Adani Wilmar: రూ. 50 వేల కోట్లకు చేరిన కంపెనీ విలువ.. మార్కెట్లోకి వచ్చిన మూడు రోజులకే..

Adani Wilmar: రెండు రోజుల క్రితం అదానీ గ్రూప్ కంపెనీ అదానీ విల్మర్ ఎన్ఎస్ఈ, బీఎస్ఈలో లిస్టైంది. అందరి అంచనాలను తలకిందులు చేస్తూ డిస్కౌంట్ ధరకు మార్కెట్ లోకి అరంగేట్రం చేసింది..

Adani Wilmar: రూ. 50 వేల కోట్లకు చేరిన కంపెనీ విలువ.. మార్కెట్లోకి వచ్చిన మూడు రోజులకే..
Adani Wilmar
Follow us
Ayyappa Mamidi

|

Updated on: Feb 10, 2022 | 10:09 PM

Adani Wilmar: రెండు రోజుల క్రితం అదానీ గ్రూప్ కంపెనీ అదానీ విల్మర్ ఎన్ఎస్ఈ, బీఎస్ఈలో లిస్టైంది. అందరి అంచనాలను తలకిందులు చేస్తూ డిస్కౌంట్ ధరకు మార్కెట్ లోకి అరంగేట్రం చేసింది. కానీ లిస్ట్ అయిన నాటి నుంచి(ఫిబ్రవరి 8).. షేర్ ధర తగ్గకుండా పైపైకి పోతూ రికార్డు సృష్టించింది. నేడు కంపెనీ మార్కెట్ విలువ రూ. 50 వేల కోట్లు దాటి అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. నేడు షేర్ ధర ఎన్ఎస్ఈ లో 20 శాతం అప్పర్ సర్కూట్ లో లాక్ అయి.. షేర్ క్లోజింగ్ ధర రూ. 386.25 వద్ద అంతిమంగా ముగిసింది. దీంతో కంపెనీ విలువ రూ. 50,200 కోట్లకు చేరింది. వరుసగా మూడు ట్రేడింగ్ సెషన్లలో లాభాలతో ముగిసింది. ఇక బిఎస్ఈలో షేర్ 20 శాతం అప్పర్ సర్కూట్ లో లాక్ అయి..రూ. 381.80 వద్ద క్లోజింగ్ ధరను నమోదు చేసింది.

అదానీ విల్మర్ కంపెనీ సింగపూర్ సంస్థ విల్మర్.. భారత్ కు చెందిన అదానీల సంయుక్త కంపెనీ. రెండు కంపెనీలు సమాన వాటాతో కంపెనీని ప్రస్తుతం నడుపుతున్నాయి. గతంలో అదానీ కంపెనీల్లో పెట్టుబడుల విషయంలో అవకతవకలు జరిగాయంటూ ఆరోపణలు రావడంతో.. అప్పట్లో రావాల్సిన అదానీ విల్మర్ ఐపీవో తాజాగా మార్కెట్ లోకి అడుగుపెట్టింది.

ఇదీ చదవండి..

Anand Mahindra: ట్విట్టర్ లో ఆనంద్ మహీంద్రా ఆసక్తికర పోస్ట్.. వాటిని అలా చేయాల్సిందంటూ సూచన..

Customer Charges Hike: వినియోగదారులకు అలర్ట్.. కార్డు వినియోగ ఛార్జీలు పెంచిన బ్యాంకిగ్ దిగ్గజం