Aadhaar Number: మీ ఆధార్‌ కార్డు వెంట తీసుకెళ్లలేదా..? నంబర్‌ మర్చిపోయారా..? టెన్షన్ లేదు.. ఇలా చేయండి

ఈ రోజులలో ఆధార్‌ ముఖ్యమైన డాక్యుమెంట్‌గా మారిపోయింది. ప్రతిదానికి ఆధార్‌ తప్పనిసరి కావాల్సిందే. సిమ్‌కార్డు తీసుకోవడం నుంచి బ్యాంకు అకౌంట్‌, ఇతర పథకాలకు అన్నింటికి..

Aadhaar Number: మీ ఆధార్‌ కార్డు వెంట తీసుకెళ్లలేదా..? నంబర్‌ మర్చిపోయారా..? టెన్షన్ లేదు.. ఇలా చేయండి
Aadhar Number
Follow us
Subhash Goud

|

Updated on: Jan 04, 2023 | 6:20 AM

ఈ రోజులలో ఆధార్‌ ముఖ్యమైన డాక్యుమెంట్‌గా మారిపోయింది. ప్రతిదానికి ఆధార్‌ తప్పనిసరి కావాల్సిందే. సిమ్‌కార్డు తీసుకోవడం నుంచి బ్యాంకు అకౌంట్‌, ఇతర పథకాలకు అన్నింటికి ఆధార్‌ కావాల్సిందే. ఇది లేనిది ఏ పని జరగని పరిస్థితి ఉంది. అయితే కొన్ని సందర్భాలలో ఆధార్‌ కార్డు వెంట ఉంచుకోవడం మార్చిపోతుంటారు. ఆధార్‌ నంబర్‌ గుర్తుకు ఉండదు. ఇలాంటి సందర్భాలలో టెన్షన్‌ పడాల్సిన పరిస్థితి ఉంటుంది. అయితే కొన్ని సులభమైన మార్గాల ద్వారా ఆధార్‌ నంబర్‌ను తెలుసుకోవచ్చు. అయితే మీ ఆధార్‌కు మీ ఫోన్‌ నెంబర్‌ లింక్‌ అయి ఉండటం తప్పనిసరి. అప్పుడు ఆధార్‌ లేకున్నా నంబర్‌ తెలుసుకునేందుకు అవకాశం ఉంటుంది.

  • ముందుగా స్మార్ట్‌ఫోన్ లేదా కంప్యూట‌ర్‌లో బ్రౌజ‌ర్ ఓపెన్ చేసి యూఐడీఏఐ అధికారిక వెబ్‌సైట్ ఓపెన్ చేయాలి.
  • అనంత‌రం వెబ్‌సైట్‌లోని ‘మై ఆధార్’ సెక్షన్‌లోని ‘ఆధార్ స‌ర్వీసెస్’పై క్లిక్ చేసి.. అందులో ఉన్న ‘రిట్రైవ్ లాస్ట్ ఆర్ ఫర్గాటెన్ ఈఐడీ/యూఐడీ’ అనేదానిపై క్లిక్ చేయాలి.
  • త‌ర్వాత ఓపెన్ అయిన కొత్త పేజీలో ఆధార్ నంబ‌ర్ (యూఐడీ)ని సెల‌క్ట్ చేసుకోవాలి.
  • అనంత‌రం మీ రిజిస్టర్ మొబైల్ నెంబ‌ర్ లేదా ఈమెయిల్ ఐడీని నమోదు చేయాలి.
  • ఇక అక్కడే ఉన్న క్యాప్చా కోడ్‌ను ఎంట‌ర్ చేసి.. సెండ్ ఓటీపీపై క్లిక్ చేయాలి.
  • మీ రిజిస్టర్డ్‌ మొబైల్‌కు వ‌చ్చిన ఓటీపీని ఎంట‌ర్ చేసి ఎంట‌ర్ నొక్కాలి. దీంతో మొబైల్ నెంబ‌ర్‌కు ఆధార్ నెంబ‌ర్ మెసేజ్ రూపంలో వ‌స్తుంది. ఇలా సింపుల్‌గా మర్చిపోయిన ఆధార్‌ నంబర్‌ను తెలుసుకోవచ్చు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి