Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Special FD Scheme: సీనియర్‌ సిటిజన్లకు అలెర్ట్‌.. ఆ బ్యాంక్‌ స్పెషల్‌ ఎఫ్‌డీ స్కీమ్‌లో చేరడానికి గడువు రెండు రోజులే

గతేడాది నుంచి ఆర్‌బీఐ తీసుకున్న చర్యల కారణంగా ఎఫ్‌డీలపై వడ్డీ రేటును అన్ని బ్యాంకుల గణనీయంగా పెంచాయి. అయితే గత రెండు త్రైమాసికాల నుంచి రెపో రేటును యథాతథంగా ఉంచడంతో ఈ పెంపునకు బ్రేక్‌ పడింది. అయినా కస్టమర్లను ఆకట్టుకోవడానికి అన్ని ‍బ్యాంకులు కొంతకాలం మాత్రమే చెల్లుబాటు అయ్యే ప్రత్యేక ఎఫ్‌డీ పథకాలను ప్రవేశపెట్టాయి. ముఖ్యంగా ప్రముఖ ప్రైవేట్‌ రంగ బ్యాంకు అయిన హెచ్‌డీఎఫ్‌సీ సీనియర్ సిటిజన్ కేర్ అని పిలిచే అధిక వడ్డీ రేటు కలిగిన ఎఫ్‌డీ పథకాన్ని సీనియర్ సిటిజన్‌ల కోసం ప్రవేశ పెట్టింది.

Special FD Scheme: సీనియర్‌ సిటిజన్లకు అలెర్ట్‌.. ఆ బ్యాంక్‌ స్పెషల్‌ ఎఫ్‌డీ స్కీమ్‌లో చేరడానికి గడువు రెండు రోజులే
Fixed Deposit
Follow us
Srinu

|

Updated on: Jul 05, 2023 | 7:00 PM

జీవితాంతం కష్టపడి సంపాదించికున్న సొమ్ముకు నమ్మకమైన రాబడి కోసం వివిధ పెట్టుబడి పథకాల్లో ఇన్వెస్ట్‌ చేస్తూ ఉంటారు. ముఖ్యంగా సీనియర్‌ సిటిజన్లు రిటైరయ్యాక వచ్చే సొమ్మును ఫిక్స్డ్‌ డిపాజిట్‌ వంటి పథకాల్లో పెట్టుబడి పెట్టడానికి ఆసక్తి చూపుతూ ఉంటారు. నమ్మకమైన రాబడితో పెట్టుబడికి భరోసా ఉంటుందనే అందరూ ఈ ఎఫ్‌డీల్లో పెట్టుబడిని ఎంచుకుంటూ ఉంటారు. వీరిని ఆకట్టుకోవడానికి బ్యాంకులు కూడా వివిధ ఆఫర్లను పెడుతూ ఉంటాయి. గతేడాది నుంచి ఆర్‌బీఐ తీసుకున్న చర్యల కారణంగా ఎఫ్‌డీలపై వడ్డీ రేటును అన్ని బ్యాంకుల గణనీయంగా పెంచాయి. అయితే గత రెండు త్రైమాసికాల నుంచి రెపో రేటును యథాతథంగా ఉంచడంతో ఈ పెంపునకు బ్రేక్‌ పడింది. అయినా కస్టమర్లను ఆకట్టుకోవడానికి అన్ని ‍బ్యాంకులు కొంతకాలం మాత్రమే చెల్లుబాటు అయ్యే ప్రత్యేక ఎఫ్‌డీ పథకాలను ప్రవేశపెట్టాయి. ముఖ్యంగా ప్రముఖ ప్రైవేట్‌ రంగ బ్యాంకు అయిన హెచ్‌డీఎఫ్‌సీ సీనియర్ సిటిజన్ కేర్ అని పిలిచే అధిక వడ్డీ రేటు కలిగిన ఎఫ్‌డీ పథకాన్ని సీనియర్ సిటిజన్‌ల కోసం ప్రవేశ పెట్టింది. ఈ పథకం బహుళ పొడిగింపుల తర్వాత త్వరలో ముగుస్తుందని మార్కెట్‌ వర్గాలు చెబుతున్నాయి. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ వెబ్‌సైట్ ప్రకారం ఈ పథకం జూలై 7, 2023తో ముగుస్తుంది. 

హెచ్‌డీఎఫ్‌సీ సీనియర్‌ సిటిజన్‌ కేర్‌ 

సీనియర్ సిటిజన్ కేర్ ఎఫ్‌డీ వారి టర్మ్ డిపాజిట్లపై అదనంగా 0.75 శాతం వడ్డీ రేటును అందిస్తుంది. ఈ పథకం మే 18, 2020న ప్రారంభించారు. అర్హత ఉన్న డిపాజిట్ కాలపరిమితి 5 సంవత్సరాల 1 రోజు నుంచి 10 సంవత్సరాల మధ్య ఉంటుంది. ఈ కాలంలో సీనియర్ సిటిజన్లు బుక్ చేసుకున్న కొత్త ఫిక్స్‌డ్ డిపాజిట్‌కి అలాగే రెన్యూవల్స్‌కు ఈ ప్రత్యేక ఆఫర్ వర్తిస్తుంది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ వెబ్‌సైట్ ప్రకారం ఐదేళ్ల పదవీకాలం కోసం రూ.5 కోట్ల కంటే తక్కువ ఫిక్స్‌డ్ డిపాజిట్‌ను బుక్ చేయాలనుకునే సీనియర్ సిటిజన్‌లకు 0.25 శాతం అదనపు ప్రీమియం ఇస్తారు.  అయితే ప్రత్యేక డిపాజిట్ ఆఫర్‌ సమయంలో ఐదు సంవత్సరాలు ఒక రోజు నుంచి 10 సంవత్సరాల డిపాజిట్లకు అదనపు వడ్డీ అందిస్తారు. అయితే ఆయా ఎఫ్‌డీలు నిర్ణీత సమయంలోపే తీసుకోవాలి.

వడ్డీ రేటు ఇలా

బ్యాంక్ ఇప్పుడు సీనియర్ సిటిజన్లకు 7 నుంచి 29 రోజులలో మెచ్యూర్ అయ్యే డిపాజిట్లపై 3.50% వడ్డీ రేటును అందిస్తోంది. అలాగే 30 నుంచి 45 రోజులలో మెచ్యూర్ అయ్యే డిపాజిట్లపై 4% వడ్డీ రేటును అందిస్తోంది.  46 నుంచి 6 నెలల లోపు డిపాజిట్లపై 5 శాతం, 6 నెలల 1 రోజుల నుంచి 9 నెలల లోపు డిపాజిట్లపై 6.25 శాతం వడ్డీ రేట్లను ఆఫర్ చేస్తుంది. 9 నెలల 1 రోజు నుంచి 1 సంవత్సరం వరకు మెచ్యూర్ అయ్యే ఫిక్స్‌డ్ డిపాజిట్లపై బ్యాంక్ 6.50 శాతం వడ్డీని చెల్లిస్తుంది. అయితే హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ 1 సంవత్సరం నుంచి 15 నెలల్లో మెచ్యూర్ అయ్యే డిపాజిట్లపై 7.10 శాతం వడ్డీని చెల్లిస్తుంది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ 15 నెలల నుంచి 18 నెలల లోపు డిపాజిట్లపై 7.60 శాతం, 18 నెలల నుంచి 4 సంవత్సరాల 7 నెలల లోపు మెచ్యూరిటీ డిపాజిట్లపై 7.50 శాతం వడ్డీ రేటును చెల్లిస్తుంది.4 సంవత్సరాల 7 నెలల నుంచి 55 నెలల కాలవ్యవధిపై బ్యాంక్ అత్యధిక వడ్డీ రేటు 7.75 శాతం వడ్డీని అందిస్తుంది. 5 సంవత్సరాల 1 రోజు నుండి 10 సంవత్సరాల వరకు బ్యాంక్ సీనియర్ సిటిజన్లకు 7.75 శాతం అందిస్తుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి