AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

భారీ నష్టాల్లో పేటీఎం… రోజుకు రూ.11 కోట్ల నష్టం!

పేటీఎం పేరెంట్ సంస్థ వన్97 కమ్యూనికేషన్ లిమిటెడ్ మార్చి 31తో ముగిసిన గత ఆర్థిక సంవత్సరానికి గతంలో కంటే మూడు రెట్ల నష్టాన్ని చవి చూసింది. పేటీఎం బ్రాండ్ నిర్మాణం కోసం, వ్యాపార విస్తరణ కోసం భారీ ఎత్తున ఖర్చు చేసింది. ముగిసిన గత ఆర్థిక సంవత్సరంలో ఏకీకృత ప్రాతిపదికన కంపెనీ నష్టం మార్చి 31వ తేదీ నాటికి రూ.4,217.20 కోట్లకు పెరిగింది. అంటే రోజుకు సగటున రూ.11 కోట్ల వరకు నష్టపోయింది. అంతకుముందు ఏడాది ఇది […]

భారీ నష్టాల్లో పేటీఎం... రోజుకు రూ.11 కోట్ల నష్టం!
TV9 Telugu Digital Desk
|

Updated on: Sep 10, 2019 | 5:23 PM

Share

పేటీఎం పేరెంట్ సంస్థ వన్97 కమ్యూనికేషన్ లిమిటెడ్ మార్చి 31తో ముగిసిన గత ఆర్థిక సంవత్సరానికి గతంలో కంటే మూడు రెట్ల నష్టాన్ని చవి చూసింది. పేటీఎం బ్రాండ్ నిర్మాణం కోసం, వ్యాపార విస్తరణ కోసం భారీ ఎత్తున ఖర్చు చేసింది. ముగిసిన గత ఆర్థిక సంవత్సరంలో ఏకీకృత ప్రాతిపదికన కంపెనీ నష్టం మార్చి 31వ తేదీ నాటికి రూ.4,217.20 కోట్లకు పెరిగింది. అంటే రోజుకు సగటున రూ.11 కోట్ల వరకు నష్టపోయింది. అంతకుముందు ఏడాది ఇది ఈ నష్టం రూ.1,604.34 కోట్లుగా ఉండేది. ఇప్పుడు మూడు రెట్లు పెరిగింది.

దీని ప్రకారం వన్97 మొదటి లాభాన్ని 2021 ఆర్థిక సంవత్సరంలో రూ.207.61 కోట్లుగా అంచనా వేస్తోంది. వన్ 97 కమ్యూనికేషన్స్ 2026 ఆర్థిక సంవత్సరానికి రూ.8,512.69 కోట్ల మేర లాభాన్ని నమోదు చేయవచ్చునని గత ఫిబ్రవరి నెలలో అంచనా వేశారు. 2019 ఆర్థిక సంవత్సరంలో కంపెనీ మొత్తం రెవెన్యూ రూ.8.2 శాతం పెరిగి రూ.3,579.67 కోట్లుగా ఉంది. అంతకుముందు ఏడాది రూ.3,309.61 కోట్లుగా ఉంది. అదే సమయంలో ఖర్చులు మాత్రం రెండింతలు పెరిగి రూ.7,730.14గా ఉన్నాయి. అంతకుముందు ఏడాది ఖర్చులు రూ.4,864.53గా ఉన్నాయి.

ఈ కంపెనీ తన వ్యాపారాన్ని విస్తృతం చేసుకునేందుకు, బ్రాండ్‌ను డెవలప్ చేసుకునేందుకు భారీ మూలధనం ఇన్వెస్ట్ చేసిందని, వివిధ మూలధన, కార్యాచరణ వ్యయాల్లో గణనీయమైన మొత్తాలను తాము కలిగి ఉన్నామని, దీని ఫలితంగా ఆర్థిక సంవత్సరంలో నష్టాలు సంభవించాయని కంపెనీ తన వార్షిక నివేదికలో పేర్కొంది. గత నెలలో పేటీఎం వ్యవస్థాపకులు విజయ్ శేఖర్ శర్మ మాట్లాడుతూ… పేటీఎం వ్యాల్యుయేషన్ 25 శాతం పెరిగి 15 బిలియన్ డాలర్లకు చేరుకుందని చెప్పారు.

Follow Us
బ్లడ్ షుగర్,అరికాళ్ల మంటలకు చెక్ పెట్టే అమృతం! మెంతుల కాంబినేషన్
బ్లడ్ షుగర్,అరికాళ్ల మంటలకు చెక్ పెట్టే అమృతం! మెంతుల కాంబినేషన్
చెడ్డీగ్యాంగ్‌ కలకలం.. అపార్ట్‌మెంట్, విల్లా కమిటీలకు కీలక సూచనలు
చెడ్డీగ్యాంగ్‌ కలకలం.. అపార్ట్‌మెంట్, విల్లా కమిటీలకు కీలక సూచనలు
రెస్టారెంట్ స్టైల్‌లో దమ్ బిర్యానీ.. ఇంట్లో ఎలా చేయాలంటే?
రెస్టారెంట్ స్టైల్‌లో దమ్ బిర్యానీ.. ఇంట్లో ఎలా చేయాలంటే?
మీరు GST చెల్లించకపోతే మీ వ్యాపారం వెంటనే మూసివేస్తారా?
మీరు GST చెల్లించకపోతే మీ వ్యాపారం వెంటనే మూసివేస్తారా?
గర్భసంచిని క్లీన్ చేసే దివ్యౌషధం..నెలసరి నొప్పులకు చెక్!
గర్భసంచిని క్లీన్ చేసే దివ్యౌషధం..నెలసరి నొప్పులకు చెక్!
ఓటటీలో వణుకు పుట్టిస్తోన్నరియల్ స్టోరీ.. తెలుగులోనూ చూడొచ్చు
ఓటటీలో వణుకు పుట్టిస్తోన్నరియల్ స్టోరీ.. తెలుగులోనూ చూడొచ్చు
తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఎలా ఉంటుంది..?
తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఎలా ఉంటుంది..?
4 సమస్యలకు ఒకే ఔషదం.. వెల్లుల్లిని ఇలా వాడితేనే వరం
4 సమస్యలకు ఒకే ఔషదం.. వెల్లుల్లిని ఇలా వాడితేనే వరం
మహిళలకు అదిరిపోయే శుభవార్త.. బంగారం ధరలు రికార్డు స్థాయిలో పతనం..
మహిళలకు అదిరిపోయే శుభవార్త.. బంగారం ధరలు రికార్డు స్థాయిలో పతనం..
రాశిఫలాలు: ఆదాయం, ఉద్యోగం, పెళ్లి విషయంలో వీరికి శుభవార్తలు
రాశిఫలాలు: ఆదాయం, ఉద్యోగం, పెళ్లి విషయంలో వీరికి శుభవార్తలు