AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Amazon Great Indian Festival: అమెజాన్ బంపర్ ఆఫర్.. వన్‌ప్లస్ స్మార్ట్‌ఫోన్లపై 3వేలకు పైగా డిస్కౌంట్..

Amazon Great Indian Festival: పండుగ సీజన్ నేపథ్యంలో అమెజాన్ గ్రేట్ ఇండియా ఫెస్టివల్ సేల్‌ను ప్రారంభించింది. అక్టోబర్ 3వ తేదీన అంటే ఇవాళ్టి..

Amazon Great Indian Festival: అమెజాన్ బంపర్ ఆఫర్.. వన్‌ప్లస్ స్మార్ట్‌ఫోన్లపై 3వేలకు పైగా డిస్కౌంట్..
Oneplus
Shiva Prajapati
|

Updated on: Oct 03, 2021 | 6:03 PM

Share

Amazon Great Indian Festival: పండుగ సీజన్ నేపథ్యంలో అమెజాన్ గ్రేట్ ఇండియా ఫెస్టివల్ సేల్‌ను ప్రారంభించింది. అక్టోబర్ 3వ తేదీన అంటే ఇవాళ్టి నుంచి ప్రారంభమైన ఈ సేల్.. అక్టోబర్ 7వ తేదీ వరకు ఉంటుంది. ఈ సేల్‌లో భాగంగా అమెజనా భారీ ఆఫర్లు ప్రకటించింది. ముఖ్యంగా సెల్ ఫోన్ ప్రియులను దృష్టిలో ఉంచుకుని ఎలక్ట్రానిక్స్‌పై ఊహించని రీతిలోని డిస్కౌంట్లు ఇస్తోంది. స్మార్ట్ ఫోన్ కొనాలనుకునే వారి కోసం అద్భుతమైన ఆఫర్లు అందిస్తోంది. స్మార్ట్ ఫోన్లలో మంచి గుర్తింపు పొందిన వన్ ప్లస్ ఫోన్లపై అమెజాన్ ఊహించని డిస్కౌంట్ ప్రకటించింది. దాదాపు 3 వేలకు పైగా ధరను తగ్గించింది. ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుంది.

వన్‌ప్లస్ 9.. వన్‌ప్లస్ 9 వాస్తవ ధర 49,999 కాగా, గ్రేట్ ఇండియా ఫెస్టివల్ సేల్‌లో భాగంగా భారీ డిస్కౌంట్‌ని ప్రకటించింది అమెజాన్. 46,999 రూపాయలకే అందిస్తోంది. ఫ్లాగ్‌షిప్ మోడల్‌లో 5జీ సపోర్ట్, 4500 ఎంఏహెచ్ లిథియం పాలిమర్ బ్యాటరీ సామర్థ్యం కలిగి ఉంది వన్‌ప్లస్ 9. ఇది క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 888 SoC తో పని చేస్తుంది. వన్‌ప్లస్ 9 లో 8 జీబి ర్యామ్ 128 జిబి ఇంటర్నల్ స్టోరేజ్ ఉంది. 1080×2400 పిక్సెల్‌ రిజల్యూషన్‌తో 6.55-అంగుళాల FHD+ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇది హస్సెల్‌బ్లాడ్ సహ- అప్‌డేటెడ్ ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. ఇందులో మెయిన్ కెమెరా 48 మెగాపిక్సెల్ కాగా, 50 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్-యాంగిల్ కెమెరా ఫ్రీ ఫారమ్ లెన్స్, 2 మెగాపిక్సెల్ మోనోక్రోమ్ లెన్స్ ఉన్నాయి.

వన్‌ప్లస్ నార్డ్ CE.. వన్‌ప్లస్ నార్డ్ సిఇ రూ. 24,999 లకు అందుబాటులో ఉంది. ఇది 6.43-అంగుళాల ఫుల్ హెచ్‌డి అమోలెడ్ డిస్‌ప్లేతో 20: 9 నిష్పత్తి, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్‌తో వస్తుంది. వన్‌ప్లస్ నార్డ్ సిఇ 5 జి సపోర్ట్ ఉంది. ట్రిపుల్ రియర్ కెమెరా ఉంది. ఇందులో 64 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా f/1.79 తో పనిచేస్తుంది. 8 మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ కెమెరా, 2 మెగాపిక్సెల్ మోనో కెమెరా ఉన్నాయి. సెల్ఫీ కోసం ముందు భాగంలో 16 మెగాపిక్సెల్ సోనీ IMX471 సెన్సార్ ఉంది. ఇది క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 750G చిప్‌సెట్ తో 12 GB LPDDR4X RAM, 256 GB UFS2.1 ఇంటర్నల్ స్టోరేజ్‌ ఉంది. స్మార్ట్‌ఫోన్ వార్ప్ ఛార్జ్ 30 టి ప్లస్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 4,500 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్థ్యం కలిగి ఉంది.

వన్‌ప్లస్ 9 ఆర్.. వన్‌ప్లస్ 9ఆర్ వాస్తవ ధర 39,999 రూపాయలు కాగా, గ్రేట్ ఇండియా ఫెస్టివల్ సేల్‌లో భాగంగా 36,999 రూపాయలకే అందిస్తోంది అమెజాన్. ఇది క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 870 SoC పవర్‌తో పనిచేస్తుంది. 12GB ర్యామ్, 8GB ర్యామ్ మోడళ్లలో అందుబాటులో ఉంది. 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.55-అంగుళాల అమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ క్వాడ్ కెమెరా సెటప్‌ 48MP సోనీ IMX586 సెన్సార్‌తో, 16MP సోనీ IMX481 అల్ట్రా-వైడ్ లెన్స్‌తో 123 డిగ్రీల FoV, 5MP మాక్రో లెన్స్, 2MP మోనోక్రోమ్ లెన్స్ కలిగి ఉంది. ఇది 65 వాట్ వార్ప్ ఛార్జింగ్‌తో 4500 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్థ్యం కలిగి ఉంది.

Also read:

Auto Mobile: ఆటోమొబైల్‌ రంగంపై చిప్స్ దెబ్బ.. భారీగా తగ్గిన అమ్మకాలు.. తైవాన్‌తో ఒప్పందం దిశగా భారత్..

Sai Dharam Tej: బిగ్ న్యూస్.. యాక్సిడెంట్ అనంతరం తొలిసారి సాయి ధరమ్ తేజ్ ట్వీట్..

Win on Cancer: ఆరు సార్లు కేన్సర్.. 12 సార్లు కీమో థెరపీ.. చెక్కుచెదరని ఆత్మవిశ్వాసం.. వందలాది మందికి స్ఫూర్తి సందేశం!