Auto News: ఈ బైక్ ప్రియులకు శుభవార్త.. ఈ బైక్‌పై రూ. 1 లక్ష తగ్గింపు.. దిమ్మదిరిగే ఆఫర్!
Auto News: మీరు ప్రీమియం స్పోర్ట్స్ బైక్ కొనాలని ప్లాన్ చేస్తుంటే ఇదే సరైన సమయం. ఎందుకంటే ఈ మోటార్ సైకిళ్లపై భారీ తగ్గింపును ప్రకటించింది కంపెనీ. కంపెనీ 4 ప్రసిద్ధ బైక్‌లపై ఈ తగ్గింపును అందిస్తోంది. మీరు కొత్త బైక్ కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తుంటే ఇది మంచి అవకాశమనే చెప్పాలి. లక్ష రూపాయల వరకు డిస్కౌంట్‌ను అందిస్తోంది..

భారతదేశంలో ప్రీమియం స్పోర్ట్స్ బైక్‌లను విక్రయించే కంపెనీ కవాసకి బుధవారం ఒక పెద్ద ప్రకటన చేసింది. కంపెనీ తన శ్రేణిలోని కొన్ని మోటార్‌సైకిళ్లపై రూ.1 లక్ష వరకు ప్రయోజనాలను ప్రకటించింది. అంటే డిస్కౌంట్‌లు. ఇప్పుడు కస్టమర్లు కవాసకి ZX-10R, వెర్సిస్ 1100, వెర్సిస్ 650, వెర్సిస్-X 300 లను భారీ డిస్కౌంట్‌లతో కొనుగోలు చేయవచ్చు. అయితే ఈ ఆఫర్ జూలై 31 వరకు మాత్రమే చెల్లుతుంది.
ఇది కూడా చదవండి: Bank Alert: ఈ బ్యాంకులో ఖాతా ఉందా? మీకో బిగ్ అలర్ట్.. ఆగస్టు 8 వరకు గడువు.. లేకుంటే అకౌంట్ క్లోజ్!
ఇది కూడా చదవండి: Mukesh Ambani: అంబానీ ఎంత అలసిపోయినా ఆ పని చేయందే నిద్రపోరట.. అంబానీ లైఫ్‌స్టైల్ గురించి మీకు తెలుసా?
- కవాసకి వెర్సిస్-X 300: ఈ కవాసకి బైక్ ఇటీవలే అప్‌డేట్ చేసింది. దానిపై రూ.15,000 వరకు విలువైన అడ్వెంచర్ యాక్సెసరీలు అందుబాటులో ఉన్నాయి. ఇది వెర్సిస్ సిరీస్‌లో అతి చిన్న బైక్. ఇది నింజా 300 నుండి అప్‌డేట్ పొందింది. దీనిలో 296cc ట్విన్ ఇంజిన్ ఉంది. ఈ ఇంజిన్ 11,500 rpm వద్ద 38.5 bhp పవర్, 10,000 rpm వద్ద 26.1 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 6-స్పీడ్ గేర్‌బాక్స్, స్లిప్పర్ క్లచ్‌తో వస్తుంది.
- కవాసకి వెర్సిస్ 650: కవాసకి వెర్సిస్ 650 పై రూ. 25,000 ప్రయోజనం లభిస్తోంది. ఈ తగ్గింపు తర్వాత దాని ధర రూ.7.77 లక్షల నుండి రూ. 7.52 లక్షలకు (ఎక్స్-షోరూమ్) తగ్గింది. ఇది అడ్వెంచర్ టూరింగ్ విభాగంలో ఒక ప్రసిద్ధ బైక్. ఇది 649cc లిక్విడ్-కూల్డ్, ప్యారలల్-ట్విన్ ఇంజిన్‌ను కలిగి ఉంది. ఇది 65.7 bhp పవర్‌ణి, 61 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 6-స్పీడ్ గేర్‌బాక్స్‌తో కూడా వస్తుంది. దీని లక్షణాలలో LED లైట్లు, TFT డిస్‌ప్లే, (స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీతో), USB ఛార్జింగ్ పోర్ట్, ట్రాక్షన్ కంట్రోల్ (ఆన్-ఆఫ్ ఆప్షన్) మరియు ABS ఉన్నాయి.
- కవాసకి నింజా ZX-10R: కవాసకి నింజా ZX-10R ప్రస్తుతం రూ.1,00,000 వరకు ప్రత్యేక ప్రయోజనాలను పొందుతోంది. దీని ఎక్స్-షోరూమ్ ధర రూ.18.50 లక్షలు. ఇది 998cc ఇన్‌లైన్-ఫోర్ సిలిండర్ లిక్విడ్-కూల్డ్ ఇంజిన్‌ను కలిగి ఉంది. ఇది 13,200 rpm వద్ద 200 bhp శక్తిని, 11,400 rpm వద్ద 114.9 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజిన్ 6-స్పీడ్ గేర్‌బాక్స్, క్విక్ షిఫ్టర్‌తో వస్తుంది. దీని లక్షణాలలో స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీతో TFT డిస్‌ప్లే, విభిన్న రైడింగ్ మోడ్‌లు, డ్యూయల్-ఛానల్ ABS, క్రూయిజ్ కంట్రోల్, లాంచ్ కంట్రోల్, ఇంజిన్ బ్రేక్ కంట్రోల్, ట్రాక్షన్ కంట్రోల్ ఉన్నాయి.
- కవాసకి వెర్సిస్ 1100: కవాసకి వెర్సిస్ 1100 కూడా రూ.1,00,000 వరకు ప్రయోజనాలను పొందుతోంది. ఈ బైక్ ఎక్స్-షోరూమ్ ధర రూ.12.90 లక్షలు. కొన్ని నెలల క్రితం దీని ఇంజిన్ 2025 మోడల్‌లో 1099ccతో వస్తుంది. దీనితో ఇది ఇప్పుడు 9,000 rpm వద్ద 133 bhp శక్తిని, 7,600 rpm వద్ద 112 Nm టార్క్‌ను ఇస్తుంది. దీనికి 6-స్పీడ్ గేర్‌బాక్స్, స్లిప్పర్, అసిస్ట్ క్లచ్ లభిస్తాయి. ఇది స్పోర్ట్స్ టూరింగ్ బైక్.
ఇది కూడా చదవండి: రూ.6.29 లక్షలకే 7 సీటర్స్ కారు.. 6 ఎయిర్ బ్యాగ్స్.. చౌకైన కారు
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి








