Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Horoscope Today: ఈరోజు ఈ రాశివారు కొత్త ఇల్లు కొనుగోలు చేసే ప్రయత్నాలు చేస్తారు.. నేటి రాశి ఫలితాలు ఎలా ఉన్నాయంటే..

Horoscope Today (November 18-11-2021):  జాతకాన్ని, రాశిఫలాలను విశ్వసించి రోజు మొదలు పెట్టేవారు చాలామంది ఉన్నారు. ముఖ్యంగా ఏ కొత్తపనిని మొదలు పెట్టాలన్నా...

Horoscope Today: ఈరోజు ఈ రాశివారు కొత్త ఇల్లు కొనుగోలు చేసే ప్రయత్నాలు చేస్తారు.. నేటి రాశి ఫలితాలు ఎలా ఉన్నాయంటే..
Follow us
Surya Kala

|

Updated on: Nov 18, 2021 | 6:24 AM

Horoscope Today (November 18-11-2021):  జాతకాన్ని, రాశిఫలాలను విశ్వసించి రోజు మొదలు పెట్టేవారు చాలామంది ఉన్నారు. ముఖ్యంగా ఏ కొత్తపనిని మొదలు పెట్టాలన్నా , శుభకార్యాలు మొదలు పెట్టాలన్నా ఈరోజు తమ జాతకం ఎలా ఉంది అంటూ.. తమ దినఫలాలపై దృష్టి సారిస్తుంటారు. ఈ నేపథ్యంలో ఈరోజు (నవంబర్ 18వ తేదీ ) గురువారం రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..!

మేష రాశి:  ధనాదాయ మార్గాలు పెరుగుతాయి. దీర్ఘకాలిక ఋణసమస్యల నుంచి బయటపడతారు. వృత్తి వ్యాపారాల ప్రారంభానికి అవరోధాలు అధిగమిస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. కీలక వ్యవహారాలలో ముఖ్య నిర్ణయాలు చేసి మంచి ఫలితాలు సాధిస్తారు. నూతన ఉద్యోగ యోగం ఉంది.

వృషభ రాశి:  చేపట్టిన వ్యవహారాలు సకాలంలో పూర్తవుతాయి ప్రయాణాలలో నూతన పరిచయాలు కలుగుతాయి సంతానానికి ఉన్నత విద్యావకాశాలు లభిస్తాయి. దూరప్రాంత బంధువుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. వృత్తి, ఉద్యోగ  సమస్యలను మనోధైర్యంతో అదిగమిస్తారు.

మిధున రాశి:  ఆర్థికవ్యవహారాలు లాభసాటిగా సాగుతాయి. స్థిరాస్తి వివాదాలకు పరిష్కార మార్గాలు చూస్తారు. కొన్ని రంగాల వారికి అనుకూల వాతావరణం ఉంటుంది. గృహ నిర్మాణ ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. బంధుమిత్రుల నుంచి కీలక సమాచారం సేకరిస్తారు. గృహమున కొందరి ప్రవర్తన చికాకు కలిగిస్తాయి.

కర్కాటక రాశి: మిత్రులతో వివాదాలను పరిష్కారమౌతాయి. స్థిరాస్తి కొనుగోలు యత్నాలు చేస్తారు. ఆకస్మిక ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు కొంత బాధిస్తాయి. ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోకపోవడం మంచిది కుటుంబ సభ్యులతో విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు.

సింహ రాశి: బంధు మిత్రులతో గృహమున ఆనందంగా గడుపుతారు. నిరుద్యోగులకు చాలా కాలంగా ఎదురుచూస్తున్న అవకాశాలు లభిస్తాయి. భూ సంబంధిత వివాదాలలో నూతన ఒప్పందాలు చేసుకుంటారు. కొన్ని వ్యవహారాలలో సోదరుల నుండి ఆశించిన సహాయం లభిస్తుంది. వృత్తి ఉద్యోగాలలో కీలక సమాచారం లభిస్తుంది.

కన్య రాశి:  సంఘంలో విశేషమైన గౌరవ మర్యాదలు పొందుతారు. బంధు మిత్రుల ఆదరణ పెరుగుతుంది. చేపట్టిన పనులలో జాప్యం కలిగినప్పటికీ నిదానంగా పూర్తిచేస్తారు. వ్యాపారాలలో స్వల్ప ధనలాభ సూచనలు ఉన్నవి. ఉద్యోగ విషయంలో సమయానుకూలంగా నిర్ణయాలు తీసుకుని లాభాలు పొందుతారు.

తుల రాశి: ఇంటా బయట పరిస్థితులు అనుకూలిస్తాయి. కుటుంబ సభ్యుల నుంచి ధన సహాయం లభిస్తుంది. దూర ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. దూర ప్రాంత బంధువుల నుండి శుభవార్తలు అందుతాయి. ఉద్యోగాలలో మీ పనితీరుకు అధికారుల నుండి ప్రశంసలు పొందుతారు. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు.

వృశ్చిక రాశి: నిరుద్యోగులకు నూతన అవకాశములు పొందుతారు. ఆర్థిక పరిస్థితి మరింత ఉత్సాహంగా సాగుతుంది. చేపట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి సోదరులతో పాత విషయాల గురించి చర్చిస్తారు. వృత్తి వ్యాపారాలలొ ఆశించిన లాభాలు పొందుతారు. ఉద్యోగులకు పని ఒత్తిడి పెరుగుతుంది.

ధనస్సు రాశి:  మిత్రులతో వ్యాపార విషయమై చర్చలు చేస్తారు కుటుంబ సభ్యులు నుండి అవసరానికి ధన సహాయం లభిస్తుంది. దూరప్రాంతాల బంధువుల నుండి ఆహ్వానాలు అందుతాయి. కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. అధికారుల అనుగ్రహంతో కొన్ని పనులలో విజయం సాదిస్తారు. నిరుద్యోగులకు నూతన ఉద్యోగ లబ్ధి పొందుతారు.

మకర రాశి: ఇతరులతో ఏర్పడిన వివాదాలు మిత్రుల సహాయంతో రాజీచేసుకుంటారు. దైవ సేవా కార్యక్రమాలకు హాజరు అవుతారు. వ్యాపార పరంగా నూతన అవకాశాలు జార విడవకుండా చూసుకోవాలి. నూతన వస్తు వాహన లాభాలు పొందుతారు. ఉద్యోగంలో స్వంత ఆలోచనలతో ముందుకు సాగడం మంచిది.

కుంభ రాశి:  వృత్తి, వ్యాపారాలలో నూతన ప్రోత్సాహకాలు అందుకుంటారు. ముఖ్యమైన వ్యవహారాలలో ఆకస్మిక విజయం పొందుతారు. శుభకార్యాలకు కుటుంబ సభ్యులతో హాజరావుతారు. నూతన గృహ కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. వృధా ప్రయాణాలు చేయవలసి రావచ్చు. పనుల్లో శారీరక శ్రమ తప్పదు.

మీన రాశి:  సన్నిహితుల నుండి వివాదాలకు సంభందించి కీలక సమాచారాన్ని సేకరిస్తారు. ఆత్మీయుల నుండి ఊహించని ఆహ్వానాలు అందుతాయి. క్రయ విక్రయాలు లాభసాటిగా సాగుతాయి. ఆర్థికంగా అనుకూల వాతావరణం ఉంటుంది. వృత్తి ఉద్యోగాలలో మీ ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది. దూర ప్రయాణాలు అనుకూలిస్తాయి.

Also Read:

అలసిపోయిన ప్రయాణికుల కోసం కొత్త సేవలు.. విశ్రాంతి తీసుకోవడానికి వీటి ఏర్పాటు..