AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

TVS Fiero -125: టీవీఎస్ నుంచి మరో సూపర్ బైక్.. తక్కువ ధరలోనే స్టైలిష్ రైడింగ్ ఎక్స్‌పీరియన్స్..

టీవీఎస్ ​​ఫియరో 125 పేరుతో రిలీజ్ చేసిన ఈ బైక్ కచ్చితంగా వినియోగదారుల మనస్సును గెలుచుకుంటుందని కంపెనీ వర్గాలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. ఈ సూపర్ బైక్‌ను జూన్ 2023లో రిలీజ్ చేసే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

TVS Fiero -125: టీవీఎస్ నుంచి మరో సూపర్ బైక్.. తక్కువ ధరలోనే స్టైలిష్ రైడింగ్ ఎక్స్‌పీరియన్స్..
Fiero
Nikhil
|

Updated on: May 24, 2023 | 6:00 PM

Share

సౌకర్యవంతమైన, స్టైలిష్ రైడింగ్‌ను అనుభవించాలని కోరుకునే వారి కోసం ప్రముఖ బైక్ తయారీ సంస్థ అయిన టీవీఎస్ మరో సూపర్ బైక్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. టీవీఎస్ ​​ఫియరో 125 పేరుతో రిలీజ్ చేసిన ఈ బైక్ కచ్చితంగా వినియోగదారుల మనస్సును గెలుచుకుంటుందని కంపెనీ వర్గాలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. ఈ సూపర్ బైక్‌ను జూన్ 2023లో రిలీజ్ చేసే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ముఖ్యంగా ఈ బైక్ ఇందనాన్ని ఆదా చేసే విషయంలో అద్భుతమైన పనితీరు కనబరుస్తుందని పేర్కొంటున్నారు. ముఖ్యంగా మన ప్రయాణ అనుభూతిని పెంచేలా రిలీజ్ చేస్తున్న ఈ బైక్‌లో ఎన్నో అధునాతన ఫీచర్లు ఉన్నాయి. అవేంటో ఓ సారి చూద్దాం.

ఈ బైక్ స్పోర్టీ బైక్‌ను లుక్‌లో ఉంటుంది. అలాగే ప్రత్యేకమైన డిజైన్‌ ఈ బైక్ ప్రత్యేకత. అలాగే ట్యూబ్‌లెస్ టైర్‌లతో వచ్చే ఈ బైక్‌ రైడింగ్ అనుభూతిని మెరుగుపరుస్తుంది. అలాగే రోజువారీ అవసరాలకు వాడుకునే విధంగా ఈ బైక్ చాలాబాగుంటుందని నిపుణులు చెబుతున్నారు. ఇటీవల ఈ బైక్‌కు సంబంధించిన చిత్రాలు ఆకట్టుకోవడంతో చాలా మంది బైక్ ప్రేమికులు ఈ బైక్ గురించి ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా ఈ బైక్ గంటకు 99 కిలో మీటర్ల వేగంతో వెళ్తుందని పలు నివేదికలు వెల్లడిస్తున్నాయి. అలాగే ఈ బైక్ 125 సీసీ ఇంజిన్‌తో వస్తుందని అందరూ అంచనా వేస్తున్నారు. అలాగే ఈ బైక్ ఫీచర్లు ఇంకా వెల్లడి కాలేదు. అలాగే ఈ బైక్ ధర రూ.75,000 వరకూ ఉండవచ్చని అంచనా.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
దసరా పండుగ ఆఫర్లు తెలిస్తే ఎవ్వరికైనా పిచ్చెక్కాల్సిందే
దసరా పండుగ ఆఫర్లు తెలిస్తే ఎవ్వరికైనా పిచ్చెక్కాల్సిందే
జుట్టు రాలిపోతుందా? ఇంట్లోనే అవిసె గింజలతో ఈ హెయిర్ మాస్క్ తయారీ
జుట్టు రాలిపోతుందా? ఇంట్లోనే అవిసె గింజలతో ఈ హెయిర్ మాస్క్ తయారీ
జేబు ఖాళీ కాదు.. బరువు పెరగరు.. సూపర్‌మార్కెట్‌కు వెళ్లేముందు..
జేబు ఖాళీ కాదు.. బరువు పెరగరు.. సూపర్‌మార్కెట్‌కు వెళ్లేముందు..
సోషల్ మీడియా నాకు నచ్చలేదు..
సోషల్ మీడియా నాకు నచ్చలేదు..
కలలో దారి తప్పిపోవడం అశుభమా? జీవితంలోని అయోమయానికి సంకేతమా?
కలలో దారి తప్పిపోవడం అశుభమా? జీవితంలోని అయోమయానికి సంకేతమా?
నోరు జారిన కంటెస్టెంట్.. డైరెక్ట్ ఎలిమినేషన్ చేసిన బిగ్ బాస్..
నోరు జారిన కంటెస్టెంట్.. డైరెక్ట్ ఎలిమినేషన్ చేసిన బిగ్ బాస్..
షాకింగ్ క్లైమాక్స్‌తో బుర్రపాడు చేసిన సినిమా.. ఇప్పుడు OTTలోకి..
షాకింగ్ క్లైమాక్స్‌తో బుర్రపాడు చేసిన సినిమా.. ఇప్పుడు OTTలోకి..
ఆశ్వయుజ మాసంలో వీరికి ధన యోగాలు..లిస్ట్‌లో మీ రాశి ఉందా?
ఆశ్వయుజ మాసంలో వీరికి ధన యోగాలు..లిస్ట్‌లో మీ రాశి ఉందా?
 డెస్క్ జాబ్‌తో మెడ నొప్పా? ఈ 5 యోగా ఆసనాలతో వెంటనే రిలీఫ్!
 డెస్క్ జాబ్‌తో మెడ నొప్పా? ఈ 5 యోగా ఆసనాలతో వెంటనే రిలీఫ్!
దూసుకొస్తున్న అల్పపీడనం.. గంటకు 50 కి.మీ వేగంతో గాలులు, వర్షాలు..
దూసుకొస్తున్న అల్పపీడనం.. గంటకు 50 కి.మీ వేగంతో గాలులు, వర్షాలు..