Electric Vehicles: పెట్రోల్ ధరల మంటల నేపథ్యంలో ఎలక్ట్రానిక్ వాహనాలను ప్రోత్సహించే దారిలో రాష్ట్రాలు.. దిగివస్తున్న ధరలు..
Electric Vehicles: పెట్రోల్ డీజిల్ ధరలు రికార్డు స్థాయి పెరుగుదల నమోదు చేస్తూవస్తున్నాయి. దీంతో ప్రజలు ప్రత్యామ్నాయం వైపు చూస్తున్నారు. ప్రజలతో ప్రాటు ప్రభుత్వాలు కూడా ప్రత్యామ్నాయాలవైపు దృష్టి సారిస్తున్నాయి.
Electric Vehicles: పెట్రోల్ డీజిల్ ధరలు రికార్డు స్థాయి పెరుగుదల నమోదు చేస్తూవస్తున్నాయి. దీంతో ప్రజలు ప్రత్యామ్నాయం వైపు చూస్తున్నారు. ప్రజలతో ప్రాటు ప్రభుత్వాలు కూడా ప్రత్యామ్నాయాలవైపు దృష్టి సారిస్తున్నాయి. ఎలక్ట్రానిక్ వాహనాల (ఈవీ)ను ప్రోత్సహించే దిశలో ప్రభుత్వాలు ముందడుగు వేస్తున్నాయి. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఈవీల కు సబ్సిడీలు ప్రకటించింది. దీంతో పాటు ఇప్పుడు రాష్ట్రాలు కూడా సబ్సిడీలు ప్రకటిస్తున్నాయి. గత నెలలో మూడు పెద్ద రాష్ట్రాలు ఈ విషయాన్ని ప్రకటించగా, 20 రాష్ట్రాలు ఈ విధానాన్ని సిద్ధం చేస్తున్నాయి. ప్రోత్సాహకాలు ఇవ్వడం ప్రారంభించిన రాష్ట్రాల్లో, ఈవీల ధరలలో 40% వరకు భారీ తగ్గింపు ఉంది.
కేంద్ర ప్రభుత్వం జూలై ఆరంభంలో సబ్సిడీని ప్రకటించింది. కేంద్రం ‘ ఫాస్ట్ అడాప్షన్ అండ్ మాన్యుఫ్యాక్చరింగ్ ఆఫ్ ఎలక్ట్రిక్ వెహికల్స్’ (ఫేమ్ -2) పథకాన్ని 2024 మార్చి 31 వరకు రెండు సంవత్సరాల పాటు పొడిగించింది. ఇంతకుముందు ఈ పథకం 2022 ఏప్రిల్‌లో ముగియాల్సి ఉంది. కేంద్రం ఈ చర్య తీసుకున్న తరువాత రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ప్రజలకు తమ తమ స్థాయిలలో ఎలక్ట్రిక్ వాహనాలను కొనుగోలు చేయడాన్ని సులభతరం చేస్తున్నాయి. గత నెలలో మహారాష్ట్ర, గుజరాత్, రాజస్థాన్ ఈవీ ప్రోత్సాహక విధానాన్ని అమలు చేశాయి.
ఈ విధానం ఇప్పటికే మరో మూడు రాష్ట్రాల్లో అమలులో ఉంది. దీనితో ఈ రాష్ట్రాల్లో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల ధర దాదాపు సగానికి పడిపోయింది. 20 రాష్ట్రాలు ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహించే పనిలో ఉన్నాయి. ఈ రాష్ట్రాలు కూడా అలాంటి విధానం అమలు చేసినట్టయితే ఈవీలకు డిమాండ్ భారీగా పెరిగే అవకాశం ఉంది.
ఐదేళ్లలో 50 లక్షలకు పైగా ఎలక్ట్రిక్ వాహనాలు..
ఈ రాయితీలతో ఈవీ కంపెనీలు ఉత్సాహంగా ఉన్నాయి. ఇది ఎక్కువ మంది ఎలక్ట్రిక్ వాహనాలను ఉపయోగించడాన్ని ప్రోత్సహిస్తుందని కంపెనీల ప్రతినిధులు చెబుతున్నారు. రివాల్ట్ బ్రాండ్ ఎలక్ట్రిక్ మోటారుబైక్‌లను తయారుచేసే సంస్థ రతన్ ఇండియా ఎంటర్‌ప్రైజెస్ చైర్మన్ అంజలి రతన్ మాట్లాడుతూ, వచ్చే ఐదేళ్లలో 5 మిలియన్లకు పైగా ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలు దేశ రహదారులపై నడుస్తాయని భావిస్తున్నామన్నారు. రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే ప్రోత్సాహకాల వల్ల ఈ లక్ష్యాన్ని ఇంకా ముందే సాధించవచ్చని ఆయన అంటున్నారు.
ఇప్పటివరకు ఏ వాహనాన్ని కొనుగోలు చేయని వారు ఎలక్ట్రిక్ వాహనం కొనాలని ఆలోచించేలా ఈ రాయతీలు చేస్తాయని వర్డ్‌విజార్డ్ ఇన్నోవేషన్స్ అండ్ మొబిలిటీ సిఇఓ షీతల్ భలేరావ్ అభిప్రాయపడ్డారు.. ఈ నిర్ణయం ఎలక్ట్రిక్ వాహనాలను సామాన్య ప్రజలకు మరింత దగ్గరగా తీసుకువెళుతుందన్నారు. ప్రజలకు దీనివలన ఉపశమనం లభిస్తుంది. ఎందుకంటే, ఇంధన ధరల పెరుగుదల కారణంగా వీరి కోసం రాకపోకలు ఖరీదైనవిగా మారాయని ఆయన చెప్పారు.
రాయితీలతో ఎలక్ట్రిక్ వాహనాల ధర బాగా తగ్గుతుంది. ఇందుకు గుజరాత్ లో రివాల్ట్ బైక్ ధరలను పరిశీలిస్తే..
దీని అసలు ధర – 1,55,000 రూపాయలు. దీనికి కేంద్రం 48,000 రూపాయల రాయితీ ఇచ్చింది. ఈ రాయతీకి అదనంగా రాష్ట్ర ప్రభుత్వం 20,000 రూపాయల సబ్సిడీ ఇస్తోంది. దీంతో రివాల్ట్ బైక్ గుజరాత్ లో 88,000 రూపాయలకే లభిస్తోంది. అంటే ఈ ఈ బైక్ పై మొత్తం 68,000 రూపాయలు ఆదా అవుతోంది వినియోగదారులకు.