No Cost EMI: నో కాస్ట్‌ ఈఎంఐ పద్దతుల్లో ఆన్‌లైన్‌లో వస్తువులను కొనుగోలు చేస్తున్నారా..? నిజంగా వడ్డీ వర్తిస్తుందా..? లేదా? ఇదిగో పూర్తి వివరాలు

ఇప్పుడు పండగ సీజన్‌ కొనసాగుతోంది. పండగ సీజన్‌లో ప్రముఖ ఇ-కామర్స్‌ దిగ్గజాలు రకరకాల ఆఫర్లతో వినియోగదారుల ముందుకొస్తాయి. అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌, ఇతర ఆన్‌లైన్‌ షాపింగ్‌ కంపెనీలు..

No Cost EMI: నో కాస్ట్‌ ఈఎంఐ పద్దతుల్లో ఆన్‌లైన్‌లో వస్తువులను కొనుగోలు చేస్తున్నారా..? నిజంగా వడ్డీ వర్తిస్తుందా..? లేదా? ఇదిగో పూర్తి వివరాలు
Online Shopping

Updated on: Oct 08, 2022 | 4:08 PM

ఇప్పుడు పండగ సీజన్‌ కొనసాగుతోంది. పండగ సీజన్‌లో ప్రముఖ ఇ-కామర్స్‌ దిగ్గజాలు రకరకాల ఆఫర్లతో వినియోగదారుల ముందుకొస్తాయి. అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌, ఇతర ఆన్‌లైన్‌ షాపింగ్‌ కంపెనీలు రకరకాల ఆఫర్లను తీసుకువస్తుంటాయి. ఇందులో ప్రజలు భారీ ఆన్‌లైన్‌ షాపింగ్స్‌ చేస్తుంటారు. అయితే ముఖ్యంగా ఆన్‌లైన్‌లో ఏదైనా వస్తువులను కొనుగోలు చేసినట్లయితే నో కాస్ట్‌ ఈఎంఐ ఆఫర్లు ఉంటాయి. వడ్డీ లేని రుణంతో వస్తువులను కొనుగోలు చేసే సదుపాయం అన్నట్లు. దీనిని చూసిన ప్రజలు ఎగబడి ఆన్‌లైన్‌లో కొనుగోలు చేస్తుంటారు. కానీ నో-కాస్ట్‌ ఈఎంఐ అంటే ధరలోనే వడ్డీ మొత్తాన్ని కూడా కలిపి విక్రయిస్తారన్న విషయం అందరికి తెలిసి ఉండకపోవచ్చు. అసలుతో వడ్డీని కలిపి రుణ కాలపరిమితికి తగ్గట్టుగా ఈఎంఐలను నిర్ణయిస్తారు. అసలు జీరో వడ్డీ రుణాలే లేవని రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్బీఐ) చెబుతోంది. వడ్డీ మొత్తాన్ని కూడా ఉత్పత్తి ధరలో కలిపి అమ్మడమే జీరో కాస్ట్‌ ఈఎంఐ స్కీమ్‌ల ప్లాన్‌ అని ఓ సర్క్యూలర్‌లో స్పష్టం చేసింది ఆర్బీఐ.

ఇలా నోకాస్ట్‌ ఈఎంఐ అనే ఆప్షన్‌ ఉంటే అలాంటిదేమి ఉండదని, మొత్తం వడ్డీతో సహా జీఎస్టీని కలిసి అసలు ధరల్లోనే వేస్తుందని భావించాలని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. ఉదాహరణకు మీరు ఆన్‌లైన్‌లో ఒక ప్రొడక్ట్‌ను కొనుగోలు చేశారనుకుందాం. దాని విలువ రూ.24వేలు. ఉంటే దీనిని మీరు నగదు చెల్లించి కొనుగోలు చేస్తే మీకు డీలర్‌ డిస్కౌంట్‌ను ఆఫర్‌ అందిస్తారు. కానీ దానినే ఈఎంఐలో కొనుగోలు చేస్తే ఈ డిస్కౌంట్‌ ఉండదు. మొత్తం రూ.24 వేలను ఒక సదరు డిస్కౌంట్‌ మొత్తాన్ని వడ్డీకి సమానంగా ఉండేలా చూసుకుంటారు. దీనిని మీరు ఆరు నెలల పాటు ఈఎంఐ రూపంలో మార్చుకుంటే నో కాస్ట్‌ రూపంలో రూ.4000 చెల్లించాల్సి ఉంటుంది. అంటే ఎలాంటి వడ్డీ ఉండదను అనుకుంటారు. కానీ ఈ మొత్తంలో అన్ని వడ్డీ కలుపుకొనే మీకు ధరను నిర్ణయిస్తారు.

మీరు పెట్టుకునే ఈఎంఐ ఆప్షన్‌లో ప్రాసెసింగ్‌ ఫీజు, ప్రీ క్లోజర్‌ చార్జీలు, కాలపరిమితి ఇవన్ని పరిశీలించడం మంచిదంటున్నారు. నో కాస్ట్‌ ఈఎంఐతో కొనుగోలు చేసే ముందు వివిధ డీలర్ల వద్ద ధరల తేడాలను గుర్తించడం తప్పనిసరి. నేరుగా నగదుతో కొనుగోలు చేయడానికి, ఈఎంఐలతో కొనుగలు చేయడానికి మధ్య ఉన్న తేడాలను గుర్తించడండి.

ఇవి కూడా చదవండి

బ్యాంకు వడ్డీ విధించదా?

ఆర్బీఐ నిబంధనల ప్రకారం.. ఏ కంపెనీ కూడా సున్నా వడ్డీతో రుణాలు ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వదు. ఈ నిబంధనల ప్రకారం వడ్డీ రహిత ఈఎంఐలో వస్తువుల ఎలా విక్రయిస్తున్నారనే అనుమానం రావచ్చు. నో-కాస్ట్‌ ఈఎంఐ కింద వస్తువు కొనుగోలు చేసినప్పటికీ ఇచ్చిన రుణంపై బ్యాంకులు వడ్డీ వసూలు చేస్తాయి. అంతే తప్ప వడ్డీ లేకుండా బ్యాంకులు రుణం ఇవ్వవు. ఇ-కామర్స్‌ సంస్థలు వెబ్‌సైట్లలో ఇలాంటి విషయాలను తప్పనిసరిగ్గా గమనించాలంటున్నారు.

ఇ-కామర్స్ కంపెనీలకు నష్టం కాదా?

ఇ-కామర్స్‌ దిగ్గజాల నుంచి మొత్తం ఒకేసారి చెల్లించి ప్రోడక్ట్‌ను కొనుగోలు చేసినా, నో-కాస్ట్‌ ఈఎంఐ రూపంలో చెల్లించినా ఒకే ధర వర్తిస్తుంది. అయితే ఈ విధంగా నో-కాస్ట్‌ ఈఎంఐ వల్ల కంపెనీలు వడ్డీ భారాన్ని మోస్తాయని చాలా మంది అనుకుంటారు. కానీ అలాంటిదేమి ఉండదంటున్నారు వ్యాపారవేత్తలు. ఇక్కడ ఇంకో విషయాన్ని గమనించాలి. నో-కాస్ట్‌ ఈఎంఐ వల్ల కస్టమర్లు తమ వద్ద డబ్బులు లేకపోయినా వాయిదాల రూపంలో చెల్లించుకోవచ్చన్న భావతో కొనుగోలు చేసేందుకు ముందుకొస్తుంటారు. దీని కారణంగా కంపెనీలు అమ్మకాలు పెంచుకునేందుకు కొన్ని సమయాల్లో పాత స్టాక్‌ను క్లియర్‌ చేసుకునేందుకు పలు డిస్కౌంట్లు ఇస్తుంటాయి. దీంతో డిస్కౌంట్‌, నో-కాస్ట్‌ఈఎంఐ పేరు చెప్పి ప్రోడక్ట్‌ ధరను తగ్గించినా.. వారికి దాని వాస్తవ విలువకే విక్రయిస్తారని గమనించాలి.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి