AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Apple iPhone: యాపిల్ యూజర్లకు బిగ్ అలెర్ట్.. అక్కడ ఐఫోన్లు బ్యాన్.? బిగ్ అప్‌డేట్ ఇదిగో

చైనాకు చెందిన డిస్‌ప్లే తయారీ సంస్థ BOE టెక్నాలజీపై అమెరికాలో నిషేధం విధించబోతోందన్న వార్తలు ఇటీవల వైరల్ అయ్యాయి. డిస్‌ప్లే దిగ్గజం శాంసంగ్ చేసిన బలమైన ఆరోపణల నేపథ్యంలో అమెరికా ఇంటర్నేషనల్ ట్రేడ్ కమిషన్ (ITC) ఇచ్చిన ప్రాథమిక తీర్పుతో ఈ ప్రచారానికి మరింత ఊపొచ్చింది. దీంతో ఈ వివాదంపై చివరకు యాపిల్ స్వయంగా స్పందించాల్సి వచ్చింది.

Apple iPhone: యాపిల్ యూజర్లకు బిగ్ అలెర్ట్.. అక్కడ ఐఫోన్లు బ్యాన్.? బిగ్ అప్‌డేట్ ఇదిగో
Prabhakar M
| Edited By: |

Updated on: Jul 25, 2025 | 1:36 PM

Share

BOE కంపెనీ 2021 నుంచి యాపిల్‌కు OLED ప్యానెల్స్‌ను సరఫరా చేస్తోంది. అయితే, ఈ డిస్‌ప్లేలు శాంసంగ్‌కు చెందిన స్వంత టెక్నాలజీని అనధికారంగా ఉపయోగించారని ఆరోపిస్తూ శాంసంగ్, ITCకి ఫిర్యాదు చేసింది. ITC ప్రాథమికంగా శాంసంగ్ వాదనకు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. శాంసంగ్‌కు చెందిన గోప్యమైన టెక్నాలజీతో తయారు చేసిన ప్యానెల్స్‌ను BOE తన అనుబంధ సంస్థల ద్వారా అమెరికాలో విక్రయించేందుకు యత్నించిందని ITC అభిప్రాయపడింది. ఈ నేపథ్యంలో BOE తయారుచేసిన OLED స్క్రీన్లను అమెరికాకు ఎగుమతి చేయకూడదని, ఇప్పటికే స్టాక్‌గా ఉన్న ప్యానెల్స్‌ను కూడా విక్రయించరాదని ITC స్పష్టం చేసింది. తుది తీర్పు మాత్రం ఇంకా వెలువడాల్సి ఉంది.

యాపిల్ క్లారిటీ: మా ఉత్పత్తులకు సంబంధం లేదు

BOE వివాదం మధ్య యాపిల్‌కు కూడా పలు ఆరోపణలు రావడంతో కంపెనీ అధికారికంగా స్పందించింది. “ఈ కేసులో యాపిల్ పార్టీకాదు. మా ఉత్పత్తులపై ఈ తీర్పు ఎలాంటి ప్రభావాన్ని చూపదు” అని యాపిల్ స్పష్టం చేసింది. ఈ వివాదానికి సంబంధించి ప్రస్తుతం ITC ఇచ్చింది ప్రాథమిక తీర్పు మాత్రమే. తుది నిర్ణయం ఈ ఏడాది చివర్లో వచ్చే అవకాశం ఉంది. ఆ తర్వాత 60 రోజులలోపుగా అమెరికా అధ్యక్షుడు ఆ తీర్పును ఆమోదించవచ్చు లేదా తిరస్కరించవచ్చు.

iPhone 15, 16, 17పై ప్రభావం ఉంటుందా?

BOEతో పాటు యాపిల్‌కు డిస్‌ప్లేలు సరఫరా చేసే ఇతర కంపెనీలు శాంసంగ్, ఎల్జీ, టోషిబా ఉన్నాయి. ప్రస్తుతం మార్కెట్‌లో ఉన్న ఐఫోన్ 15, 16 మోడళ్లలో ఈ మూడు కంపెనీల డిస్‌ప్లేలు వినియోగించబడ్డాయి. రాబోయే iPhone 17లో కూడా BOE ప్యానెల్స్ ఉపయోగించే అవకాశం ఉన్నప్పటికీ, నిషేధానికి గురైన టెక్నాలజీ ఆధారంగా తయారైన ప్యానెల్స్‌ను యాపిల్ గ్లోబల్ మార్కెట్‌కు సరఫరా చేయదని తెలుస్తోంది. యాపిల్, BOE నుంచి ఎల్టీపీఓ OLED ప్యానెల్స్‌ను ముఖ్యంగా చైనా వెర్షన్ ఐఫోన్లకు మాత్రమే వినియోగించాలన్న వ్యూహంతో ముందుకెళ్తోంది. ఇవి ప్రపంచవ్యాప్తంగా అమ్మే ఐఫోన్లలో వినియోగించే స్క్రీన్లతో పోలిస్తే నాణ్యతలో తక్కువగా ఉండవచ్చన్న అభిప్రాయమూ వినిపిస్తోంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి