TVS Apache: టీవీఎస్‌ అపాచీ ఆర్టీఆర్‌ 160 4వీ బైక్‌ విడుదల.. అద్భుతమైన ఫీచర్స్‌.. ధర ఎంతంటే..?

TVS Apache: టీవీఎస్‌ మోటార్‌ కొత్త అపాచీ బైక్‌ను మార్కెట్లో విడుదల చేసింది. 2021 టీవీఎస్‌ అపాచీ ఆర్టీఆర్‌ 160 4వీ ద్విచక్ర వాహనాన్ని బుధవారం విడుదల చేసినట్ఉ.

TVS Apache: టీవీఎస్‌ అపాచీ ఆర్టీఆర్‌ 160 4వీ బైక్‌ విడుదల.. అద్భుతమైన ఫీచర్స్‌.. ధర ఎంతంటే..?
Follow us
Subhash Goud

|

Updated on: Mar 10, 2021 | 7:22 PM

TVS Apache: టీవీఎస్‌ మోటార్‌ కొత్త అపాచీ బైక్‌ను మార్కెట్లో విడుదల చేసింది. 2021 టీవీఎస్‌ అపాచీ ఆర్టీఆర్‌ 160 4వీ ద్విచక్ర వాహనాన్ని బుధవారం విడుదల చేసినట్లు రెగ్యులేటరీ ఫైలింగ్‌లో కంపెనీ వెల్లడించింది. ఈ కొత్త బైక్‌ రెండు వేరియంట్లలో అందుబాటులోకి వచ్చినట్లు చెప్పారు. డిస్క్‌ వేరియంట్‌ ధర రూ.1,10,320, డ్రమ్‌ వేరియంట్‌ ధర రూ.1,07,270 (ఎక్స్‌షోరూం, ఢిల్లీ ధరలు)గా కంపెనీ నిర్ణయించింది. అయితే రేసింగ్‌రెడ్‌, నైట్‌ బ్లాక్‌, మెటాలిక్‌ బ్లూ మొత్తం మూడు రంగాల్లో అందుబాటులో ఉంటుందని పేర్కొంది.

ఇక టీవీఎస్‌ అపాచీ ఆర్టీఆర్‌ 160 4వీ కొత్త బూక్‌లో 159.7క సీసీ సింగిల్‌ సిలిండర్‌, 4 వాల్వ్‌, ఆయిల్‌ కూల్డ్‌ ఆధునాతన ఇంజీన్‌ అమర్చినట్లు తెలిపింది. 9,250 ఆర్‌పీఎం వద్ద 17.38 హెచ్‌పీ శక్తిని, 7,250 ఆర్‌పీఎం వద్ద 14.73 ఎన్‌ఎం టార్క్‌నిప్రొడ్యూస్‌ చేస్తుందని కంపెనీ తెలిపింది. కిల్‌ కార్బన్‌ ఫైబర్‌ నమూనాలతో సరికొత్త డ్యూయల్‌ టోన్‌సీటు,ఎల్‌ఈడీ హెచ్‌ల్యాంప్‌, క్లాస్ట్రైల్‌ పొజిషన్‌ ల్యాప్‌లు ఇలా ఎన్నో రకాల అద్భుతమైన ఫీచర్స్‌ ఉన్నట్లు తెలిపింది. ఫైవ్‌ స్పీడ్‌ సూపర్‌-స్లిక్‌ గేర్‌బాక్స్‌ కలిగిన ఈ బైక్‌ ఈ సెగ్మెంట్‌లో అత్యంత శక్తిమంతమైన రైడింగ్‌ కలిగి ఉంటుందని తెలిపింది. అలాగే పాత అపాచీతో పోల్చినట్లయితే ఈ కొత్త బైక్‌ రెండు కిలోల బరువు తక్కువ ఉంటుందని కంపెనీ తెలిపింది. డిస్క్ వేరియంట్ 147 కిలోల బరువు, డ్రమ్ వేరియంట్ 145 కిలోల బరువు ఉంటుంది. తాజాగా ఈ బైక్‌లో మంచి ఫీచర్స్‌ ఉన్నట్లు తెలిపింది.

ఇవి చదవండి :

Flipkart Smartphone Carnival: ప్లిప్‌కార్ట్‌ భారీ ఆఫర్లు.. 20 స్మార్ట్‌ ఫోన్‌లపై రూ. 10,000 వరకు డిస్కౌంట్‌

Andhra Bank: పాత ఆంధ్రా బ్యాంక్‌ కస్టమర్లకు అలర్ట్‌.. కొత్త నిబంధనలు.. గుర్తించుకోవాల్సిన విషయాలు

 రూ.13 వేలు తగ్గిన బంగారం