Women’s Day Gift: అమెజాన్ ఉమెన్స్ డే స్పెషల్.. ఏకంగా పెద్ద స్టోరే ప్రారంభించిందిగా.. భలే ఆఫర్లు..

ప్రముఖ ఈ-కామర్స్ జెయింట్ అమెజాన్ ప్రత్యేకమైన మహిళా దినోత్సవ బహుమతి దుకాణాన్ని ప్రారంభించింది. దీనిలో వివిధ రకాల గిఫ్ట్ ఆర్టికల్స్ తో పాటు మహిళలకు అక్కరకొచ్చే అనేక పరికరాలను అందుబాటులో ఉంచింది. వాటి ధరలు రూ. 199 నుంచి ప్రారంభమవుతున్నాయి. ఇక్కడ మీరు బల్క్ గా వస్తువులను కొనుగోలు చేయొచ్చు. ఇది చిరు వ్యాపారులకు, అదే విధంగా పెద్ద ఎత్తున బహుమతులు కొనుగోలు చేయాలనుకునే వారికి సరిగ్గా సరిపోతోంది.

Women's Day Gift: అమెజాన్ ఉమెన్స్ డే స్పెషల్.. ఏకంగా పెద్ద స్టోరే ప్రారంభించిందిగా.. భలే ఆఫర్లు..
Amazon
Follow us

|

Updated on: Mar 08, 2024 | 2:58 AM

మహిళలకు ప్రత్యేకమైన రోజు మార్చి 8. అంతర్జాతీయ మహిళా దినోత్సవంగా ఆ రోజును జరుపుకుంటాం. వివిధ రంగాల్లో సేవలు చేసే మహిళలకు వారికి సేవలకు గుర్తింపుగా సత్కరించడం.. వారి ఘనతలను జ్ఞాపకం చేసుకోవడం చేస్తుంటారు. అదే సమయంలో కొంత మంది వారికి మంచి గిఫ్ట్స్ ఇస్తుంటారు. తమ ప్రియమైన వారికి, అక్కా చెల్లెళ్లకు, స్నేహితులకు, జీవిత భాగస్వాములకు మహిళా దినోత్సవం సందర్భంగా ప్రత్యేక బహుమతులు అందిస్తుంటారు. ప్రపంచ వ్యాప్తంగా ఇదే ట్రెండ్ కొనసాగుతోంది. దీనిని అడ్వాంటేజ్ చేసుకొని చిన్న బిజినెస్ ప్లాన్ చేసుకోవచ్చు. అందుకోసం  ప్రముఖ ఈ-కామర్స్ జెయింట్ అమెజాన్ ప్రత్యేకమైన మహిళా దినోత్సవ బహుమతి దుకాణాన్ని ప్రారంభించింది. దీనిలో వివిధ రకాల గిఫ్ట్ ఆర్టికల్స్ తో పాటు మహిళలకు అక్కరకొచ్చే అనేక పరికరాలను అందుబాటులో ఉంచింది. వాటి ధరలు రూ. 199 నుంచి ప్రారంభమవుతున్నాయి. ఇక్కడ మీరు బల్క్ గా వస్తువులను కొనుగోలు చేయొచ్చు. ఇది చిరు వ్యాపారులకు, అదే విధంగా పెద్ద ఎత్తున బహుమతులు కొనుగోలు చేయాలనుకునే వారికి సరిగ్గా సరిపోతోంది. ఆ జాబితాలో కిరాణా, హ్యాంపర్‌లు అండ్ గౌర్మెట్ బహుమతులు, వ్యక్తిగత సంరక్షణ, ఎలక్ట్రానిక్స్ ఉపకరణాలు, పెద్ద ఉపకరణాలు, గృహ, వంటగది ఉపకరణాలు, ఫర్నిషింగ్, డెకర్ వంటి విభాగాలలో ఉత్పత్తులను పెద్దమొత్తంలో అందుబాటులో ఉన్నాయి. వీటిపై అదిరే ఆఫర్లను అమెజాన్ అందిస్తోంది.

ఎలక్ట్రానిక్స్ అండ్ యాక్సెసరీస్..

టెలివిజన్, స్పీకర్లు, కెమెరాల వంటి ఎలక్ట్రానిక్స్, యాక్సెసరీలపై 75% వరకు తగ్గింపు అందిస్తోంది అమెజాన్. రూ. 4,848 కే లైఫ్‌లాంగ్ వంటి బ్రాండ్‌ల నుంచి నొప్పి నివారణ కోసం ఫుట్ మసాజర్ మెషిన్ అందుబాటులో ఉంది. అలాగే ఏసీలు, రిఫ్రిజిరేటర్ల వంటి పెద్ద ఉపకరణాలపై 65% వరకు తగ్గింపు లభిస్తోంది. రూ. 2996 వద్ద కేరీన్‌హాన్స్ టెక్నాలజీతో ఫిలిప్స్ హెయిర్ స్ట్రెయిట్‌నర్ బ్రష్‌ను, హీట్ బ్యాలెన్స్ టెక్నాలజీతో హావెల్స్ ఫోల్డబుల్ హెయిర్ డ్రైయర్‌ను రూ. 999కే కొనుగోలు చేయొచ్చు. అగారో నుంచి హెయిర్ కర్లర్‌ల కోసం రూ. 902 కంటే తక్కువ ధరలో అందుబాటులో ఉంది.

ఫైర్ బోల్ట్ నింజా కాల్ ప్రో ప్లస్ స్మార్ట్ వాచ్ కేవలం రూ. 1199కే కొనుగోలు చేయొచ్చు. ఇది 1.83 అంగుళాల స్మార్ట్ వాచ్ తో బ్లూటూత్ కాలింగ్, ఏఐ వాయిస్ సహాయంతో పనిచేస్తుంది. అలాగే సీఎస్-01 ప్లాస్టిక్ షేకర్ బాటిల్ రూ. 188కే కొనొచ్చు. యాంటీ స్లిప్ ట్రూలీ రివర్సిబుల్ యోగా మ్యాట్ విత్ గైడ్‌అలైన్ ఫ్రమ్ టెగో రూ. 2,699కే కొనుగోలు చేయొచ్చు. సిలికా జెల్ వెయిట్ లిఫ్టింగ్ స్ట్రాప్స్, రిస్ట్ ప్రొటెక్టర్ కోసం వెయిట్‌లిఫ్టింగ్, వర్కౌట్, క్రాస్‌ఫిట్ నుంచి హైక్స్ నుంచి ఆఫీస్ స్టైల్ రూ . 699, రాకర్జ్ బ్లూటూత్ నెక్‌బ్యాండ్ రూ. 999కి లభిస్తోంది.

ఇవి కూడా చదవండి

వైర్‌లెస్ మౌస్, పవర్ బ్యాంక్‌లు, బ్లూటూత్ స్పీకర్‌లు, సర్దుబాటు చేయగల ల్యాప్‌టాప్ స్టాండ్‌లు, లాజిటెక్, పోర్ట్‌రోనిక్స్‌తో సహా మరిన్ని ప్రముఖ బ్రాండ్‌ల వంటి ఉపకరణాలు కూడా అందుబాటులో ఉన్నాయి. అగ్ర బ్రాండ్‌ల నుంచి వైర్‌లెస్, వైర్డు హెడ్‌ఫోన్‌లు అందుబాటులు ఉన్నాయి. లాజిటెక్ హెచ్111 వైర్డ్ ఆన్ ఇయర్ హెడ్‌ఫోన్‌లు రూ. 745 వద్ద అందుబాటులో ఉన్నాయి.

వంటగది ఉపకరణాలు..

వంటగది ఉపకరణాలు, డెకర్, గృహోపకరణాలపై 70% వరకు తగ్గింపు లభిస్తోంది. న్యూట్రిప్రో, ప్రెస్టీజ్, ఫిలిప్స్ వంటి బ్రాండ్‌ల నుంచి హ్యాండ్ బ్లెండర్‌లు, జ్యూసర్‌లు, మిక్సర్-గ్రైండర్లు, ఎలక్ట్రిక్ కెటిల్స్, స్టీమ్ అండ్ డ్రై ఐరన్‌లు వంటి వర్గాల నుంచి షాపింగ్ చేయొచ్చు. ప్రెస్టీజ్ స్టెయిన్‌లెస్ స్టీల్ 1.5 లీటర్ కెటిల్ 1500-వాట్స్ రూ. 649కు అందుబాటులో ఉంది. బోరోసిల్ హైడ్రా వాక్యూమ్ స్పిల్ ప్రూఫ్ ట్రావెల్ మగ్స్‌ రూ. 615 కి కొనుగోలు చేయొచ్చు. ఏసియన్ ఆరా సిరామిక్ అరోమా డిఫ్యూజర్ ఆయిల్, హోమ్ ఫ్రాగ్రెన్స్ క్యాండిల్ రూ. 271కి కొనుగోలు చేయొచ్చు.

అమెజాన్ బిజినెస్ లాగిన్ ఇలా..

అమెజాన్ బిజినెస్ బిల్-టు-షిప్-టు సదుపాయం, వ్యాపారాలు భారతదేశం అంతటా బహుమతులు రవాణా చేయడానికి, ఇబ్బంది లేకుండా పన్ను క్రెడిట్‌ను క్లెయిమ్ చేయడానికి అనుమతిస్తుంది. వ్యాపార యజమానులు www.amazon.in/businessని సందర్శించడం ద్వారా వారి జీఎస్టీ నంబర్ లేదా బిజినెస్ పాన్‌తో ఉచితంగా అమెజాన్ బిజినెస్ లో నమోదు చేసుకోవచ్చు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..