AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

JSW Steel: ట్రంక్ పెట్టెలో పాత పేపర్లు అనుకునేరు.. 30 ఏళ్ల క్రితం రూ. లక్ష.. ఇప్పుడు రూ. 85 కోట్లు

స్టాక్ మార్కెట్ అంటేనే చాలామంది భయపడుతుంటారు. కానీ మంచి షేర్స్ లో ఇన్వెస్ట్ చేసినట్లయితే.. మీ డబ్బు ఎక్కడికి పోదు.. దానికి ఉదాహరణ ఇది. ఓ వ్యక్తి తండ్రి JSW షేర్స్.. ఎప్పుడో 30 ఏళ్ల క్రితం కొనుగోలు చేయగా.. అవి ప్రస్తుతం వాల్యూ బట్టి..

JSW Steel: ట్రంక్ పెట్టెలో పాత పేపర్లు అనుకునేరు.. 30 ఏళ్ల క్రితం రూ. లక్ష.. ఇప్పుడు రూ. 85 కోట్లు
Jindal Vijayanagar Shares
Ravi Kiran
|

Updated on: Nov 14, 2025 | 1:49 PM

Share

స్టాక్ మార్కెట్ అనేది ఓ వైకుంఠపాళీ. ఏ సమయంలో పాముకు చిక్కుతామో.. ఏ సమయంలో నిచ్చెన ఎక్కుతామో ఎవ్వరం చెప్పలేం. అయితే ఇక్కడ పామును హైరిస్క్-హైరివార్డు స్టాక్స్‌తో పోల్చితే.. మంచి స్టాక్స్ నిచ్చెన అనుకోవచ్చు. అంటే.. మంచి స్టాక్స్ కొంటే ఎప్పటికైనా లాభాల బాట పడతామని అర్ధం. సరిగ్గా ఇందుకు నిదర్శనంగా ఈ ఉదాహరణ నిలుస్తుంది. ఓ వ్యక్తి తన తండ్రి దాచిపెట్టిన స్టాక్స్ ఇప్పుడు వెలికితీయగా.. అవి ఏకంగా రూ. 85 కోట్లు పలుకుతాయని తేలింది.

పోస్ట్ ప్రకారం.. సదరు వ్యక్తి తండ్రి జిందాల్ విజయనగర్ స్టీల్‌ సంస్థ 5 వేల షేర్స్ 1995లో కొనుగోలు చేశాడు. అవి అప్పుడు రూ. లక్ష కాగా.. ఇప్పుడు ఆ షేర్స్ విలువ ఏకంగా రూ. 85 కోట్లుగా తేలింది. అదెలాగని ఆలోచిస్తున్నారా.?

2005లో, JVSL.. JSW స్టీల్‌తో విలీనం అయింది. ఆ సమయంలో JVSLలో 1 షేర్ ఉన్న ప్రతీ వ్యక్తికి 16 JSW షేర్లు లభించాయి. అంటే..! ఈ 5 వేల షేర్స్ కాస్తా.. 80 వేల షేర్స్‌గా మారాయి. ఆ తర్వాత JSW 1:10 స్టాక్ స్ప్లిట్ అవ్వడంతో.. అవి 8 లక్షల JSW స్టీల్ షేర్స్‌గా మారాయి. ఇప్పుడు వాటి విలువ రూ. 80.4 కోట్లు కాగా.. డివిడెండ్స్ రూపంలో మరో రూ. 5 కోట్లు వచ్చాయి. వెరిసి మొత్తం షేర్స్ వాల్యూ రూ. 85 కోట్లు అయింది. చూశారా.! కాంపౌండ్ ఇన్వెస్టింగ్ అంటే ఇదే.. మంచి షేర్స్‌లో పెట్టుబడి పెడితే.. కచ్చితంగా మనకు లక్షలు వచ్చిపడతాయి.

Follow Us