇస్తున్నారు. బొలెరోపై రూ.70 వేలు, బొలెరో నియోపై రూ.50 వేల రాయితీ ఉన్నట్లు తెలిపింది.

* ఇక టయోటా హీలక్స్‌, సిట్రోయెన్‌ సీ5 ఎయిర్‌క్రాస్‌, ఫోక్స్‌వ్యాగన్‌ టిగువాన్‌, జీప్‌ మెరీడియన్‌, జీప్‌ కంపాస్‌, ఎంజీ హెక్టార్‌, ఎంజీ జెడ్‌ఎస్‌ ఈవీపై రూ.1 లక్ష నుంచి రూ.ఐదు లక్షల వరకు డిస్కౌంట్ అందిస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ ఏడాది పండుగల నేపథ్యంలో కార్ల అమ్మకాలు 10 లక్షల యూనిట్లు దాటే అవకాశం ఉందని ఆటో మొబైల్‌ సంస్థలు అంచనా వేస్తున్నాయి.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..

తిరుపతి నుంచి వస్తుండగా ప్రమాదం..నలుగురు హైదరాబాదీలు మృతి
తిరుపతి నుంచి వస్తుండగా ప్రమాదం..నలుగురు హైదరాబాదీలు మృతి
2025లో తెలంగాణలో పెరిగిన అవినీతి.. ఏ శాఖలో ఎక్కువ జరిగిందంటే..
2025లో తెలంగాణలో పెరిగిన అవినీతి.. ఏ శాఖలో ఎక్కువ జరిగిందంటే..
నెలకు రూ.60 వేల ఆదాయం.. తక్కువ పెట్టుబడి!
నెలకు రూ.60 వేల ఆదాయం.. తక్కువ పెట్టుబడి!
గతంలో ఎన్నో తప్పులు చేశాను.. ఇప్పుడు అలాంటి పాత్రలే చేయాలనుంది..
గతంలో ఎన్నో తప్పులు చేశాను.. ఇప్పుడు అలాంటి పాత్రలే చేయాలనుంది..
రైల్వే ప్రయాణీకులకు అటెన్షన్.! భారీగా పెరిగిన ఛార్జీలు అమలులోకి..
రైల్వే ప్రయాణీకులకు అటెన్షన్.! భారీగా పెరిగిన ఛార్జీలు అమలులోకి..
36 బంతుల్లో సెంచరీ..వైభవ్ సూర్యవంశీ ఊచకోతకు ప్రధాని మోదీ ఫిదా!
36 బంతుల్లో సెంచరీ..వైభవ్ సూర్యవంశీ ఊచకోతకు ప్రధాని మోదీ ఫిదా!
ఏపీకి కేంద్రం శుభవార్త.. కూటమి ప్రభుత్వానికి పండగే
ఏపీకి కేంద్రం శుభవార్త.. కూటమి ప్రభుత్వానికి పండగే
అద్దె భవనాల ఖాళీపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు!
అద్దె భవనాల ఖాళీపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు!
చేదు కాకరకాయలో చెప్పలేనన్నీ పోషకాలు,ఇలా వాడితే ఆ రోగాలన్నీ పరార్!
చేదు కాకరకాయలో చెప్పలేనన్నీ పోషకాలు,ఇలా వాడితే ఆ రోగాలన్నీ పరార్!
భారత కరెన్సీ మహిమ.. పేదల్ని ధనవంతులుగా మార్చేస్తోంది!
భారత కరెన్సీ మహిమ.. పేదల్ని ధనవంతులుగా మార్చేస్తోంది!