దేశంలో 11.5 కోట్ల పాన్ కార్డులు డీ యాక్టివ్ అయ్యాయి.. ఇందులో మీ కార్డ్ ఉందా ఇలా చెక్ చేసుకోండి.
ఈ నేపథ్యంలో ప్రస్తుతం దేశ వ్యాప్తంగా మొత్తం 11.5 కోట్ల పాన్ కార్డులు డీ యాక్టివేట్ అయ్యాయి. ఆధార్‌తో లింక్ చేయని కారణంగా ఈ పాన్ కార్డులను డీ యాక్టివేట్ చేసినట్లు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ తెలిపింది. దేశంలో మొత్తం 70.24 కోట్ల పాన్ కార్డులు ఉండగా. వీటిలో.. 57.25 కోట్ల పాన్ కార్డులు గడువు లోపు ఆధార్ కార్డుతో లింక్ అయ్యాయి. అలాగే 13 కోట్ల పాన్ కార్డులు ఆధార్‌తో లింక్ కాలేవు. అయితే కొందరికీ దీని నుంచి మినహాయింపు..
ఆధార్ కార్డును, పాన్ కార్డ్‌తో అనుసంధానం చేస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పలుసార్లు కేంద్రం గడువును పొడగిస్తూ వచ్చింది. తొలుత ఉచితంగా లింక్ చేసుకునే అవకాశం కల్పించింది. అయితే ఆ గడువు ముగిసిన తర్వాత ఫైన్ చెల్లించి ఆధార్ కార్డు, పాన్ కార్డ్ లింక్ చేసుకునే సౌలభ్యం కల్పించారు. అయితే ఇప్పుడు ఆ గడువు కూడా ముగిసింది. దీంతో ఆధార్‌తో లింక్ కానీ పాన్ కార్డులు నిరుపయోగంగా మారాయి.
ఈ నేపథ్యంలో ప్రస్తుతం దేశ వ్యాప్తంగా మొత్తం 11.5 కోట్ల పాన్ కార్డులు డీ యాక్టివేట్ అయ్యాయి. ఆధార్‌తో లింక్ చేయని కారణంగా ఈ పాన్ కార్డులను డీ యాక్టివేట్ చేసినట్లు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ తెలిపింది. దేశంలో మొత్తం 70.24 కోట్ల పాన్ కార్డులు ఉండగా. వీటిలో.. 57.25 కోట్ల పాన్ కార్డులు గడువు లోపు ఆధార్ కార్డుతో లింక్ అయ్యాయి. అలాగే 13 కోట్ల పాన్ కార్డులు ఆధార్‌తో లింక్ కాలేవు. అయితే కొందరికీ దీని నుంచి మినహాయింపు ఇవ్వగా ప్రస్తుతం సుమారు 11.5 కోట్ల పాన్ కార్డులను డీ యాక్టివేట్ చేశారు.
కొంత మంది ఆధార్, పాన్‌ను లింక్ చేశామన్న విషయాన్ని కూడా మర్చిపోయారు. ఇలాంటి వారు తమ పాన్ కార్డ్ యాక్టివ్‌లో ఉందో లేదో తెలుసుకునే అవకాశం కల్పించారు అధికారులు. ఇంతకీ మీ పాన్ కార్డ్ యాక్టివ్‌లో ఉందో, లేదో తెలుసుకునేందుకు కొన్ని స్టెప్స్ ఫాలో అయితే చాలు. ఇందుకోసం ఇన్‌కమ్ టాక్స్ ఈ ఫైలింగ్ అధికారిక వెబ్‌సైట్ ఓపెన్ చేయాల్సి ఉంటుంది.
ముందుగా ఆదాయపన్ను శాఖ ఈ ఫైలింగ్ అధికారిక వెబ్ సైట్ లోకి వెళ్లాలి. అనంతరం హోం పేజీలో లెఫ్ట్ సైడ్‌లో లింక్ ఆధార్ స్టటస్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. అనంతరం ఆ ఆప్షన్‌ను క్లిక్ చేయాలి. తర్వాత మీ పాన్ నెంబర్, ఆధార్ నెంబర్‌లను ఎంటర్ చేయాలి. తర్వాత వ్యూ లింక్ ఆధార్ స్టేటస్‌పై క్లిక్ చేయాలి. వెంటనే మీ పాన్, ఆధార్ కార్డ్ లింక్ అయ్యిందో లేదో డిస్‌ప్లే అవుతుంది. ఒకవేళ లింక్ కాకపోతే మీ పాన్ డీ యాక్టివేట్ అయ్యిందని అర్థం.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..