AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తలనొప్పి వచ్చినప్పుడు టీ, కాఫీ తాగితే ఏమవుతుంది? అసలు వీటి మధ్య లింక్ ఏంటో తెలిస్తే..

తలనొప్పి రాగానే చాలామందికి ముందుగా గుర్తొచ్చేది.. పొగలు కక్కే ఒక కప్పు టీ లేదా కాఫీ. టీ తాగితే తలనొప్పి పరార్ అని కొందరు చెప్తుంటే.. అబ్బే.. తలనొప్పిగా ఉన్నప్పుడు టీ, కాఫీలు తాగితే ప్రాబ్లమ్ మరింత పెరుగుతుంది అని మరికొందరు హెచ్చరిస్తుంటారు. అసలు తలనొప్పికి, ఈ టీ, కాఫీలకి ఉన్న అసలు సంబంధం ఏంటి? అనేది తెలుసుకుందాం..

తలనొప్పి వచ్చినప్పుడు టీ, కాఫీ తాగితే ఏమవుతుంది? అసలు వీటి మధ్య లింక్ ఏంటో తెలిస్తే..
Does Tea Or Coffee Really Cure Your Headache
Krishna S
|

Updated on: Aug 08, 2026 | 7:04 AM

Share

రోజువారీ జీవితంలో తలనొప్పి అనేది చాలామంది ఎదుర్కొనే సాధారణ సమస్య. అయితే తలనొప్పి రాగానే వెంటనే ఒక కప్పు వేడి వేడి టీ లేదా కాఫీ తాగడం చాలామందికి అలవాటు. ఇలా తాగడం వల్ల తలనొప్పి వెంటనే తగ్గుతుందని కొందరు నమ్మితే, తలనొప్పిగా ఉన్నప్పుడు టీ, కాఫీలు తాగడం అసలు మంచిది కాదని మరికొందరు వాదిస్తారు. ఇంతకీ తలనొప్పికి, టీ, కాఫీలకు ఉన్న సంబంధమేంటి? వైద్య నిపుణులు ఏం చెప్తున్నారు? అనేది తెలుసుకోవడం ముఖ్యం.

కెఫీన్‌తో ఉపశమనం ఎంతవరకు నిజం?

టీ, కాఫీలలో ఉండే కెఫిన్ వల్ల కొంతమందికి తలనొప్పి, మైగ్రేన్ బాధల నుండి తాత్కాలిక ఉపశమనం లభిస్తుందని క్లీవ్‌ల్యాండ్ క్లినిక్ అధ్యయనాలు చెబుతున్నాయి. కెఫీన్ రక్తనాళాలను సరిచేసి నొప్పిని తగ్గించడంలో సహాయపడుతుంది. అందుకే మార్కెట్లో లభించే కొన్ని రకాల తలనొప్పి మందులలో కూడా కెఫీన్‌ను ఒక పదార్థంగా ఉపయోగిస్తారు. అయితే దీని ప్రభావం అందరి శరీర తత్వంపై ఒకేలా ఉండదు.

టీ, కాఫీల వల్ల తలనొప్పి పెరిగే అవకాశం ఉందా?

అవును, కొన్ని సందర్భాల్లో టీ, కాఫీలే తలనొప్పికి ప్రధాన కారణం కావచ్చు. రోజూ ఎక్కువ మోతాదులో టీ లేదా కాఫీలు తాగే అలవాటు ఉన్నవారు, అకస్మాత్తుగా వాటిని తాగడం మానేస్తే శరీరంలో కెఫీన్ లోపించి తీవ్రమైన తలనొప్పి వస్తుంది. కెఫిన్ మోతాదు శరీరంలో ఎక్కువైతే అది మైగ్రేన్‌ను ప్రేరేపించడమే కాకుండా నిద్రలేమి, డిహైడ్రేషన్ మరియు నాడీ వ్యవస్థపై ఒత్తిడికి దారితీస్తుంది.

తలనొప్పికి అసలు కారణాలు ఇవే కావచ్చు..

కేవలం టీ, కాఫీల అలవాటే కాకుండా, మన దైనందిన జీవితంలోని కొన్ని పొరపాట్లు కూడా తలనొప్పికి కారణమవుతాయి. ఎక్కువ సమయం స్మార్ట్‌ఫోన్‌లు, ల్యాప్‌టాప్‌లు లేదా టీవీ స్క్రీన్‌లను చూడటం. సరిపడా నిద్ర లేకపోవడం, మానసిక ఒత్తిడి. శరీరానికి తగినంత నీరు అందకపోవడం

నిపుణులు ఇస్తున్న సూచనలు

తలనొప్పి వచ్చిన ప్రతిసారీ టీ లేదా కాఫీలపై ఆధారపడటం సరైన పద్ధతి కాదని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. తలనొప్పిగా అనిపించినప్పుడు ఈ క్రింది జాగ్రత్తలు తీసుకోండి.

పుష్కలంగా నీరు తాగండి: తరచుగా శరీరంలో నీటి శాతం తగ్గడం వల్లే తలనొప్పి వస్తుంది. మంచి నీరు తాగడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.

విశ్రాంతి తీసుకోండి: ప్రశాంతంగా, వెలుతురు తక్కువగా ఉండే గదిలో కాసేపు విశ్రాంతి తీసుకోండి.

సొంత వైద్యం వద్దు: ప్రతీ చిన్న తలనొప్పికి విచక్షణారహితంగా పెయిన్ కిల్లర్స్ వాడటం ప్రమాదకరం.

వైద్యుడిని సంప్రదించండి: తలనొప్పి తరచుగా వస్తున్నా లేదా తీవ్రత ఎక్కువగా ఉన్నా సొంత వైద్యం చేసుకోకుండా వెంటనే డాక్టర్‌ను సంప్రదించి తగిన చికిత్స తీసుకోవడం మంచిది.

Follow Us
తలనొప్పి వచ్చినప్పుడు టీ, కాఫీ తాగితే ఏమవుతుంది?
తలనొప్పి వచ్చినప్పుడు టీ, కాఫీ తాగితే ఏమవుతుంది?
టూ వీలర్ కొనాలనుకుంటున్నారా? ఈ వివరాలు తెలియకపోతే నష్టపోతారు
టూ వీలర్ కొనాలనుకుంటున్నారా? ఈ వివరాలు తెలియకపోతే నష్టపోతారు
మక్కాలో మహా కూటమి.. సౌదీ, టర్కీ, పాక్ భారీ రక్షణ ఒప్పందం
మక్కాలో మహా కూటమి.. సౌదీ, టర్కీ, పాక్ భారీ రక్షణ ఒప్పందం
పర్ఫెక్ట్ మిల్క్‌టీ కోసం పాలు ఎప్పుడు కలపాలి? ముందా.. తర్వాతా?
పర్ఫెక్ట్ మిల్క్‌టీ కోసం పాలు ఎప్పుడు కలపాలి? ముందా.. తర్వాతా?
సోనెట్, సెల్టోస్‌లపై ఆకర్షణీయమైన తగ్గింపులు.. ఎన్ని లక్షలో తెలుసా
సోనెట్, సెల్టోస్‌లపై ఆకర్షణీయమైన తగ్గింపులు.. ఎన్ని లక్షలో తెలుసా
మహంకాళి అమ్మవారిని దర్శించుకున్న మెగా డాటర్
మహంకాళి అమ్మవారిని దర్శించుకున్న మెగా డాటర్
మెరుగైన బ్రేకింగ్‌తో మిష్లిన్ ప్రైమసీ 5 టైర్ ప్రత్యేకతలు ఇవే
మెరుగైన బ్రేకింగ్‌తో మిష్లిన్ ప్రైమసీ 5 టైర్ ప్రత్యేకతలు ఇవే
కార్లపై భారీ తగ్గింపులు ప్రకటించిన టాటా.. ఎన్ని లక్షలంటే
కార్లపై భారీ తగ్గింపులు ప్రకటించిన టాటా.. ఎన్ని లక్షలంటే
అందుకే బూతు సినిమాల్లో నటించా.. అసలు విషయం చెప్పిన ప్రముఖ నటి
అందుకే బూతు సినిమాల్లో నటించా.. అసలు విషయం చెప్పిన ప్రముఖ నటి
శ్రావణంలో 5 శుక్రవారాలు.. వరలక్ష్మీ వ్రతం ఎప్పుడు చేయాలి?
శ్రావణంలో 5 శుక్రవారాలు.. వరలక్ష్మీ వ్రతం ఎప్పుడు చేయాలి?