AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పీఎఫ్ ఖాతాదారులకు గుడ్ న్యూస్.. ఇక నుంచి ఏటీఎం, యూపీఐ ద్వారా పీఎఫ్ నిధులు విత్ డ్రా..!

ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) తన కోట్లాది మంది చందాదారుల కోసం ఒక చారిత్రాత్మక నిర్ణయం తీసుకోబోతోంది. మే నెలాఖరు నాటికి, పీఎఫ్ ఖాతాదారులు తమ నిధులను ఏటీఎం, యూపీఐ ద్వారా విత్‌డ్రా చేసుకునే వెసులుబాటు కల్పించనుంది. సుమారు 7.8 కోట్ల మంది ఉద్యోగులకు ప్రయోజనం చేకూర్చే ఈ నిర్ణయం, పీఎఫ్ ఉపసంహరణ ప్రక్రియలో ఉన్న జాప్యాన్ని మరియు కాగితపు పనిని పూర్తిగా తొలగించనుంది.

పీఎఫ్ ఖాతాదారులకు గుడ్ న్యూస్.. ఇక నుంచి ఏటీఎం, యూపీఐ ద్వారా పీఎఫ్ నిధులు విత్ డ్రా..!
Pf Funds Withdraw
Balaraju Goud
|

Updated on: May 09, 2026 | 3:27 PM

Share

ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) తన కోట్లాది మంది చందాదారుల కోసం ఒక చారిత్రాత్మక నిర్ణయం తీసుకోబోతోంది. మే నెలాఖరు నాటికి, పీఎఫ్ ఖాతాదారులు తమ నిధులను ఏటీఎం (ATM), యూపీఐ (UPI) ద్వారా విత్‌డ్రా చేసుకునే వెసులుబాటు కల్పించనుంది. సుమారు 7.8 కోట్ల మంది ఉద్యోగులకు ప్రయోజనం చేకూర్చే ఈ నిర్ణయం, పీఎఫ్ ఉపసంహరణ ప్రక్రియలో ఉన్న జాప్యాన్ని మరియు కాగితపు పనిని పూర్తిగా తొలగించనుంది.

ఏమిటీ EPFO 3.0 ప్రాజెక్ట్?

ప్రావిడెంట్ ఫండ్ ప్రక్రియను పూర్తిగా డిజిటలైజ్ చేయడం, వేగవంతం చేయడం, పారదర్శకతను పెంచడం లక్ష్యంగా ‘EPFO 3.0’ ప్రాజెక్ట్‌ను ప్రభుత్వం చేపట్టింది. ఈ వ్యవస్థ 2026 మధ్య నాటికి పూర్తిస్థాయిలో అందుబాటులోకి రానుంది. దీనివల్ల క్లెయిమ్‌ల సెటిల్‌మెంట్ సమయం గణనీయంగా తగ్గుతుంది. ప్రస్తుతం పీఎఫ్ డబ్బు రావడానికి 10 నుండి 20 రోజులు పడుతోంది. కొత్త విధానంలో ఇది కేవలం 2 నుండి 5 రోజులకు తగ్గుతుంది. రూ. 5 లక్షల వరకు ఉన్న క్లెయిమ్‌లు ఎటువంటి మానవ ప్రమేయం లేకుండా ఆటోమేటిక్‌గా ప్రాసెస్ చేయడం జరుగుతుంది. ఇకపై ఆధార్ ధృవీకరించిన ఖాతాలకు పాస్‌బుక్ లేదా చెక్కుల ఫోటోలు అప్‌లోడ్ చేయాల్సిన అవసరం ఉండదు.

నగదు ఉపసంహరణ ఎలా?

కొత్త విధానం ప్రకారం, సభ్యులకు వారి పీఎఫ్ ఖాతాతో అనుసంధానించిన ఒక ప్రత్యేక ఏటీఎం కార్డు జారీ చేయడం జరుగుతుంది.

1. ATM ఉపసంహరణ: ఈ కార్డు ద్వారా నేరుగా ఏటీఎం మెషీన్ల నుండి నగదు తీసుకోవచ్చు.

2. UPI బదిలీ: గూగుల్ పే, ఫోన్ పే వంటి యాప్‌ల ద్వారా పీఎఫ్ నిధులను నేరుగా బ్యాంకు ఖాతాకు బదిలీ చేసుకోవచ్చు.

3. పరిమితి: ప్రాథమిక దశలో గరిష్టంగా రూ. 1 లక్ష వరకు విత్‌డ్రా చేసుకునే అవకాశం ఉంటుందని అంచనా.

ఉద్యోగం మారినప్పుడు ఆటోమేటిక్ బదిలీ

చాలామంది ఉద్యోగం మారినప్పుడు పాత కంపెనీ నుండి కొత్త కంపెనీకి పీఎఫ్ బదిలీ చేసుకోవడానికి ఇబ్బందులు పడేవారు. EPFO 3.0 ద్వారా, ఉద్యోగి మారిన వెంటనే పీఎఫ్ బ్యాలెన్స్ ఆటోమేటిక్‌గా కొత్త యజమానికి బదిలీ అవుతుంది. దీనివల్ల పాత కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం ఉండదు.

అర్హతలు – నిబంధనలు

ఈ సదుపాయాన్ని పొందాలంటే కొన్ని నిబంధనలు పాటించాలి:

* సభ్యుని UAN (Universal Account Number) యాక్టివ్‌గా ఉండాలి.

* ఖాతాకు ఆధార్, పాన్ (PAN), బ్యాంక్ ఖాతా అనుసంధానమై (KYC) ఉండాలి.

* ఉద్యోగం కోల్పోయిన వారు నెల రోజుల తర్వాత 75% నిధులను, రెండు నెలల తర్వాత మిగిలిన 25% నిధులను విత్‌డ్రా చేసుకోవచ్చు.

పీఎఫ్ అనేది పదవీ విరమణ కాలం నాటి ప్రధాన పొదుపు అని నిపుణులు గుర్తు చేస్తున్నారు. దీనిపై వచ్చే చక్రవడ్డీ భవిష్యత్తులో పెద్ద మొత్తాన్ని అందిస్తుంది. కాబట్టి, అత్యవసరమైతేనే డబ్బు తీయడం ఉత్తమం. వరుసగా ఐదేళ్ల సర్వీసు పూర్తి చేసిన తర్వాత పీఎఫ్ విత్‌డ్రా చేస్తే దానిపై ఎటువంటి ఆదాయపు పన్ను ఉండదు. ఈ సరికొత్త మార్పులతో సామాన్య ఉద్యోగులకు తమ సొంత డబ్బుపై పూర్తి నియంత్రణ లభించనుంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us