AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vande Bharat Trains: రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌.. ఈ మార్గాల్లో కొత్తగా మరో 4 వందే భారత్‌ రైళ్లు!

Vande Bharat Trains: ప్రస్తుతం నడుస్తున్న ప్రత్యేక రైళ్లతో పోలిస్తే రైలు ప్రయాణికులకు సుమారు 2 గంటల 40 నిమిషాలు ఆదా అవుతుంది. ఈ కొత్త వందే భారత్ ఎక్స్‌ప్రెస్ వారణాసి, ప్రయాగ్‌రాజ్, చిత్రకూట్, ఖజురహో వంటి ముఖ్యమైన మత, సాంస్కృతిక..

Vande Bharat Trains: రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌.. ఈ మార్గాల్లో కొత్తగా మరో 4 వందే భారత్‌ రైళ్లు!
Subhash Goud
|

Updated on: Nov 07, 2025 | 5:00 PM

Share

Vande Bharat Trains: భారత ప్రభుత్వం దేశంలోని ఆధునిక రైలు నెట్‌వర్క్‌ను వేగంగా విస్తరిస్తోంది. ఈ లక్ష్యంతో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నవంబర్ 8న ఉదయం 8:15 గంటలకు వారణాసిలో నాలుగు కొత్త వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను జెండా ఊపి ప్రారంభిస్తారు. పీఎంవో ప్రకారం.. కొత్త వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు వారణాసి-ఖజురహో, లక్నో-సహరాన్‌పూర్, ఫిరోజ్‌పూర్-ఢిల్లీ, ఎర్నాకులం-బెంగళూరు మార్గాల్లో నడుస్తాయి. కీలక గమ్యస్థానాల మధ్య ప్రయాణ సమయాన్ని గణనీయంగా తగ్గించడం ద్వారా ప్రయాణికులకు ఎంతగానో మేలు జరుగనుంది. దీని వల్ల పర్యాటకాన్ని పెంచుతాయి. అలాగే దేశవ్యాప్తంగా ఆర్థిక కార్యకలాపాలను పెంచుతాయి. ప్రపంచ స్థాయి రైలు సేవల ద్వారా పౌరులకు సజావుగా, వేగంగా, మరింత సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందించాలనే ప్రధానమంత్రి దార్శనికతను సాకారం చేసుకోవడంలో ఇది మరొక ముఖ్యమైన మైలురాయి.

ఇది కూడా చదవండి: Traffic Rules: మీరు హైదరాబాద్‌లో రాంగ్‌ రూట్లో వెళ్తున్నారా? ఇక మీ పని అంతే..!

4 కొత్త వందే భారత్ రైళ్ల మార్గాలు

ఇవి కూడా చదవండి
  • ఫిరోజ్‌పూర్ నుండి ఢిల్లీ
  • లక్నో నుండి సహరాన్‌పూర్
  • బనారస్ నుండి ఖజురహో
  • ఎర్నాకుళం నుండి బెంగళూరు

బనారస్-ఖజురహో వందే భారత్ ఎక్స్‌ప్రెస్:

బనారస్-ఖజురహో వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు ఈ రెండు చారిత్రక ప్రదేశాలను నేరుగా కలుపుతుంది. ప్రస్తుతం నడుస్తున్న ప్రత్యేక రైళ్లతో పోలిస్తే రైలు ప్రయాణికులకు సుమారు 2 గంటల 40 నిమిషాలు ఆదా అవుతుంది. ఈ కొత్త వందే భారత్ ఎక్స్‌ప్రెస్ వారణాసి, ప్రయాగ్‌రాజ్, చిత్రకూట్, ఖజురహో వంటి ముఖ్యమైన మత, సాంస్కృతిక ప్రదేశాలను నేరుగా కలుపుతుంది. ఇది మతపరమైన, సాంస్కృతిక పర్యాటకాన్ని ప్రోత్సహించడమే కాకుండా, యాత్రికులు, ప్రయాణికులకు యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశమైన ఖజురహోకు ఆధునిక, సౌకర్యవంతమైన రైలు కనెక్టివిటీని అందిస్తుందని ప్రభుత్వం ఆశిస్తోంది.

లక్నో-సహరాన్‌పూర్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్:

లక్నో నుండి సహరాన్‌పూర్ వరకు నడిచే వందే భారత్ ఎక్స్‌ప్రెస్ తన ప్రయాణాన్ని దాదాపు 7 గంటల 45 నిమిషాల్లో పూర్తి చేస్తుంది. ప్రస్తుత ప్రత్యేక రైళ్లతో పోలిస్తే దాదాపు 1 గంట ఆదా అవుతుంది. ఈ కొత్త వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు లక్నో, సీతాపూర్, షాజహాన్‌పూర్, బరేలీ, మొరాదాబాద్, బిజ్నోర్, సహరాన్‌పూర్ ప్రయాణికులకు ప్రయోజనం చేకూరుస్తుంది. ఇది రూర్కీ ద్వారా హరిద్వార్‌కు ప్రముఖ్యతను కూడా మెరుగుపరుస్తుంది. ఇది మధ్య, పశ్చిమ ఉత్తరప్రదేశ్‌లో రైలు కనెక్టివిటీని బలోపేతం చేస్తుంది.

ఫిరోజ్‌పూర్-ఢిల్లీ వందే భారత్:

ఈ మార్గంలో అత్యంత వేగవంతమైన రైలు ఫిరోజ్‌పూర్-ఢిల్లీ వందే భారత్ రైలు, 6 గంటల 40 నిమిషాల్లో తన ప్రయాణాన్ని పూర్తి చేస్తుంది. ఈ రైలు దేశ రాజధాని, పంజాబ్‌లోని ప్రధాన నగరాలైన ఫిరోజ్‌పూర్, బటిండా, పాటియాలా మధ్య కనెక్టివిటీని బలోపేతం చేస్తుంది. ఇది వాణిజ్యం, పర్యాటకం రెండింటికీ ప్రయోజనం చేకూరుస్తుందని భావిస్తున్నారు.

ఎర్నాకులం-బెంగళూరు వందే భారత్:

ఎర్నాకుళం-బెంగళూరు వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు ప్రారంభంతో ఈ రెండు ముఖ్యమైన నగరాల మధ్య ప్రయాణాన్ని 8 గంటల 40 నిమిషాల్లో పూర్తి చేయవచ్చు. ఇది ప్రస్తుత ప్రత్యేక రైళ్లతో పోలిస్తే 2 గంటల కంటే తక్కువ సమయం. ఈ కొత్త వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు ప్రధాన ఐటీ, వాణిజ్య కేంద్రాలను కలుపుతుంది. ఐటీ నిపుణులు, విద్యార్థులు, పర్యాటకులకు వేగవంతమైన ప్రయాణ ఎంపికను అందిస్తుంది. ఈ మార్గం కేరళ, తమిళనాడు, కర్ణాటక మధ్య ఆర్థిక కార్యకలాపాలు, పర్యాటకాన్ని పెంచుతుందని భావిస్తున్నారు.

ఇది కూడా చదవండి: Jio Plans: జియోలో కేవలం రూ.150లోపే అద్భుతమైన ప్లాన్స్‌.. 28 రోజుల వ్యాలిడిటీ!

ఇది కూడా చదవండి: PM Kisan: పీఎం కిసాన్‌ 21వ విడత డబ్బులు ఎప్పుడు వస్తాయో తెలుసా?

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి