AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Automobile: ఆటోమొబైల్‌ రంగంపై చిప్స్ దెబ్బ.. భారీగా తగ్గిన అమ్మకాలు.. తైవాన్‌తో ఒప్పందం దిశగా భారత్..

ఆటోమొబైల్‌ పరిశ్రమను వేధిస్తున్న చిప్స్‌ కొరత ఇప్పట్లో తీరే అవకాశం కనిపించటం లేదు. వీటి కొరతతో గత ఏడా దితో పోలిస్తే ఈ ఏడాది సెప్టెంబరులో మారుతి సుజుకీ, హ్యుండయ్‌, మహీంద్రా అండ్‌ మహీంద్రా కంపెనీల వాహన విక్రయాలకు బ్రేక్‌ పడింది...

Automobile: ఆటోమొబైల్‌ రంగంపై చిప్స్ దెబ్బ.. భారీగా తగ్గిన అమ్మకాలు.. తైవాన్‌తో ఒప్పందం దిశగా భారత్..
Chip
Srinivas Chekkilla
|

Updated on: Oct 03, 2021 | 6:13 PM

Share

ఆటోమొబైల్‌ పరిశ్రమను వేధిస్తున్న చిప్స్‌ కొరత ఇప్పట్లో తీరే అవకాశం కనిపించటం లేదు. వీటి కొరతతో గత ఏడా దితో పోలిస్తే ఈ ఏడాది సెప్టెంబరులో మారుతి సుజుకీ, హ్యుండయ్‌, మహీంద్రా అండ్‌ మహీంద్రా కంపెనీల వాహన విక్రయాలకు బ్రేక్‌ పడింది. కియా, హోండా కంపెనీలదీ ఇదే పరిస్థితి. మారుతి దేశీయ అమ్మకాలు ఏకంగా 54.9 శాతం పడిపోయి 68,815కు చేరాయి. హ్యుండయ్‌ మోటార్‌ ఇండియా అమ్మకాలూ గత ఏడాదితో పోలిస్తే గత నెల్లో 34.2 శాతం తగ్గాయి. మహీంద్రా విక్రయాలు 12 శాతం తగ్గి 13,134కు చేరాయి. కియా ఇండియా అమ్మకాలు కూడా గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 22.67 శాతం పడిపోయాయి. హోండా కార్సు అమ్మకాలూ 33.66 శాతం తగ్గాయి. టాటా మోటార్స్‌, స్కోడా, టయోటా కిర్లోస్కర్‌, ఎంజీ మోటార్స్‌ కంపెనీలు మాత్రమే అమ్మకాల్లో స్వల్ప వృద్ధి నమోదు చేశాయి. కాగా చిప్‌ల కొరత అక్టోబరు నెలలోనూ అమ్మకాలపై ప్రభావం చూపించనుందని ఆటోమొబైల్‌ కంపెనీలు అంచనా వేస్తున్నాయి.

ఈ సమస్య పరిష్కారం కోసం మనదేశం ప్రయత్నాలు చేస్తోంది. చిప్‌సెట్‌ల తయారీలో ఎంతో ముందున్న తైవాన్‌తో ఒప్పందం దిశగా పయనిస్తోంది. 5జీ ఫోన్ల నుంచి విద్యుత్‌ కార్ల వరకు.. అన్ని ఉత్పత్తులకు చిప్‌లను సరఫరా చేయడానికి 7.5 బిలియన్‌ డాలర్ల (దాదాపు రూ.55,000 కోట్లు) పెట్టుబడితో ప్లాంటును భారత్‌లో నిర్మింప చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోంది. తైవాన్‌ సెమీకండక్టర్‌ మాన్యుఫాక్చరింగ్‌ కార్పొరేషన్‌(టీఎస్‌ఎమ్‌సీ) ప్రపంచంలోనే అతిపెద్ద కాంట్రాక్ట్‌ చిప్‌ తయారీ కంపెనీ. క్వాల్‌కామ్‌, యాపిల్‌ వంటివి దీనికి ఖాతాదార్లు. అందుకే తైవాన్‌తో మన ప్రభుత్వం చర్చలు జరుపుతోంది. ఇందుకు కావాల్సిన భూమి, నీరు, మానవ వనరుల అంశాల్లో పరిశీలన జరుపుతోంది. 2023 నుంచి 50 శాతం మూలధన వ్యయాలనూ ఇవ్వనుంది. ఈ విషయంలో తైవాన్‌ సైతం ద్వైపాక్షిక పెట్టుబడుల ఒప్పందం వేగమందుకోవాలని భావిస్తోంది. ఈ ఒప్పందం కింద సెమీ కండక్టర్ల తయారీలో ఉపయోగించే డజన్ల కొద్దీ ఉత్పత్తులపై సుంకాలనూ తగ్గించాలని భారత్‌ భావిస్తోంది.

తైవాన్‌తో రాబోయే రోజుల్లో ఒప్పందంపై సంతకాలు జరిగినా.. సమస్య వెంటనే తీరిపోదు. ఎందుకంటే మొత్తం ప్రక్రియకు.. అంటే ప్లాంటులో ఉత్పత్తి ప్రారంభానికి ఏళ్లు పట్చొచ్చు. ప్రస్తుత కొరత వచ్చే ఏడాది ద్వితీయార్థం వరకు కొనసాగుతుందన్న అంచనాల మధ్య భారత్‌-తైవాన్‌ ప్రాజెక్టును మెరుపు వేగంతో చేపట్టినా.. 2023కు ముందు మాత్రం ఉత్పత్తి మొదలు కాకపోవచ్చవని తెలుస్తోంది.

Read Also..  Insurance Plans: జీవిత బీమా ఎన్ని రకాలు.. అందులో ఏది బెటర్.. ప్రతి ఒక్కరు బీమా తీసుకోవాల్సిందేనా?