Gold Silver Price Today: బంగారం ధర మరింతగా పెరిగే అవకాశం.. దేశంలో స్వల్పంగా పెరిగిన పసిడి, వెండి ధరలు

Gold Price Today: గత ఏడాది కరోనా కాలంలో బంగారం ధరలు అకాశానికి ఎగబాకాయి. దాంతో గోల్డ్‌పై ఇన్వెస్ట్ చేసిన వారు లాభపడ్డారు. దాదాపు 20 శాతం రిటర్నులు పొందారు. అయితే..

Gold Silver Price Today: బంగారం ధర మరింతగా పెరిగే అవకాశం.. దేశంలో స్వల్పంగా పెరిగిన పసిడి, వెండి ధరలు
Gold And Silver
Subhash Goud

|

Apr 13, 2021 | 6:19 AM

Gold Price Today: గత ఏడాది కరోనా కాలంలో బంగారం ధరలు అకాశానికి ఎగబాకాయి. దాంతో గోల్డ్‌పై ఇన్వెస్ట్ చేసిన వారు లాభపడ్డారు. దాదాపు 20 శాతం రిటర్నులు పొందారు. అయితే ఇటీవల నుంచి బంగారం ధరలు కాస్త తగ్గుతూనే ఉన్నాయి. అప్పటి నుంచి ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను వెనక్కి తీసుకుంటూనే ఉన్నారు. దీంతో కొన్ని రోజులుగా పసిడి ధరలు తగ్గుతూనే ఉన్నాయి. దేశంలో కరోనా సెకండ్ వేవ్ మొదలయ్యాక… మళ్లీ బంగారం ధరలు పెరుగుతాయనే అంచనాతో ఇన్వెస్టర్లు ఉన్నారు. మళ్లీ పెట్టుబడి పెడుతున్నారు. అందుకే ఏప్రిల్ 1 నుంచి బంగారం ధరలు పెరుగుతూ ఉన్నాయి. అయితే బంగారం ధర డిసెంబర్‌కల్లా ఔన్స్‌కు 2000 డాలర్ల స్థాయికి చేరవచ్చని నిపుణులు భావిస్తున్నారు. మన కరెన్సీలో చెప్పాలంటే బంగారం ధర 10 గ్రాములకు మళ్లీ 55 వేల రూపాయల వరకు చేరే అవకాశం ఉందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. తాజాగా మంగళవారం బంగారం ధర స్వల్పంగా పెరిగింది. ఇక దేశీయంగా చూస్తే..  22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,750 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.45,750 ఉంది.

దేశంలోని ప్రధాన నగరాల్లో పసిడి ధరలు ఇలా ఉన్నాయి

దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.45,700 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,860 ఉంది.

దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,750 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.45,750 ఉంది.

చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.43,800 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,780 కి చేరుకుంది.

కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,850 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,550 ఉంది.

కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.43,550 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,510 ఉంది.

పూణెలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,750 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.45,750 ఉంది.

తెలుగు రాష్ట్రాల్లో…

హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.43,550 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,510 ఉంది.

విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.43,550 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,510 ఉంది.

విశాఖలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.43,550 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,510 ఉంది.

వెండి ధరలు…

బంగారం బాటలోనే వెండి కూడా పయనిస్తోంది. కిలో వెండి ధరపై స్వల్పంగా పెరిగింది.

దేశ రాజధాని ఢిల్లీలో కిలో వెండి ధర రూ.67,200 ఉండగా, దేశ ఆర్థిక రాజధాని ముంబైలో రూ.67,200 ఉంది. ఇక చెన్నైలో కిలో వెండి ధర రూ.67,200 ఉండగా, కోల్‌కతాలో రూ.67,200 ఉంది. బెంగళూరులో కిలో వెండి ధర రూ.67,200 ఉండగా, కేరళలో కిలో వెండి ధర రూ.67,200 ఉంది. పూణెలో కిలో వెండి రూ.67,200 ఉండగా, హైదరాబాద్‌లో రూ. 71,900లకు చేరుకుంది. ఇక ఏపీలోని విజయవాడలో కిలో వెండి ధర రూ.71,900 ఉండగా, విశాఖలో రూ.71,900వద్ద కొనసాగుతోంది.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu