Ancestral Property: పూర్వీకుల ఆస్తి వారసులు అమ్మేసుకోవచ్చా? దానికి చట్టం ఏమి చెబుతుంది?

కుటుంబరావు చాలా ఖరీదు చేసే తన ఇంటిని ఎవరికి చెందాలి అనే విషయంలో విల్లు రాయలేదు. దీంతో అతని పిల్లల మధ్య దానిని ఎలా పంచుకోవాలి అనే విషయంలో గందరగోళం పెరిగిపోయింది. పెద్ద కొడుకు ఇల్లు అమ్మేసి డబ్బు తీసుకుందాం అంటాడు. కూతురు అలా ఏమీ వద్దు.. అమ్మ ఉన్నంత వరకూ ఇల్లు ఉండాల్సిందే అంటుంది. చిన్న కొడుకు అలా కాదు ఇల్లు ముగ్గురం పంచేసుకుని విడగొట్టి..

Ancestral Property: పూర్వీకుల ఆస్తి వారసులు అమ్మేసుకోవచ్చా? దానికి చట్టం ఏమి చెబుతుంది?
Ancestral Property
Follow us
Subhash Goud

|

Updated on: Oct 13, 2023 | 9:50 PM

నిన్నా.. మొన్నటి వరకూ ఆ ఇల్లు.. ఆ ఇంటిలో ఉండే కుటుంబరావు ఫ్యామిలీని చూసి ఆ వీధిలో ఉన్నవారంతా సంబర పడిపోయేవారు. తన ముగ్గురు పిల్లలతో ఎప్పుడో 40 ఏళ్ల క్రితం ఆ ఇల్లు కొనుక్కుని అక్కడే స్థిరపడ్డాడు కుటుంబరావు. అప్పటి నుంచి ఇరుగూ.. పొరుగూ వారికి ఆదర్శంగా తన పిల్లలను ప్రయోజకులను చేసి మంచి చదువులు చెప్పించి ఉద్యోగాలు చేసే స్థాయిలో స్థిరపరిచి.. వారికి పెళ్ళిళ్ళు చేశాడు. అతని కుటుంబం విషయంలో ఆ ప్రాంతంలో ఉండేవారిది ఒకటే మాట.. అంత మంచి కుటుంబం మనకీ ఉంటే బాగుండును అని. కానీ.. అదే ప్రజలు ఇప్పుడు ఆ కుటుంబ పరిస్థితి చూసి బాధపడుతున్నారు. ఇటీవలే కుటుంబరావు కాలం చేశాడు. ఇరుగూ పొరగూ బాధపడుతున్నది అందుకు కాదు.. ఆయన చనిపోయాకా ఆయన పిల్లల మధ్యలో చోటు చేసుకున్న కలహాలను చూసి.

అవును కుటుంబరావు చాలా ఖరీదు చేసే తన ఇంటిని ఎవరికి చెందాలి అనే విషయంలో విల్లు రాయలేదు. దీంతో అతని పిల్లల మధ్య దానిని ఎలా పంచుకోవాలి అనే విషయంలో గందరగోళం పెరిగిపోయింది. పెద్ద కొడుకు ఇల్లు అమ్మేసి డబ్బు తీసుకుందాం అంటాడు. కూతురు అలా ఏమీ వద్దు.. అమ్మ ఉన్నంత వరకూ ఇల్లు ఉండాల్సిందే అంటుంది. చిన్న కొడుకు అలా కాదు ఇల్లు ముగ్గురం పంచేసుకుని విడగొట్టి ఎవరికిష్టమైనట్టు వారు చేసుకుందాం అంటాడు. పెద్దలు వచ్చినా మాట్లాడినా ఈ సమస్య తెలలేదు. చివరకు పెద్దలంతా కలిసి చిన్న కొడుకు చెప్పిన విధంగానే చేయమని ముగ్గురినీ ఒప్పించి ఇంటిని భాగాలుగా పంచేశారు. అయితే, విదేశాల్లో ఉంటున్న పెద్ద కొడుక్కు అక్కడ ఇల్లు ఉండడం వలన ప్రయోజనం లేదు అనిపించింది. అప్పుడు అతను ఏమి చేస్తే బావుంటుంది?

దీనికోసం మూడు పద్ధతులు ఉన్నాయని చెబుతారు నిపుణులు.. మొదటి పద్ధతి ప్రకారం అతని వాటాను మిగిలిన ఇద్దరికీ అమ్మేయవచ్చు. నిజానికి ఆస్తిని వారసులందరికీ చట్టబద్ధంగా విభజించినట్లయితే, వారు వారి వాటాను సాధారణ పద్ధతిలో అమ్ముకోవచ్చు. ఆస్తి అంటే ఇల్లు ఇక్కడ వారసుల మధ్య విభజన జరగలేదు కనుక, అతను తన తోబుట్టువులకు సమిష్టిగా ఇవ్వవచ్చు. లేదా మీకు వస్తుందని చెబుతున్న భాగాన్ని మీరు వారిలో ఆసక్తి ఉన్న వారికి ఎవరికైనా అమ్మేసుకోవచ్చు.

ఇవి కూడా చదవండి

అది కూడరాకపోతే.. అంటే మిలిన వారిలో ఎవరూ కూడా అతని వాటాను కొనడానికి సిద్ధపడకపోతే రెండో పద్ధతి ఉంది. ఆస్తిలో తన వాటాను మూడవ పక్షానికి విక్రయించే చట్టబద్ధమైన హక్కు కుటుంబరావు పెద్ద కొడుక్కు ఉంటుంది. అయితే, ఆ ఇంట్లో మీ సోదరుడు లేదా సోదరి కుటుంబ సభ్యుడు అయితే, మీరు అందరూ కలిసి నివసిస్తున్నట్లయితే ఆస్తి విభజన జరిగే వరకూ మీరు మీ వాటాను స్వాధీనం చేయడం చేయలేరు.

ఇక మూడో విధానం అతను తన వాటాను అమ్మడానికి మిగిలిన ఇద్దరికీ లిఖిత పూర్వకంగా తెలియచేసి అనుమతి తీసుకోవాలి. ఎందుకంటే పూర్వీకుల ఆస్తి కొనడం కుటుంబ సభ్యులా మొదటి హక్కు అని ఏడ్వకేట్ దేవేష్ బాజ్ పేయీ చెబుతున్నారు. ” నాకు తప్పని సరి పరిస్థితి వచ్చి నా వాటాను అమ్ముకోవాలని అనుకుంటున్నాను.. మీలో ఎవరైనా దానిని మార్కెట్ ధరకు కొనుక్కునే ఆసక్తి ఉంటే తెలియపర్చ గలరు. ఒకవేళ మీలో ఎవరికీ ఆసక్తి లేకపోతే నేను నాకు సంబంధించిన వాటాను మూడో పార్టీకి అమ్ముకుంటాను” అంటూ స్పష్టంగా పేర్కొంటూ నోటీసు ఇవ్వాల్సి ఉంటుంది. ఇదీ పూర్వీకుల ఆస్తి వాటాలు వేయకపోతే వారాసుల మధ్య పంపకాలకు చట్టరీత్యా ఉన్న మార్గాలు. కుటుంబరావు పెద్ద కొడుకు ముందున్న మార్గాలు ఇవే.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి