ITR Filing 2023: పన్ను చెల్లింపుదారులకు అలర్ట్.. ఈ పని చేయకపోతే రూ. 5,000 వరకూ నష్టపోతారు.. వివరాలు ఇవి..
2023-24 అసెస్మెంట్ ఇయర్ కి సంబధించి డెడ్ లైన్ 2023, జూలై 31 నాటికి 6.93 కోట్ల మేర ఐటీఆర్ లు దాఖలయ్యాయి. అయితే ఇప్పటి వరకూ 6.69 కోట్ల మేర ఐటీఆర్ లు మాత్రమే వెరిఫై అయ్యాయి. మిగిలినవి పెండింగ్ లోనే ఉన్నాయి. ఇలా పెండింగ్ లో ఉన్న ఖాతాలపై పెనాల్టీ పడుతుంది. అది వివిధ పన్ను చెల్లింపు దారులను బట్టి రూ. 5,000 వరకూ ఉంటుంది. ఈ నేపథ్యంలో ఐటీఆర్ వెరిఫికేషన్ ఎలా చేయాలి తెలుసుకుందాం రండి..
ట్యాక్స్ పేయర్స్‌కి అలర్ట్.. మీ ఇన్ కమ్ ట్యాక్స్ రిటర్న్ దాఖలు చేసేసి పని అయిపోయిందని హమ్మయ్యా అని ఊపిరి పీల్చుకున్నారా? అయితే మీకు రూ. 5,000 వరకూ ఫైన్ పడే అవకాశం ఉంది. అదేంటి డెడ్ లైన్ లోపే ఐటీఆర్ దాఖలు చేశాంగా మరెందుకు పెనాల్టీ పడుతుందని ఆలోచిస్తున్నారా? ఇన్ కమ్ ట్యాక్స్ డిపార్ట్ మెంట్ ప్రతి పన్ను చెల్లింపుదారుడికి ఓ సూచన చేసింది. అదేంటంటే ఐటీఆర్ దాఖలు చేసిన తర్వాత 30 రోజుల లోపు దానిని వెరిఫై చేసుకోవాలని కోరింది. అలా వెరిఫై చేసుకోకపోతే మీ ఐటీఆర్ దాఖలు చేసినట్లు కాదని తెలిసింది. అలాంటివి అన్నీ ఆటోమేటిక్ గా రిజెక్ట్ అవుతాయని స్పష్టం చేసింది. 2023-24 అసెస్మెంట్ ఇయర్ కి సంబధించి డెడ్ లైన్ 2023, జూలై 31 నాటికి 6.93 కోట్ల మేర ఐటీఆర్ లు దాఖలయ్యాయి. అయితే ఇప్పటి వరకూ 6.69 కోట్ల మేర ఐటీఆర్ లు మాత్రమే వెరిఫై అయ్యాయి. మిగిలినవి పెండింగ్ లోనే ఉన్నాయి. ఇలా పెండింగ్ లో ఉన్న ఖాతాలపై పెనాల్టీ పడుతుంది. అది వివిధ పన్ను చెల్లింపు దారులను బట్టి రూ. 5,000 వరకూ ఉంటుంది. ఈ నేపథ్యంలో ఇన్ కమ్ ట్యాక్స్ రిటర్న్ వెరిఫికేషన్ ఎలా చేయాలి తెలుసుకుందాం రండి..
ఐటీఆర్ వెరిఫికేషన్ ఇలా..
బ్యాంక్ ఖాతాతో ఈ-వెరిఫికేషన్: మీరు ఆదాయపు పన్ను రీఫండ్‌ల కోసం ముందుగా ధృవీకరించబడిన బ్యాంక్ ఖాతాను కలిగి ఉంటే, మీరు ఈ పద్ధతిని ఎంచుకోవచ్చు. దీన్ని చేయడానికి, మీరు మీ బ్యాంక్ ఏటీఎం నుంచి ఈవీసీ(ఎలక్ట్రానిక్ వెరిఫికేషన్ కోడ్)ని రూపొందించాలి. తర్వాత, మీరు మీ ఇ-ఫైలింగ్ ఖాతాకు లాగిన్ చేసి, “ఈ-వెరిఫై రిటర్న్” ఆప్షన్ ఎంచుకోవాలి. తర్వాత “బ్యాంక్ ఖాతా ద్వారా” ఆప్షన్ ఎంచుకుని, ఈవీసీని నమోదు చేయాలి. ప్రక్రియను పూర్తి చేయడానికి “ఈ-వెరిఫై” బటన్‌పై క్లిక్ చేయాలి.
ఏటీఎంతో ఈ-వెరిఫికేషన్: మీకు ముందుగా ధృవీకరించబడిన బ్యాంక్ ఖాతా లేకుంటే, మీరు ఇప్పటికీ మీ ఏటీఎం ద్వారా మీ ఐటీఆర్ ని వెరిఫై చేయొచ్చు. దీని కోసం సమీప ఏటీఎం సెంటర్ సెంటర్ కు వెళ్లి కార్డు పెట్టి, పిన్‌ను నమోదు చేయాలి. వచ్చిన ఆప్షన్లలో నుంచి ఆదాయపు పన్ను ఫైలింగ్ కోసం ఈవీసీని సృష్టించే ఆప్షన్ ఎంచుకోవాలి. మీ నమోదిత మొబైల్ నంబర్, ఈ-మెయిల్ చిరునామాకు ఈవీసీ వస్తుంది. తర్వాత మీ ఈ-ఫైలింగ్ ఖాతాకు లాగిన్ అవ్వాలి. ఈవీసీ ఇప్పటికే ఉన్న ఎంపికను ఎంచుకుని, దాన్ని నిర్ధారించండి.
ఆధార్ ఓటీపీతో ఈ-వెరిఫికేషన్: ఈ పద్ధతిలో వెరిఫికేషన్ చేయడనికి మీరు ఆధార్ నంబర్‌ను ఫోన్ నంబర్ లింక్ అయ్యి ఉండాలి. అది మీ పాన్‌తో లింక్ చేయాలి. ఆధార్ ఓటీపీని ఉపయోగించి మీ ఐటీఆర్ని ధృవీకరించడానికి, మీ ఇ-ఫైలింగ్ ఖాతాకు లాగిన్ చేసి, “ఈ-వెరిఫై రిటర్న్” ఆప్షన్ ఎంచుకోండి. మీ ఓటీపీని నమోదు చేసి, ప్రక్రియను పూర్తి చేయడానికి “కొనసాగించు”పై క్లిక్ చేయండి.
డీమ్యాట్ ఖాతాతో ఈ-వెరిఫికేషన్: ఈ పద్ధతిలో మీరు మీ పాన్‌తో లింక్ చేయబడిన డీమ్యాట్ ఖాతాను కలిగి ఉండాలి. డీమ్యాట్ ఖాతాను ఉపయోగించి మీ ఐటీఆర్ ని ధృవీకరించడానికి, మీ ఇ-ఫైలింగ్ ఖాతాకు లాగిన్ చేసి, “ఈ-వెరిఫై రిటర్న్” ఎంపికను ఎంచుకోండి. “డీమ్యాట్ ఖాతా” ఎంపికను ఎంచుకుని, మీ మొబైల్ నంబర్, ఇమెయిల్ ఐడీకి పంపబడిన ఈవీసీని నమోదు చేయాలి. ప్రక్రియను పూర్తి చేయడానికి “ఈ-వెరిఫై”పై క్లిక్ చేయాలి.
నెట్ బ్యాంకింగ్ సాయంతో ఈ-వెరిఫికేషన్: ఈ పద్ధతి ప్రకారం మీరు మీ పాన్‌తో అనుసంధానించబడిన నెట్ బ్యాంకింగ్ ఖాతాను కలిగి ఉండాలి. మీ ఇ-ఫైలింగ్ ఖాతాకు లాగిన్ చేసి, “ఈ-వెరిఫై రిటర్న్” ఎంపికను ఎంచుకోండి. మీ బ్యాంక్‌ని ఎంచుకుని, “త్రూ నెట్ బ్యాంకింగ్” ఎంపికను క్లిక్ చేయండి. మీ బ్రౌజర్ మిమ్మల్ని మీ బ్యాంక్ కోసం నెట్ బ్యాంకింగ్ లాగిన్ పేజీకి తీసుకెళ్తుంది. లాగిన్ అయిన తర్వాత, “కొనసాగించు” ఆప్షన్ ఎంచుకోండి. ఆపై “మీ ఐటీఆర్ ని ధృవీకరించండి.” మీరు ఎలక్ట్రానిక్ ఫైలింగ్ పోర్టల్‌కి వెళ్తారు. అక్కడ వెరిఫై పై క్లిక్ చేస్తే సరిపోతుంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..