Wedding Bells: దేశవ్యాప్తంగా నెల రోజుల వ్యవధిలో 25 లక్షలకు పైగా పెళ్లిళ్లు.. ఎంత వ్యాపారం జరిగిందో తెలిస్తే షాక్!
Wedding Bells: భారత దేశంలో పెళ్లి వేడుక అంటే .. సామాన్యుల నుంచి ధనవంతుల వరకూ తమ స్థాయికి తగినట్లు చేస్తారు. ఈ విషయం ప్రపంచం మొత్తం తెలుసు. వివాహ వేడుక అంటే..
Wedding Bells: భారత దేశంలో పెళ్లి వేడుక అంటే .. సామాన్యుల నుంచి ధనవంతుల వరకూ తమ స్థాయికి తగినట్లు చేస్తారు. ఈ విషయం ప్రపంచం మొత్తం తెలుసు. వివాహ వేడుక అంటే.. కేవలం ఇద్దరు వ్యక్తులను ఏకంచేసేదే కాదు.. రెండు కుటుంబాలను కలిపేది. అయితే ఈ పెళ్లి వేడుక మొదలైంది అంటే.. వస్త్ర పరిశ్రమ, క్యాటరింగ్, వెడ్డింగ్ హాల్స్, బ్యాండ్ , ఇలా అనేక సంస్థలకు పనిదొరికినట్లే..
అయితే కరోనా వెలుగులోకి వచ్చిన అనంతరం పెళ్లి వేడుకలో సందడి తగ్గింది. పరిమిత సంఖ్యలో అతిధులను ఆహ్వానించడంతో .. పెళ్లి వేడుక అంటే వధువు, వరుడు తల్లిదండ్రులు మాత్రమే హాజరయ్యి జరుపుకున్నారు. దీంతో చాలామంది తమ వివాహ వేడుకని వాయిదా వేసుకున్నారు కూడా.. అయితే దేశంలో కరోనా తగ్గుముఖం పట్టింది. మరోవైపు వ్యాక్సినేషన్ కూడా వేగంగా జరుగుతుంది. పైగా ఇప్పుడు పెళ్లిళ్లు జరుపుకోవడానికి మంచి ముహర్తలు కూడా ఉన్నాయి. దీంతో గత 20 నెలలుగా నిలిచిపోయిన, వాయిదా పడిన పెళ్లిళ్లు ఈ నెల రోజుల్లో జరగబోతున్నాయి. ఇక విదేశాల్లో ఉన్న వారు కూడా స్వదేశం రావడానికి పెళ్లిళ్లు చేసుకోవడానికి రెడీ అవుతున్నారు.
దీంతో దేశ వ్యాప్తంగా లక్షలాది మంది ఇళ్లలో పెళ్లి వేడుకలు జరగబోతున్నాయి. బాజాభజంత్రీలు మ్రోగబోతున్నాయి. ఈనెల 20 న ముహూర్తం మంచిదని.. ఇప్పటికే అనేక కల్యాణ మండపాలు పెళ్లి వేడుకక్కి వేదికగా కానున్నాయని.. అందుకే ఇప్పటికే బుక్బా అయిపోయాయి. దాదాపు దేశ వ్యాప్తంగా 25 లక్షలకు పైగా పెళ్లిళ్లు జరుగుతాయని అంచనా వేశారు. నవంబర్ 21,27,28, డిసెంబర్ 8 తేదీల్లో ఉన్న ముహూర్తాలకోసం ఇప్పటికే ఫంక్షన్ హాల్స్, హోటల్స్ , పెసిలిటీస్ ఉన్న స్టార్ హోటల్స్ సహా ముందస్తుగా బుక్ అయినట్లు తెలుస్తోంది. భారత ట్రేడర్స్ అసోసియేషన్ అంచనా ప్రకారం 14 నవంబర్ నుంచి డిసెంబర్ 13 మధ్య కేవలం ఒక నెలలో 25 లక్షల వివాహాలు జరుగుతున్నాయని అంచనా. ఈ పెళ్లిళ్ల ద్వారా దేశ వ్యాప్తంగా 3 లక్షల కోట్ల వ్యాపారం జరిగే అవకాశం ఉంది. ఒక్క ఢిల్లీలోనే 1.5 లక్షల వివాహాలు జరుగుతున్నట్లు అసోసియేషన్ అంచనా వేసింది. ఈ ఢిల్లీలో పెళ్లిళ్ల కోసం 50,000 కోట్ల వ్యాపారం జరుగుతాయని అంచనా.
అంతేకాదు ఒక్క ఆంధ్రప్రదేశ్ లోనే లక్షకు పైగా వివాహాలు జరుగుతాయని తెలుస్తోంది. కరోనా ఆంక్షల్ని సవరించిన తర్వాత వచ్చిన ఆగస్టు శ్రావణమాసంలోని 13 రోజుల మహూర్తాలలోనే ఏపీలో 47 వేలకు పైగా వివాహాలు జరిగినట్లు తెలుస్తోంది. పెళ్లిళ్ల ముహూర్తాల సందడితో బంగారం షాపులు, బట్టల కొట్లు కిటకిట లాడుతున్నాయి. అయితే కూరగాయలు, పండ్లు, పువ్వులు సామాన్యులు వాపోతున్నారు. ఖర్చు ఎంత పెరుగుతున్నా పెళ్లి మేళం గట్టిగా వినిపించేందుకు ప్రజలు రెడీ అయ్యారు.
అయితే కరోనా సెకండ్ వేవ్ తగ్గుముఖం పట్టినా ఇంకా ఆ మహమ్మారి.. వదిలిపోలేదని ప్రజలు అర్ధం చేసుకోవాలని అధికారులు చెబుతున్నారు. లాక్‌డౌన్ ఆంక్షలు ఇప్పటికి పూర్తిగా ఎత్తివేయలేదు. అనేక రాష్ట్రాలు వివాహాలకు 250 మందిని మాత్రమే అనుమతించాయి. దేశ ఢిల్లీలో ఈ సంఖ్య 200కి పరిమితం చేయబడిం. అయితే NCR లో సమావేశ స్థలాలు 50% ఆక్యుపెన్సీ తో మాత్రమే వేడుకలు జరుపుకోవడానికి అనుమతించారు. ముంబైలో 50% ఆక్యుపెన్సీతో వేడుకలు జరుపుకోవడానికి అక్కడ ప్రభుత్వం అనుమతినిచ్చింది. మరోవైపు దేశ వ్యాప్తంగా హాస్పిటాలిటీ, ట్రాన్స్‌పోర్టేషన్ పరిశ్రమ కూడా ఈ పెళ్లిళ్ల సీజన్‌ను ఉపయోగించుకోవాలని భావిస్తున్నారు.
Also Read: ఈరోజు ఈ రాశివారు కొత్త ఇల్లు కొనుగోలు చేసే ప్రయత్నాలు చేస్తారు.. నేటి రాశి ఫలితాలు ఎలా ఉన్నాయంటే..