Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Petrol Price: పెట్రోలు, డీజిల్ ధరలు పెరగనున్నాయా..? పెట్రోలియం మంత్రి ఏమన్నారంటే..

ఇజ్రాయెల్ - పాలస్తీనా వివాదం మధ్య పెట్రోల్, డీజిల్ ధరలపై ప్రభుత్వం నుంచి కీలక ప్రకటన వచ్చింది. రానున్న రోజుల్లో పెట్రోలు, డీజిల్ ధరలు పెరిగే అవకాశం ఉందని ప్రభుత్వం స్పష్టం చేసింది. నిజానికి కొనసాగుతున్న వివాదం తర్వాత ముడి చమురు ధరలు పెరుగుతున్నాయి. దీనికి ప్రధాన కారణం ముడి చమురు లభ్యత, ముడి చమురు సరఫరా తగ్గితే ధరలు పెరగడం ఖాయమని తెలుస్తోంది. ఆ తర్వాత ప్రభుత్వం..

Petrol Price: పెట్రోలు, డీజిల్ ధరలు పెరగనున్నాయా..? పెట్రోలియం మంత్రి ఏమన్నారంటే..
Hardip Singh Puri
Follow us
Subhash Goud

|

Updated on: Oct 13, 2023 | 5:55 PM

ఇజ్రాయెల్ – పాలస్తీనా మధ్య జరుగుతున్న వివాదం తారా స్థాయికి చేరుకుంటోంది. యుద్ధం మరింతగా తీవ్రతరం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ రెండు దేశాల మధ్య జరుగుతున్న వార్‌లో ఎంతో మంది మరణించారు. భారత్‌కు చెందిన చాలా మంది కూడా ఇజ్రాయెల్‌లో ఉండిపోయారు. వారిని స్వదేశానికి రప్పిస్తోంది భారత్‌. ఇప్పటికే అక్కడ చిక్కుకున్న వారికి విమానాల ద్వారా సురక్షితంగా భారత దేశానికి రప్పిస్తున్నారు.

ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్ – పాలస్తీనా వివాదం మధ్య పెట్రోల్, డీజిల్ ధరలపై ప్రభుత్వం నుంచి కీలక ప్రకటన వచ్చింది. రానున్న రోజుల్లో పెట్రోలు, డీజిల్ ధరలు పెరిగే అవకాశం ఉందని ప్రభుత్వం స్పష్టం చేసింది. నిజానికి కొనసాగుతున్న వివాదం తర్వాత ముడి చమురు ధరలు పెరుగుతున్నాయి. దీనికి ప్రధాన కారణం ముడి చమురు లభ్యత, ముడి చమురు సరఫరా తగ్గితే ధరలు పెరగడం ఖాయమని తెలుస్తోంది. ఆ తర్వాత ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ధరలను పెంచాల్సి ఉంటుంది.

హర్దీప్ సింగ్ పూరి కీలక ప్రకటన:

ఇంధన ధరలపై కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి మాట్లాడుతూ.. లభ్యత, స్థోమత, స్థిరత్వం అనే మూడు సవాళ్లతో మేము వ్యవహరిస్తున్నామని చెప్పారు. ప్రస్తుతం మేము లభ్యత గురించి ఆందోళన చెందడం లేదు. ఎందుకంటే భారత దేశం ముడి చమురును దిగుమతి చేసుకునే దేశాల సంఖ్య 27 నుంచి 39 కి పెరిగింది. ఒక ప్రాంతంలో సమస్య ఉంటే, మేము మరొక ప్రాంతం నుంచి సరఫరాలను పొందవచ్చు. స్థోమత విషయానికొస్తే ఇది లభ్యతకు సంబంధించినది. మార్కెట్‌లలో లభించే చమురు అకస్మాత్తుగా తగ్గితే ధరలు పెరగవచ్చు. సుస్థిరత కొరకు, గ్రీన్ ఎనర్జీ పరివర్తనలో స్థానం బలహీనపడటానికి మేము అనుమతించలేదు.” అని అన్నారు.

ఇవి కూడా చదవండి

ఇజ్రాయెల్ – హమాస్ మధ్య జరుగుతున్న యుద్ధం గురించి కేంద్ర పెట్రోలియం మంత్రి హర్దీప్ సింగ్ పూరి మాట్లాడుతూ.. భారతదేశం ఉగ్రవాదాన్ని ఎదుర్కొంటోందని, ఉగ్రవాదాన్ని ఎప్పుడూ ఖండిస్తూనే ఉంటుందని, అలాగే కొనసాగుతుందని అన్నారు. ఛండీగడ్‌లో హర్‌దీప్‌ పూరీ ఈ విషయాలను తెలియజేశారు ఈరోజు తీవ్రవాదానికి నిర్వచనం ఏమిటన్నది ప్రశ్న కాదని అన్నారు. అక్కడ అమాయ ప్రజలు బలవుతున్నారని అన్నారు.

మేము ఉగ్రవాదానికి వ్యతిరేకం.. ఉగ్రవాదులు అత్యంత ప్రాథమిక హక్కును, జీవించే హక్కును హరిస్తున్నారు. పెట్రోలియం సరఫరాపై ఎలాంటి ప్రభావం పడకుండా భారత్ భరోసా ఇస్తోందని, ఈ దిశగా కృషి చేస్తున్నామని ఆయన చెప్పారు. అయితే ఒక వేళ పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెరిగినా.. ప్రజలపై భారం పడకుండానే చర్యలు చేపడుతున్నామని మంత్రి తెలిపారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి