Bank Account: మీ బ్యాంక్ అకౌంట్ ఇన్‌యాక్టివ్‌గా ఉందా..? రీ యాక్టివేట్ చేసుకోండి ఇలా!
సేవింగ్స్ లేదా కరెంట్ అకౌంట్ 24 నెలలకు పైగా అంటే 2 సంవత్సరాలకు పైగా ఆ అకౌంట్ ద్వారా ఎలాంటి లావాదేవీలు జరగనప్పుడు పనిచేయని లేదా నిద్రాణమైన అకౌంట్ గా పరిగణిస్తారు. మీరు 2 సంవత్సరాలకు పైగా దాని నుంచి డబ్బును డిపాజిట్ చేయకపోయినా లేదా ఉపసంహరించుకోకపోయినా లేదా IMPS, NEFT, RTGS లేదా UPI ద్వారా ఎలాంటి బదిలీలు చేయకుంటే, ఖాతా పాసివ్ గా పరిగణించి..
రోజుల్లో చాలా మంది అనేక బ్యాంకు అకౌంట్స్ మెయింటైన్ చేస్తున్నారు. కొందరు వివిధ ప్రయోజనాల కోసం ఒకటి కంటే ఎక్కువ అకౌంట్ తెరుస్తారు. కొన్నిసార్లు, ఉద్యోగం మారుతున్నప్పుడు, కొత్త బ్యాంకు అకౌంట్ ఓపెన్ అవుతుంది. అటువంటి సందర్భాలలో మీరు మీ మునుపటి సంస్థతో తెరిచిన అకౌంట్ గురించి మరచిపోయే అవకాశం ఉంది. మీకు సేవింగ్స్ లేదా కరెంట్ బ్యాంక్ అకౌంట్ ఉంటే.. మీరు 12 నెలల కంటే ఎక్కువ లావాదేవీలు చేయకుంటే ఆ అకౌంట్‌ను ఇనేక్టివ్ గా పరిగణిస్తారు.
సేవింగ్స్ లేదా కరెంట్ అకౌంట్ 24 నెలలకు పైగా అంటే 2 సంవత్సరాలకు పైగా ఆ అకౌంట్ ద్వారా ఎలాంటి లావాదేవీలు జరగనప్పుడు పనిచేయని లేదా నిద్రాణమైన అకౌంట్ గా పరిగణిస్తారు. మీరు 2 సంవత్సరాలకు పైగా దాని నుంచి డబ్బును డిపాజిట్ చేయకపోయినా లేదా ఉపసంహరించుకోకపోయినా లేదా IMPS, NEFT, RTGS లేదా UPI ద్వారా ఎలాంటి బదిలీలు చేయకుంటే, ఖాతా పాసివ్ గా పరిగణించి.. తాత్కాలికంగా మూసివేస్తారు.
ఈ సందర్భంలో, బ్యాంక్ వడ్డీ క్రెడిట్ – ఛార్జీల మినహాయింపులను లావాదేవీలుగా పరిగణించదు. అయితే, ఫిక్స్‌డ్ డిపాజిట్ (FD) నుంచి అకౌంట్ కు వడ్డీ జమ అయితే, అది కస్టమర్ లావాదేవీగా పరిగణనలోకి వస్తుంది. ఇది కస్టమర్ చేసిన ట్రాన్సాక్షన్ గానే లెక్కిస్తారు. బ్యాంకులు తమ ఖాతాదారులకు ఖాతా ఇన్‌యాక్టివ్‌గా మారడం గురించి తెలియజేస్తాయి. బ్యాంక్ ఆఫ్ బడోడా వెబ్‌సైట్‌లో అందించిన సమాచారం ప్రకారం, బ్యాంక్ ప్రతి సంవత్సరం అన్ని సేవింగ్స్ – కరెంట్ అకౌంట్ ను సమీక్షిస్తుంది. ఒక అకౌంట్ లో ఒక సంవత్సరం కంటే ఎక్కువ కాలం పాటు ఎటువంటి లావాదేవీలు జరగనట్లయితే, బ్యాంకు లెటర్స్, ఇమెయిల్‌లు, మెసేజెస్, ఫోన్ కాల్‌లు లేదా ఇతర మార్గాల ద్వారా కస్టమర్‌కు తెలియజేయడం అవసరం. అకౌంట్ ను ఉపయోగించకపోవడానికి గల కారణాలను బ్యాంకు ఆరా తీస్తుంది. ఖాతాని యాక్టివ్‌గా ఉంచడానికి డబ్బును డిపాజిట్ చేయమని లేదా ఉపసంహరించుకోవాలని ఇది కస్టమర్‌కు సలహా ఇస్తుంది. మీరు సలహాను అనుసరించి లావాదేవీని నిర్వహిస్తే, మీ ఖాతా యాక్టివ్‌గా మారుతుంది. బ్యాంక్ మీ నుంచి రెస్పాన్స్ అందుకోకపోతే, మీ అకౌంట్ ఇనేక్టివ్ గానే ఉన్నట్లయితే, రెండు సంవత్సరాలు గడిచినట్లయితే, బ్యాంక్ దానిని పాసివ్ గా పరిగణిస్తుంది.
మీ అకౌంట్ పాసివ్ గా ఉన్నప్పటికీ మీరు డిపాజిట్ చేసిన మొత్తంపై వడ్డీ క్రెడిట్‌ను పొందడం కొనసాగిస్తారు. అకౌంట్ పాసివ్ అయినప్పుడు, అకౌంట్ హోల్డర్ ఎలాంటి లావాదేవీలను నిర్వహించలేరు. ఈ లావాదేవీలలో డిపాజిట్లు – విత్ డ్రా లు ఉంటాయి. అయితే, దీని అర్థం అకౌంట్ లోని డబ్బు పోయినట్లు కాదు.
బ్యాంక్ అకౌంట్‌ను ఇన్ యాక్టివ్ నుంచి యాక్టివ్ చేయడానికి అకౌంట్ హోల్డర్ బ్యాంక్ బ్రాంచ్‌ని సంప్రదించాలి. పాస్‌బుక్ – చెక్‌బుక్‌తో తప్పనిసరిగా బ్యాంక్ అధికారికి అప్లికేషన్ ఇవ్వాలి. ఇంత కాలంగా ఖాతా ఎందుకు ఉపయోగంలో లేదో మీరు వివరించాలి. అంతేకాకుండా.. చిరునామా రుజువు, ID ప్రూఫ్, ఫోటోలతో సహా కేవైసీ అప్‌డేట్ అవసరం అవుతుంది. అవసరమైన అన్ని డాక్యుమెంట్స్ సబ్మిట్ చేసిన తరువాత 2-3 వర్కింగ్ డేస్ లో అటువంటి అకౌంట్ యాక్టివేట్ అవుతుంది.
మీరు కూడా బ్యాంక్ అకౌంట్ కలిగి ఉంటే అది చాలా కాలం పాటు ఇనేక్టివ్ గా ఉంది ఉంటే కనుక మీరు దాన్ని మళ్లీ యాక్టివేట్ చేసుకోవచ్చు. అకౌంట్ యాక్టివేట్ అయిన తర్వాత, మీరు డబ్బును విత్‌డ్రా చేసుకోవచ్చు లేదా అకౌంట్ ను యాక్టివ్‌గా ఉంచుకోవచ్చు. ఇనేక్టివ్ అకౌంట్ ని యాక్టివేట్ చేయడానికి మీరు ఎలాంటి ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం లేదు. మీ అకౌంట్ పంజాబ్ నేషనల్ బ్యాంక్‌లో ఉన్నట్లయితే, పబ్లిక్ లెండర్ అక్టోబరు 2వ తేదీ నుంచి అక్టోబర్ 31 వరకు ఇనేక్టివ్ అకౌంట్ ను యాక్టివేట్ చేయడానికి ప్రత్యేక ప్రచారాన్ని నిర్వహిస్తోంది. అకౌంట్ ఖాతా యాక్టివ్‌గా అయినా తర్వాత, ప్రతి సంవత్సరం కనీసం ఒక ట్రాన్సాక్షన్ అయినా జరపాలని గుర్తుంచుకోండి.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి