UPI Transaction Limit: HDFC, SBI, ICICI ఖాతాదారులకు అలర్ట్.. UPI రోజువారీ చెల్లింపుల లిమిట్ ఎంత ఉందో తెలుసా..
భారత డిజిటల్ ఆర్థిక వ్యవస్థ అత్యంత వేగంగా దూసుకుపోతోంది. భారతీయ బ్యాంకులు రోజు వారి చెల్లింపుల్లో పరిమితి ఏర్పాటు చేశాయి. ఇందులో ఏ బ్యాంక్ ఎంత వరకు పరిమితి పెట్టిందో ఓ సారి చూద్దాం..

భారత డిజిటల్ ఆర్థిక వ్యవస్థ అత్యంత వేగంగా దూసుకుపోతోంది. డిజిటల్ ఆర్థిక వ్యవస్థ పరిమాణం 2030 కల్లా 6 రెట్లు పెరిగి రూ.82 లక్షల కోట్లకు పైగా చేరే అవకాశం ఉందని ఓ రిపోర్టు తెలిపింది. 2016లో నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) ప్రవేశపెట్టినప్పటి నుంచి యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (UPI) లావాదేవీలు పెరుగుతున్నాయి. వరల్డ్‌లైన్ అందించిన నివేదిక ప్రకారం 2022లో UPI చెల్లింపులు రికార్డు స్థాయిలో రూ. 149.5 ట్రిలియన్ల UPI, కార్డ్ లావాదేవీలను నమోదు చేశాయి. కానీ, ఇప్పుడు, హెచ్‌టీ టెక్ నుంచి నివేదికల ప్రకారం, HDFC, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఐసీఐసీఐ వంటి బ్యాంకులు యూపీఏ లావాదేవీలపై పరిమితిని విధించాయి.
UPIలో బ్యాంక్ లావాదేవీ పరిమితి
ఒక వ్యక్తి యూపీఏ ద్వారా రోజుకు గరిష్టంగా రూ. 1 లక్ష చెల్లింపును ప్రారంభించవచ్చని పేర్కొంటూ ఎన్‌పీసీఏ.. UPI లావాదేవీల కోసం మార్గదర్శకాలను రూపొందించింది. యూపీఏ పరిమితి రూ. 25,000 లావాదేవీలను అనుమతించే కెనరా బ్యాంక్ వంటి చిన్న బ్యాంకుల నుండి రూ. 1 లక్ష పరిమితిని నిర్ణయించిన ఎస్బీఐ వంటి పెద్ద బ్యాంకుల వరకు మారుతూ ఉంటుంది.
హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ యూపీఏ లావాదేవీలపై రూ. 1 లక్ష పరిమితిని నిర్ణయించింది. కొత్త వినియోగదారుల కోసం.. యూపీఏ పరిమితి రూ. 5,000. ఐసీఐసీఐ కస్టమర్‌లు రూ. 10 వేల వరకు యూపీఏ చెల్లింపులు చేయవచ్చు. యాక్సిస్ బ్యాంక్ యూపీఏ చెల్లింపుల పరిమితిని రూ. 1 లక్షకు పరిమితం చేసింది. అయితే బ్యాంక్ ఆఫ్ బరోడా రూ. 25 వేలకి సెట్ చేసింది.
యూపీఏ లావాదేవీలపై విధించే డబ్బు పరిమితితో పాటు, ఎన్‌పీసీఏ రోజుకు లావాదేవీల సంఖ్యపై కూడా పరిమితిని విధించింది. నూతన నిబంధనల ప్రకారం, ఒక వ్యక్తి రోజుకు 20 లావాదేవీల వరకు అనుమతించబడతారు. లావాదేవీలను పునరుద్ధరించడానికి వారు 24 గంటలపాటు వేచి ఉండవలసి ఉంటుంది. అయితే, బ్యాంకులను బట్టి పరిమితి మారవచ్చు.
UPI యాప్ పరిమితి..
గూగుల్ పే, పేటీఎం, అమెజాన్ పే యూపీఏ అన్ని యూపీఏ యాప్‌లు, బ్యాంక్ ఖాతాలో మొత్తం పది లావాదేవీల పరిమితులతో పాటు రోజుకు రూ. 1 లక్ష పరిమితిని సెట్ చేశాయి.
అంతేకాకుండా, ఎవరైనా ₹2,000 మరియు అంతకంటే ఎక్కువ డబ్బు అభ్యర్థనలను పంపితే, రోజువారీ లావాదేవీ పరిమితిని జీ పే నిలిపివేస్తుంది. అమెజాన్ పేలో యూపీఏ మొదటి 24 గంటల్లో కొత్త కస్టమర్‌గా రూ. 5 వేల మాత్రమే లావాదేవీ చేయగలదు.
మరిన్ని బిజినెస్ న్యూస్ కోసం