EPF Withdrawal: పీఎఫ్ నిధులపై పన్ను పడుతుందా? విత్ డ్రా చేసేటప్పుడు పన్ను పడకుండా ఉండాలంటే ఏం చేయాలి?
ఈపీఎఫ్ కు ట్యాక్స్ మినహాయింపు ఉంటుంది. అయితే ఈ ఈపీఎఫ్ లో కూడా వచ్చే నగదుపై కొన్ని సందర్భాల్లో ట్యాక్స్ పడుతుంది. ముఖ్యంగా పీఎఫ్ విత్ డ్రా చేసే సమయంలో ఇన్ కమ్ ట్యాక్స్ లేదా టీడీఎస్ పడుతుంది. అది ఏ సందర్భంలో పడుతుంది? దానిని నియమ, నిబంధనలు ఏమిటి? తెలుసుకుందాం రండి..
ప్రతి ఉద్యోగికి ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్ ఉంటుంది. ఇది మన దేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన రిటైర్ మెంట్ ఫండ్ ఆప్షన్. ప్రతి ఉద్యోగి బేసిక్ శాలరీలో 12 శాతంతో పాటు దానికి సమానంగా కంపెనీ యాజమాన్యం నుంచి ఉద్యోగి ఈపీఎఫ్ ఖాతాలో జమవుతుంది. ప్రతి నెల జీతం నుంచి ఇది వారి ఖాతాలోకి చేరిపోతుంది. ఈ మొత్తాన్ని ఉద్యోగి రిటైర్ అయిన తర్వాత తీసుకొనే వీలుంటుంది. దానిపై కొంత వడ్డీ కూడా ప్రభుత్వం అందిస్తుంది. అయితే మీరు ఇతర పెట్టుబడి పథకాలలో లేదా, వేరే ఆదాయ మార్గాల్లో పెట్టుబడి పెట్టినప్పుడు వచ్చే రాబడిపై ట్యాక్స్ పడుతుంది. అయితే ఈపీఎఫ్ కు ట్యాక్స్ మినహాయింపు ఉంటుంది. అయితే ఈ ఈపీఎఫ్ లో కూడా వచ్చే నగదుపై కొన్ని సందర్భాల్లో ట్యాక్స్ పడుతుంది. ముఖ్యంగా పీఎఫ్ విత్ డ్రా చేసే సమయంలో ఇన్ కమ్ ట్యాక్స్ లేదా టీడీఎస్ పడుతుంది. అది ఏ సందర్భంలో పడుతుంది? దానిని నియమ, నిబంధనలు ఏమిటి? పీఎఫ్ విత్ డ్రాకి ట్యాక్స్ రూల్స్ ఏంటి? తెలుసుకుందాం రండి..
ఈపీఎఫ్ నిబంధనలు ఇవి..
ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్ నిబంధనలను ఓ సారి పరిశీలిస్తే.. ఉద్యోగులు తమ పీఎఫ్ నిధులను ఉపసంహరించుకునే ముందు కొన్ని నిబంధనలు పాటించాలి. ముఖ్యంగా అకాల ఉపసంహరణ విషయంలో తప్పనిసరిగా కొన్ని షరతులు వర్తిస్తాయి. అవేంటంటే..
- వాస్తవానికి ఈపీఎఫ్ఓ లో ఖాతాదారుడు నిర్ణయించబడిన పదవీ విరమణ వయస్సు వచ్చిన తర్వాత మాత్రమే మొత్తం పీఎఫ్ మొత్తాన్ని విత్‌డ్రా చేయగులుగుతారు.
- ఉద్యోగి పదవీ విరమణకు ఒక సంవత్సరం ముందు కూడా 90 శాతం పీఎఫ్ నిధులను విత్‌డ్రా చేసుకోవచ్చు.
- ఒకవేళ ఖాతాదారుడికి ఉద్యోగం మధ్యలో మానేయాల్సి వచ్చి ఖాళీగా ఉంటే.. ఒక నెల తర్వాత 75 శాతం పీఎఫ్ నిధులను విత్ డ్రా చేసుకోవచ్చు. ఒకేవళ రెండు నెలల కాలం పాటు ఏ ఉద్యోగం చేయకుండా ఉంటే మొత్తం పీఎఫ్ నగదును విత్‌డ్రా చేసుకోవచ్చు.
- ఈ నియమాలు ఉద్యోగులకు ఆర్థిక అత్యవసర పరిస్థితులు, ప్రధాన జీవిత సంఘటనలతో సహా వివిధ ప్రయోజనాల కోసం వారి పీఎఫ్ నిధులను యాక్సెస్ చేయడానికి ఎంపికలను అందిస్తాయి. ఉపసంహరణకు సంబంధించిన నిర్దిష్ట షరతులు, డాక్యుమెంటేషన్ అవసరాలు మారుతుంటాయి. కాబట్టి వ్యక్తులు ఉపసంహరణ ప్రక్రియపై వివరణాత్మక మార్గదర్శకత్వం కోసం వారి యజమాని లేదా ఈపీఎఫ్ఓని సంప్రదించాలి.
పీఎఫ్ ఉపసంహరణపై పన్ను
- ఇప్పుడు పన్నుల అంశానికి వస్తే, ఉద్యోగులు వారి ఈపీఎఫ్ ఖాతాలో జమ చేసిన మొత్తంపై సాధారణంగా పన్ను విధించబడదు. ఆదాయ పన్ను చట్టం సెక్షన్ 80సీ కింద మినహాయింపును క్లెయిమ్ చేయవచ్చు. ఒకవేళ మీరు 80సీ క్లయిమ్ చేయకపోతే అదనపు పన్ను చెల్లించాల్సి రావొచ్చు.
- ఉద్యోగుల కంట్రి బ్యూషన్ పై పొందే వడ్డీ సాధారణంగా ఇతర వనరుల నుంచి వచ్చే ఆదాయంగా పరిగణించి పన్ను విధిస్తారు.
- యజమాని అందించిన సహకారం, దానిపై వచ్చిన వడ్డీ మొత్తంపై పన్ను రిటర్న్‌లో జీతం కింద పూర్తిగా పన్ను విధిస్తారు.
- మరొక సందర్భంలో, ఒక ఉద్యోగి ఒకటి లేదా అంతకంటే ఎక్కువ సంస్థలతో 5 సంవత్సరాల నిరంతర సేవను పూర్తి చేయడానికి ముందు తన పీఎఫ్ నిధులను ఉపసంహరించుకోవాలని నిర్ణయించుకుంటే, టీడీఎస్ తీసుకుంటారు. అయితే మీరు విత్ డ్రా చేసే మొత్తం రూ.50,000 కంటే తక్కువ ఉంటే ఎటువంటి డిడక్షన్లు ఉండవు.
- మరోవైపు, ఉద్యోగి 5 సంవత్సరాల నిరంతర సేవ తర్వాత మొత్తాన్ని విత్‌డ్రా చేస్తే ఈపీఎఫ్ ఉపసంహరణకు పన్నుల నుంచి మినహాయింపు ఉంటుంది. తప్పనిసరి ‘5 సంవత్సరాల సర్వీస్’ని లెక్కించేటప్పుడు, ఉద్యోగి తన ఈపీఎఫ్ బ్యాలెన్స్‌ను పాత యజమాని నుంచి కొత్తదానికి బదిలీ చేసినట్లయితే, మునుపటి యజమానులతో ఉన్న పదవీకాలం కూడా కొత్తదానికి కంటిన్యూ అవుతుంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..