Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

RIP Arun Jaitley:ఒకే దేశం.. ఒకే పన్నుల వ్యవస్థ.. జైట్లీదే ఈ ఘనత

దేశవ్యాప్తంగా ఒకే పన్నుల వ్యవస్థను ప్రవేశపెట్టిన ఘనత అరుణ్ జైట్లీకే దక్కుతుంది. అది 2017 జులై నెల.. దేశంలో విప్లవాత్మకమైన పన్నుల విధానానికి ఆయన నాడు శ్రీకారం చుట్టారు. నిజానికి ఈ సువిశాలమైన దేశంలో ఇలాంటి వ్యవస్థను ప్రవేశపెట్టడమన్నది అత్యంత సాహసోపేతమైన చర్యే అవుతుంది. పైగా ఎంతో కష్టతరమైనది కూడా.. కానీ నాటి ఫైనాన్స్ మినిష్టర్ అయిన అరుణ్ జైట్లీ ప్రతిభావంతంగా దీన్ని అమలులోకి తేవడానికి కృషి చేశారు. జీఎస్టీ అమలు కాకముందు అనేక పన్నులు ఉండేవి. […]

RIP Arun Jaitley:ఒకే దేశం.. ఒకే పన్నుల వ్యవస్థ.. జైట్లీదే ఈ ఘనత
Follow us
Pardhasaradhi Peri

|

Updated on: Aug 24, 2019 | 3:04 PM

దేశవ్యాప్తంగా ఒకే పన్నుల వ్యవస్థను ప్రవేశపెట్టిన ఘనత అరుణ్ జైట్లీకే దక్కుతుంది. అది 2017 జులై నెల.. దేశంలో విప్లవాత్మకమైన పన్నుల విధానానికి ఆయన నాడు శ్రీకారం చుట్టారు. నిజానికి ఈ సువిశాలమైన దేశంలో ఇలాంటి వ్యవస్థను ప్రవేశపెట్టడమన్నది అత్యంత సాహసోపేతమైన చర్యే అవుతుంది. పైగా ఎంతో కష్టతరమైనది కూడా.. కానీ నాటి ఫైనాన్స్ మినిష్టర్ అయిన అరుణ్ జైట్లీ ప్రతిభావంతంగా దీన్ని అమలులోకి తేవడానికి కృషి చేశారు. జీఎస్టీ అమలు కాకముందు అనేక పన్నులు ఉండేవి. తయారీదారు నుంచి వినియోగదారునికి (ఫ్యాక్టరీ నుంచి కస్టమర్ వరకు) పలు రకాల పన్నుల వ్యవస్థ కొనసాగుతూ వచ్చింది. ఎక్సయిజు డ్యూటీ, వ్యాట్, సీఎస్టీ, స్థానిక పన్నులు కలిపి పన్నుల వ్యవస్థ అయోమయంగా ఉండేది. గతంలో యూపీఏ హయాంలోనే పన్నుల వ్యవస్థను ఏకీకృతం, సరళతరం చేయాలనుకున్నా అందుకు నిర్దిష్టమైన ప్రయత్నాలు జరగలేదు. అయితే 2014 లో మోదీ సారధ్యంలో ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి రావడంతో జీఎస్టీ అమలు బాధ్యతను జైట్లీపై పెట్టారు. పన్నులకు సంబంధించిన అతి ముఖ్యమైన బాధ్యతను ఆయనకు ప్రధాని మోదీ అప్పగించారు. వివిధ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను ఒకే తాటిపైకి తేవడంలో జైట్లీసఫలీకృతులయ్యారు. దీంతో వివిధ రకాల పన్నుల వ్యవస్థలు రద్దయి వాటి స్థానే జీఎస్టీ అమలులోకి వచ్చింది. ఈ విధానం అమలులోకి రాకముందు ప్రతి రాష్ట్ర సరిహద్దులో వాణిజ్య శాఖ చెక్ పోస్టులు ఉండేవి.అయితే.. జీఎస్టీలో భాగంగా ఈ-వే బిల్లులను ప్రవేశపెట్టారు. దీంతో లారీలు, ఇతర వాహన యజమానులు ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లకుండానే ఆన్ లైన్ లో పర్మిషన్లు పొందడం ద్వారా రవాణా మరింత వేగవంతమయ్యేది. ఉదాహరణకు.. ముంబై నుంచి ఏపీలోని తిరుపతికి గతంలో సరకుతో కూడిన లారీ వివిధ చెక్ పోస్టులను దాటుకుని వచ్చెందుకు సుమారు 5 రోజులు పట్టేది. కానీ.. జీఎస్టీ అమలులోకి వచ్చిన అనంతరం.. ప్రయాణ సమయానికి కేవలం 2 లేదా 3 రోజులు మాత్రమే పట్టడం విశేషం.

ఇంతేకాదు.. ఆధార్ ని ఇతర సర్వీసులకు అనుసంధానించడంలోను, సబ్సిడీలను హేతుబధ్ధం చేసి.. లబ్దిదారులకు అవి చేరేలా చూడడంలోను, జీఎస్టీపై ఏకాభిప్రాయ సాధనలోను ఆయన చేసిన కృషి ఎంతో ఉంది. పైగా డీమానిటైజేషన్ (పెద్ద నోట్ల రద్దు) లోని లొసుగులను సరిదిద్దడంతో బాటు 32. 43 బిలియన్ బ్యాంక్ రీ-కేపిటలైజేషన్ ప్లాన్ అమలులో కూడా ఆయన కృతకృత్యులయ్యారు. నార్త్ బ్లాక్ లోని అధికారులు, ఇతర సిబ్బంది ఆయనతో కలిసి పని చేయడం తమ గర్వకారణంగా చెప్పుకునేవారు. .