AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pan Card Scam: పాన్ కార్డు అప్‌డేట్ పేరుతో కొంప ముంచేస్తున్నారు.. వెలుగులోకి నయా స్కామ్

పెరుగుతున్న టెక్నాలజీని వాడుకుని ప్రజలను మోసగించే వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతుంది. ప్రజలు కూడా ఇలాంటి మోసాలపై అప్రమత్తంగా ఉన్నా మోసగాళ్లు ఎప్పటికప్పుడు కొత్త పంథాను ఎంచుకుంటున్నారు. తాజాగా మరో స్కామ్ వెలుగులోకి వచ్చింది. పాన్ కార్డు అప్‌డేట్ పేరుతో కేటుగాళ్లు బ్యాంకుల్లో సొమ్మును తస్కరిస్తున్నారు. ఈ పాన్ కార్డు గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం.

Pan Card Scam: పాన్ కార్డు అప్‌డేట్ పేరుతో కొంప ముంచేస్తున్నారు.. వెలుగులోకి నయా స్కామ్
Pan Card
Nikhil
|

Updated on: Jan 16, 2025 | 3:39 PM

Share

ఇటీవల కాలంలో ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ (ఐపీపీబీ) కస్టమర్‌లు తమ పాన్ కార్డ్ వివరాలను అప్‌డేట్ చేయనందుకు 24 గంటల్లో తమ బ్యాంక్ ఖాతాలను బ్లాక్ చేసినట్లు మెసేజ్‌లు వస్తున్నాయి. అంతేకాకుండా ఆ మెసేజ్‌లో అనుమానాస్పద లింక్‌లు ఉంటున్నాయని, వాటి ద్వారా పాన్ కార్డు వివరాలను అప్‌డేట్ చేయాలని సూచిస్తున్నాయి. అయితే ఆ మెసేజ్‌లను ఎవరైనా క్లిక్ చేస్తే స్కామ్ వెబ్‌సైట్‌లకు రీ డైరెక్ట్ చేస్తున్నాయి. ముఖ్యంగా స్కామర్‌లు ఫిషింగ్ టెక్నిక్‌లను ఉపయోగించి సున్నితమైన సమాచారాన్ని బహిర్గతం చేస్తున్నారు. ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (పీఐబీ) ఈ సందేశాలను ఫేక్ అని స్పష్టం చేసింది. ఇండియా పోస్ట్ అటువంటి హెచ్చరికలను పంపదని స్పష్టం చేసింది. అనుమానాస్పద లింక్‌లపై క్లిక్ చేయడం లేదా వ్యక్తిగత సమాచారాన్ని పంచుకోవడం మానుకోవాలని ప్రజలకు సూచించింది. సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ఎక్స్‌లో ఈ మేరకు పోస్ట్ చేసింది. 

ఫిషింగ్ స్కామ్ ద్వారా స్కామర్లు పాస్‌వర్డ్‌లు, బ్యాంక్ వివరాలు లేదా క్రెడిట్ కార్డ్ నంబర్‌ల వంటి వ్యక్తిగత సమాచారాన్ని సేకరిస్తారు. సాధారణంగా మీ బ్యాంక్ లేదా షాపింగ్ వెబ్‌సైట్ వంటి విశ్వసనీయ సంస్థల నుంచి వచ్చినట్లుగా కనిపించే నకిలీ ఈ-మెయిల్‌లు, సందేశాలు లేదా లింక్‌లను పంపుతారు. మీరు ఆ లింక్‌లపై క్లిక్ చేస్తే లేదా మీ వివరాలను ఇచ్చినట్లయితే, స్కామర్‌లు మీ సమాచారాన్ని దొంగిలించి, మీకు హాని కలిగించేలా ఉపయోగించవచ్చు. 

ఇవి కూడా చదవండి

ఈ టిప్స్ పాటించాల్సిందే 

  • ఐపీపీబీ వినియోగదారులు అనవసరంగా పాన్ వివరాలను పంచుకోవడం మానుకోవాలని సూచిస్తున్నారు. కచ్చితంగా అవసరమైనప్పుడు మాత్రమే మీ పాన్ కార్డ్ వివరాలను విశ్వసనీయ, ధృవీకరించబడిన సంస్థలు లేదా ప్లాట్‌ఫారమ్‌లతో షేర్ చేయాలి.
  • ముఖ్యంగా తెలియని మూలాల నుంచి ఈ-మెయిల్‌లు లేదా సందేశాలలోని లింక్‌లపై క్లిక్ చేయడం మానుకోవాలి. క్లిక్ చేయడానికి ముందు లింక్‌లు ఎక్కడికి దారితీస్తాయో తనిఖీ చేయడానికి వాటిపై హోవర్ చేయండి. 
  • అత్యవసర అభ్యర్థనలు, బెదిరింపులు లేదా ఆఫర్‌ల పట్ల జాగ్రత్త వహించాలి. మిమ్మల్ని మోసగించడానికి స్కామర్‌లు తరచుగా భయపెట్టడానికి ప్రయత్నిస్తారు కాబట్టి జాగ్రత్తగా ఉండాలి.
  • మీ ఫోన్‌కి ఏదైనా మెసేజ్ వస్తే ముఖ్యంగా కోడ్ వంటి రెండవ ధ్రువీకరణ దశ అవసరం, హ్యాకర్‌లకు మీ పాస్‌వర్డ్ తెలిసినప్పటికీ మీ ఖాతాలను యాక్సెస్ చేయడం కష్టమవుతుంది. 

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి